నెంబర్‌ గేమ్‌లో విజేత ఎవరో?

రాష్ట్రం : తమిళనాడు

TAMIL NADU
Panner SElvam, Sasikala

నెంబర్‌ గేమ్‌లో విజేత ఎవరో?

తమిళనాడులో భవిష్యత్‌ ముఖ్యమంత్రిని నిర్ణ యించడంలో మెజారి టీనే కీలకంకావడంతో అక్కడ ఇప్పు డు నెంబర్‌ గేమ్‌లో విజేత ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటి వరకు తమిళనాడు ఇన్‌చార్జీ గవర్నర్‌ సి.హెచ్‌.విద్యాసాగర్‌రావ్ఞ బలనిరూ పణకు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. కానీ వచ్చేవారంలో ఏరోజు అయినా బలపరీక్షకు అనుమతి ఇస్తారని ఊహా గానాలు వస్తుండడంతో అసెంబ్లీలో మెజారిటీ విజేత ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు పూర్తిఅయి ఏడాది కూడా గడవ లేదు.2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివం గత జయలలిత ఘనవిజయం సాధించారు.
ఇది ఆ రాష్ట్రచరిత్రలోనే చారిత్రాత్మకం. ఎందుకంటే ద్రవిడ రాజకీయాల నిలయమైన తమిళనాడులో 1984 నుంచి డిఎంకె లేదా ఎఐడిఎంకెలు రొటేషన్‌ పద్ధతి మాదిరిగా అధికారంలోకి వస్తున్నాయి.ఈ రెండు పార్టీ లే ఏదో ఒక పార్టీ విజయం సాధిస్తుండగా మరోపార్టీ ప్రతిపక్షపార్టీగా ఉంటూవస్తున్నది. కానీ ఈ సంప్రదా యానికి భిన్నంగా ఓటర్లు ఈసారి తీర్పు ఇచ్చారు. వరుసగా రెండోసారి జయలలిత సారధ్యంలోని ఎఐడి ఎంకె అధికారంలోకి రావడం పరిశీలకులనే ఆశ్చర్యా నికి గురిచేసింది. నిజానికి ఈ ఎన్నికల్లో జయలలిత ఒంటరి పోరాటమే చేసింది.అటు విపక్ష డిఎంకె కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయగా బిజెపి, విజయకాంత్‌ నేతృత్వంలోని పీపుల్స్‌వెల్‌ఫేర్‌ ఫ్రంట్‌లతో ఆమె ఒంటరిగా చతుర్ముఖ పోరాటంచేశారు. ఆమె చేపట్టిన సంక్షేమ పథకాలు మెజారిటీగా ఉన్న పేద,మధ్య తర గతిని ఆకర్షించడంతో అక్కడి ఓటర్లుతమ సహజ సంప్ర దాయ శైలికి భిన్నంగా తమ జీవితాలను మెరుగుపరుస్తున్న జయలలితకు జై కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. మొత్తం 232స్థానాలు ఉన్న అసెంబ్లీకి ఈ ఎన్నికలు జరిగితే జయలలిత పార్టీకి 134 సీట్లు రాగా విపక్ష డిఎంకెకు 89, కాంగ్రెస్‌కు 8, ఐయుఎమ్‌ఎల్‌కు ఒక సీటు వచ్చింది. విజయం సాధించినజయలితకు 41శాతంఓట్లు రాగా,విపక్షమైన డిఎంకెకు40 శాతంఓట్లువచ్చాయి. కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో జయలలిత మెజారిటీ కన్నా 17 సీట్లు అధికంగా సాధించారు.అయితే ప్రభుత్వవ్యతిరేక ఓట్లు అన్ని చీలడంతో జయలలితకుకలిసి వచ్చింది.కానీ ఏడాదిలోపే జయలలిత అస్వస్థురాలై 70 రోజులు అపోలో హాస్పిటల్‌లోఉండడం ఆతర్వాత మరణించ డంతో అక్కడ రాజకీయ శూన్యం ఏర్పడింది. సాధా రణ జీవితంలో, రాజకీయ, సినీ జీవితంలో అనేక డక్కామొక్కిలు తిన్న జయలలిత తన చివరి దశలో కూడా తన ఆస్తులకు, రాజకీయాలకు వారసులను ప్రకటించకుండానే కన్నుమూశారు.దీంతో ఆమె మరణం మిగిల్చిన శూన్యం భర్తీ కాకపోవడంతో రాజ కీయ అనిశ్చితి ఏర్పడింది.ఆమె నిజవారసుడు ఎవరో తేల్చకుండానే చనిపోవడంతో ఇప్పుడురాజకీయ సంక్షో భం ఏర్పడింది.

ఇప్పటిదాకా ఆమెకు నెచ్చెలిగా ఉన్న శశికళ, ఆమెకష్టకాలంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్‌సెల్వంలు ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతున్నారు. జయలలిత మరణించిన తర్వాత కొద్ది రోజులు క్రి యాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న శశికళ ఒక్క సారిగా తెరపైకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని ఆశ పడ్డారు.ముఖ్యమంత్రిగాఉన్న పన్నీర్‌సెల్వంను రాజీనా మా చేయించి ఎఐడిఎంకె శాసనసభ పక్ష నేతగా కూడా ఎన్నికయ్యారు.ఇక ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ముఖ్య మంత్రిగా ఉన్న తనను శశికళ బలవంతంగా రాజీనా మా చేయించారని, ఆమెకు ప్రభుత్వం ఏర్పాటు చేయ డానికి అవకాశం ఇవ్వొద్దని పన్నీర్‌ సెల్వం గవర్నర్‌ విద్యాసాగర్‌రావ్ఞను కోరారు. తనకు131మంది ఎమ్మె ల్యేల బలం ఉందని శశికళ గవర్నర్‌కు చెప్తుండగా ఈ సంఖ్య నిజంకాదని ఇందులో ఎక్కువగా ఫోర్జరీ సంత కాలు బలవంతపు అంగీకారాలు ఉన్నాయని సెల్వం చెప్తుండడంతో గవర్నర్‌ విద్యాసాగర్‌రావ్ఞ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

దీనికితోడు శశికళపై అక్రమ ఆస్తుల కేసు కూడా ఉంది. ఈ సమయంలో ఆమెను ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కోర్టు తీర్పు దోషిగా వస్తే మళ్లీ మరో ముఖ్యమంత్రిని నియమించాల్సిన పరిస్థితి ఉంది. దీనికితోడు తెరవెనుక సెల్వంకు విపక్ష డిఎంకెతోపాటు కేంద్రంలోని బిజెపి ఆశీస్సులున్నా యి. ముఖ్యంగా నరేంద్రమోడీ శశికళకు వ్యతిరేకంగా ఉన్నారు.దీంతో నెంబర్‌ గేమ్‌ ఇప్పుడు గవర్నర్‌ కోర్టు కు చేరింది. ఒకవేళ గవర్నర్‌ బలపరీక్షకు సమయం ఇచ్చి ఆదేశాలుఇస్తే ఆలోపు సెల్వం బలంపుంజుకోవ చ్చు. శశికళ నేతృత్వంలోని 20 మంది ఎమ్మెల్యేలు జంపు అయినా సెల్వం డిఎంకె మద్దతుతో ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.డిఎంకెకు ఉన్న 89+కాంగ్రెస్‌8+ఐయుఎమ్‌ఎల్‌ 1 కలిపితే 98 సీట్లుఉన్నాయి. వీరు మద్దతు ఇస్తే ఇంకో 19 మంది ఎమ్మెల్యేలు వచ్చినా సెల్వం మాజిక్‌ ఫిగర్‌ 117ను సాధించి బలపరీక్షలో నెగ్గవచ్చు. లేదా సమాన మెజా రిటీ వస్తే స్పీకర్‌ధనపాలన్‌ కీలకపాత్ర వహించవచ్చు. లేదంటే డిఎంకె కాంగ్రెస్‌ కలిసి ఎఐడిఎంకెలో 20 మందినిచీల్చినా డిఎంకె అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితేదీనికి ఫిరాయింపుల చట్టం అడ్డంకిగా ఉంది.ఇదికాక సంక్షోభందీర్ఘకాలం సాగితే శాంతిభద్ర తల సమస్యకూడా తలెత్తవచ్చు.దీంతో తమిళనాడులో మరుక్షణంలో ఏమి జరుగుతుందో కొత్త ప్రభుత్వం వస్తుందో లేక రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి తలె త్తుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.

-మిట్టపల్లి శ్రీనివాస్‌