పట్టాలు తప్పిన లక్ష్యాలు.. దూసుకెళ్తున్న నిర్లక్ష్యాలు

Train Accident (File)
Train Accident (File)

 పట్టాలు తప్పిన లక్ష్యాలు.. దూసుకెళ్తున్న నిర్లక్ష్యాలు

లక్ష్యాలు గొప్పవే కాని నిర్లక్ష్యాలే ప్రమాదకరం. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైల్వేశాఖలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు గొప్పగా ప్రకటించింది. దేశంలో కొన్ని లక్షల మంది ఈ ప్రకటనలకు పరవ శించారు.కానీ వాస్తవాలను పరిశీలిస్తే అవన్నీకాగితాలపైనే ఉన్నాయి తప్ప ఆచరణ లోకి రాలేదు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలో రైల్వేశాఖ బండారం బయటపడింది.

మొత్తం 74 స్టేషన్లలో 80 రైళ్లలో కేటరింగ్‌ కేంద్రాల్లో కేంద్రీకృతమైన నిర్లక్ష్యం, అపరిశుభ్రత, నిర్వహణలోపం ఇవన్నీ ‘కాగ్‌ బయటపెట్టింది. ఈ నివేదిక వచ్చిన సమయంలోనే రైల్వే కాటరింగ్‌ ఒక ప్రయాణికుడికి సరఫరా చేసిన బిర్యానీ ప్యాకెట్‌లో చచ్చిన బల్లి బయటపడడం, ఆ బిర్యానీని ఆరగించిన ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడం ఇవ న్నీ కాగ్‌ నివేదికకు సాక్ష్యంగా నిలిచాయి. జార్ఖండ్‌ నుంచి ఉత్తర ప్రదేశ్‌ వెళ్తున్న పూర్విఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది.దీన్ని బట్టి ప్రయాణికులకు కావలసిన కనీస సదుపాయాలు కూడా సమకూర్చ లేని నిర్లక్ష్యం రైల్వేలో కొనసాగుతుందని స్పష్టమవ్ఞతోంది. ఎన్‌డిఎ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధి గురించి బడ్జెట్‌లో ఎన్నో ప్రతిపాదనలు చేసింది.

రానున్న అయిదేళ్లలో ప్రయాణికుల భద్రత నిధి పేరున ప్రత్యేకంగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ట్టు ప్రకటించింది. రైల్వేల అభివృద్ధికి అయిదేళ్లలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది 3500 కిలోమీటర్ల మేర కొత్త మార్గాల నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇవన్నీ చెప్పడానికి, వినడానికి బాగానే ఉన్నా ప్రయా ణికులకు ఇంతవరకు అందించిన సేవలు, సౌకర్యాలు ఎంతవరకు నాణ్యమైనవిగా ఉన్నాయన్నది ప్రశ్నార్థకమే.కేటరింగ్‌విధానం చాలా లోపభూయిష్టంగా తయారైంది. ఒకప్పుడు రైల్వేశాఖే స్వయంగా కేటరింగ్‌ నిర్వహించేది. అయితే ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో ప్రయివేట్‌ రంగానికి అప్పగించింది.

అదీ కూడా సరైన పర్యవేక్షణ ఉండడం లేదు. తరచుగా ఈనిర్వహణ బాధ్యతలను మారుస్తున్నారు. కేటరింగ్‌ సంస్థల ఎంపికలో సరైన విధానం పాటించడంలేదు.ఏయే ప్రమాణాలపై కేటరింగ్‌ సంస్థలను ఎంపిక చేస్తున్నారో బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచుతు న్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతఏడాది 16కాంట్రాక్టు సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టామని, మరికొందరిపై లక్షల రూపాయల వంతున జరిమానా వేశామని చెబుతున్నా చివరికి ఫలితం ఏమైంది? ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తే పాచిపోయినవి ప్రయాణీకులకు అందచేస్తున్నారు.

పాత బిస్కెట్‌ ప్యాకెట్లను, ఇతర పదార్థాలను ప్రయాణికులకు అంటగడుతున్నారు.పాలు,పండ్లరసాలు,టీ, కాఫీల కు మురికినీటినే వాడుతున్నారని కాగ్‌ వెల్లడించింది. పాంట్రీ కారు ల్లో, వంటగదుల్లో ఎలుకలు, బొద్దింకలు గుంపులు గుంపులు గా మసలాడుతున్నాయని, అందకనే బిర్యానీ వంటి ఆహార పదా ర్థాల ప్యాకెట్లలో చచ్చిన బల్లులు,బొద్దింకలు కనపడుతుండడం వింతేమీ కాదని ‘కాగ్‌ ఆక్షేపించింది. ఆహారపదార్థాల ధరల విషయం లోనూ చాలాతేడా కనిపిస్తోంది.బయట మార్కెట్‌ ధరలకన్నా చాలా ఎక్కువ ధరకు రైల్వే ఫ్లాట్‌ఫారాలపై, కోచ్‌ల్లో అమ్ముతున్నారు. ప్యాసింజర్‌ కోచ్‌ల్లో అనధికారికంగానే అమ్మకాలు జరుగుతున్నాయి.

ప్రయాణికు లకు అందించే దుప్పట్లు, తెరలు నెలల తరబడి శుభ్రం చేయడం లేదని కాగ్‌ ఆక్షేపించింది. సూపర్‌ఫాస్ట్‌ రైళ్లపేరు చెప్పి ప్రయాణికుల దగ్గర నుంచి అదనంగా 11.17 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నదానికి తగ్గట్టు రైళ్లు నడపడంలేదు. ఈ రైళ్లు బయలుదేరు తున్న సమయాన్ని, గమ్యాన్ని కూడా కాగ్‌ పరిశీలించింది. 95 శాతం రైళ్లు పాత పద్ధతిలోనే సాగుతున్నాయని ‘కాగ్‌ వెల్లడించింది.

ఇక విద్యుద్దీకరణ సంగతి చెప్పనక్కరలేదు. మూడేళ్ల క్రితం కోల్‌కతా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సరఫరా అయి న ఆహారంలో బొద్దింక బయటపడింది. దీనిపై క్యాటరింగ్‌తోపాటు టూరిజం కార్పొరేషన్‌కు లక్ష రూపాయల వరకు పెనాల్టీ విధించా రు. ప్రయివేట్‌రంగానికి అప్పగించినా లోపాలు షరామామూలే కావ డంతో కేటరింగ్‌ పాలసీలో మార్పుతేడానికి ప్రయత్నిస్తున్నారు. కేటరర్స్‌ను గుర్తించడం, ధరల నిర్ణయం నాణ్యతలో పారదర్శకత, బయటి ఆడిటర్లచే తనిఖీలు చేయించడం ఇవన్నీ అమలులోకి వస్తే కానీ కేటరింగ్‌లో మార్పురాదు.ప్రభుత్వ సంస్కరణల్లోభాగంగా దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నరైల్వే డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది.దీనివల్ల టారిఫ్‌,ప్రమాణాలు నిర్ణయమవ్ఞతాయి.ప్యాసింజర్‌ సర్వీస్‌లకు సంబంధించి ఈ సంస్కరణల ప్రభావం కనిపించడం లేదు.లైసెన్సు లేకున్నా ఆయా వెెండర్లకు కోచ్‌లు స్వాగ తం ఇస్తు న్నారు. వారు ఏది ఎంత రేటుకు అమ్మినా అడిగే వారు కానీ, అడ్డు కునేవారు కానీ ఉండడం లేదు.

అయితే ప్రయాణికుల ఫిర్యాదులను విచారించడానికిఒక వ్యవస్థను రూపొందించామని రైల్వేశాఖ చెబు తున్నా ఎవరికి ఎంతవరకు న్యాయం జరిగిందో చెప్పలేం. దేశ ఆర్థికాభివృద్ధికి రైల్వేవ్యవస్థ జీవనాడి వంటిది. 1950 ప్రాంతంలో దేశ ప్రయాణికుల్లో 74 శాతంమంది రైలులోనే ప్రయాణం చేసే వారు. ఇప్పుడు ఆ శాతం ఎనిమిది శాతానికి దిగజారింది. అంటే రైల్వేవ్యవస్థ నిర్వహణ తీరుఎలా ఉందో తెలుస్తుంది. సరకురవాణా 86శాతం నుంచి 36శాతానికి పడిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల నేతలు రైల్వేమంత్రులుగా ఎక్కువకాలం పనిచేశారు. వీరం తా తమ స్వార్థరాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా శాఖను వాడుకున్నా రే తప్ప ప్రయాణికుల సౌకర్యాల గురించి పట్టించుకో లేదు. ఆయా నేతలు తమ ప్రాంతాలకే కొత్తరైళ్లు, రైలు మార్గాలు ప్రకటించుకునే సంప్రదాయం చాలా ఏళ్లు కొనసాగింది.

లాలూప్రసాద్‌ యాదవ్‌ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు తన అత్తగారి గ్రామానికి కూడా రైలు మార్గం, కొత్త రైలు వేసుకున్నారు. రైల్వేశాఖ వచ్చే రాబడిలోని ప్రతి రూపాయిలో 94 పైసలు ఖర్చులకే సరిపోతోంది. వచ్చే ఏడాది రాబడి అంతా ఖర్చులకే సరిపోతుందని మిగులు ఏవిూ ఉండకపో వచ్చని ఆర్థికసంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. గత ఏప్రిల్‌ డిసెంబర్‌ మధ్యకాలంలో సరకు రవాణా ఛార్జీల ద్వారా 81వేల కోట్ల వరకు ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా వచ్చింది మాత్రం 75,222 కోట్లు ప్రయాణికుల నుంచి వచ్చే రాబడి లక్ష్యం 1.84 లక్షల కోట్లలో ఆరు శాతం వరకు తగ్గుదల ఉండవచ్చునని తెలుస్తోంది. ప్రయాణికుల నుంచి రాబడి పిండుకో వడం ఒక్కటే రైల్వేశాఖ లక్ష్యం కారాదు.

– పెట్ల వెంకటేశం