నీటిలో పొంచి ఉన్న ఆర్సెనిక్‌ ముప్పు

WATER
WATER

నీటిలో పొంచి ఉన్న ఆర్సెనిక్‌ ముప్పు

భూగర్భజలాలు అడుగంటే కొద్దీ లక్షల మందికి నీరు దొరకడం ఎడారిలో ఎండమావిగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కొద్దిపాటి భూగర్భజలాలు కూడా కాలుష్యపూరితమై వ్యాధులను సంక్రమింప చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్సెనిక్‌ స్థాయి భూగర్భజలాల్లో రానురాను పెరిగి ప్రజల ఆరోగ్యాలకు ముప్పు తెస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తు న్నారు. మంచినీటిలో బిలియన్‌కు 10భాగాలు వంతున (పార్టుపెర్‌ బిలియన్‌)ఆర్సెనిక్‌ స్థాయిఉంటే పరవాలేదని అంతకన్నా మొతాదు ఎక్కువైతే వ్యాధులు కోరివస్తాయని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఐపిఎ) వెల్లడిస్తోంది.

లోహాల మాదిరిగా ఆర్సెనిక్‌ భూమి పొరల్లో ఉంటుంది. ప్రకృతిలో వచ్చేమార్పులవల్ల ఆర్సెనిక్‌ వాతావ రణంలోకి, భూగర్భజలాల్లోకి ఎక్కువగా విస్తరిస్తోంది.ఆర్సెనిక్‌ మో తాదు ఎక్కువైతే శ్వాసకోశవ్యాధులు, చర్మవ్యాధులు, మూత్రపిండా ల వ్యాధులతోపాటు క్యాన్సర్‌ కూడా దాపురిస్తుంది. దేశంలో ప్రతి వెయ్యి మందిలో 50మంది ఆర్సెనిక్‌ కారణంగా వ్యాధిగ్రస్తులవ్ఞతు న్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని బాదర్‌పూర్‌, రాజ్‌ఘాట్‌ విద్యు త్‌ ఉత్పత్తిప్లాంట్ల నుంచిఆర్సెనిక్‌ హెచ్చుశాతం విడుదల అవుతుంది.

ఈ ప్లాంట్ల నుంచి ఏర్పడే కలుషిత నీరు వల్ల ఢిల్లీచుట్టుపక్కల భూగర్భజలాల్లో ఆర్సెనిక్‌ 180 భాగాలకు చేరుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కోసారి 200 పిపిబి వరకుస్థాయి పెరుగుతోందని అంటున్నారు. మనదేశంలోని ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం రాష్ట్రాల్లో ఆర్సెనిక్‌ ప్రభావం విపరీ తంగా ఉంటోంది. పశ్చిమబెంగాల్‌లోని 12 జిల్లాల్లో లక్షపైచేయి. వేల మంది ప్రజలు అలాగే కోల్‌కతా నగరం 78 వార్డుల్లోని ప్రజ లు ఆర్సెనిక్‌ పీడితులవ్ఞతున్నారు. ఆసియాలోని 30 దేశాల్లో భూ గర్భజలాలు ఆర్సెనిక్‌తో నిండి ఉంటున్నాయి.

బంగ్లాదేశ్‌, చైనా, తైవాన్‌, లాపోస్‌, కాంబోడియా, మయన్మార్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, అర్జెంటీనా, మెక్సికో, చీలి దేశాల్లోనూ ఈ ఆర్సెనిక్‌ భూతం వ్యాపి స్తోంది. అమెరికాలోని మిల్‌ఫోర్డు తదితర ప్రాంతాల్లో బోరుబావ్ఞ ల్లో ఆర్సెనిక్‌ ఉన్నట్టు అక్కడి ప్రజలు మొదట తెలుసుకోలేక గత పాతికేళ్ల నుంచి వ్యాధుల బారిన పడవలసి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎక్కడ బావి తవ్వినా నీటిని పరీక్షించి ఆర్సెనిక్‌ లేదని తేలి తేనే ఆ నీటిని వాడుతున్నారు.

ఆహార పదార్థాల్లోనూ ఇది విస్తరి స్తోందని అంటున్నారు.ప్రపంచఆరోగ్యసంస్థతోపాటు పశ్చిమబెంగా ల్‌ యూనివర్శిటీ ఖరగ్‌పూర్‌ ఐఐటి వారు భూగర్భజలాల్లోనూ, వాతావరణంలోనూ పంటల్లోనూ ఆర్సెనిక్‌ ఏవిధంగా విస్తరిస్తోంది, ఏవిధంగా ముప్పు కలిగిస్తోంది పరిశోధిస్తున్నారు. నీటిలో కరిగి ఉన్న ఆర్సెనిక్‌ వడపోసే విధానాలను రూపొందిస్తున్నారు. సహజ సిద్ధమయిన చిన్నరాళ్లతో కూడిన లాటిరైట్‌ మట్టిని ఉపయోగించి ఆర్సెనిక్‌ నీటిని శుద్ధి చేయవచ్చని నిరూపిస్తున్నారు.

చాలా అధిక ధరకు లభించే పటిక కూడా ఆర్సెనిక్‌ నీటిని శుద్ధి చేస్తుందని ఈ సందర్భంగా మెడికల్‌ కాలేజీ శాస్త్రనిపుణులు సూచిస్తున్నారు. అర్సె నిక్‌ను ఏమాత్రం గ్రహించలేని వరివంగడాలను అభివృద్ధిచేసి రైతు లకు సరఫరా చేయడానికి పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోం ది. పాలల్లో ఆర్సెనిక్‌ శాతం తగ్గించడానికి పశువ్ఞలకు గడ్డితోపాటు సోడియం థయోసల్ఫేట్‌ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. అమెరికాలో శాస్త్రవేత్తలు గర్భిణులపై ఆర్సెనిక్‌ ఎటువంటి ప్రభావం చూపిస్తుం దో పరిశీలించే ప్రయోగాలు నిర్వహించారు.

గర్భిణుల్లో పోషక విలువలు బాగా క్షీణించి, పుట్టబోయే బిడ్డల ఎదుగుదలకు ఆర్సెనిక్‌ ఆటంకమవ్ఞతుందని కనుగొన్నారు. అమెరికాలోని సైన్స్‌కేఫ్‌ వంటి సంస్థలు ఆర్సెనిక్‌ మహమ్మారిని నివారించడానికి నడుం కట్టాయి. మనదేశంలోనూ సేవాసంస్థలు ప్రభుత్వంతోకలిసి ఆర్సెనిక్‌ నివార ణకు ముందడుగు వేయాలి. అధికఖర్చుతో లభించే పటికను గ్రామీ ణ ప్రాంతాలకు సరఫరాచేసి ఆర్సెనిక్‌నీటిని శుద్ధిచేయడానికి పూను కుంటే సత్ఫలితాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

– దొరయ్య