నీటిపారుదలలో నూతన అధ్యాయం

water
water

పని చేయాలనుకునేవారికి దారి దొరుకు తుంది. వద్దు అనుకునేవారికి సాకు దొరుకుతుందంటారు. ఇన్నేళ్లుగా, ఇన్నాళ్లుగా తెలుగురాష్ట్రాల నుండి వేలాది టిఎంసిల నీరు వృధా గా సముద్రం పాలవ్ఞతున్నా చర్చలు, అనుమతులు, అధ్యయనాలు, కేసులు,ఆరోపణలు, ప్రత్యారోపణలు, కమిటీలు, సమీక్షలతో కాలక్షేపం చేశారే కానీ ఆ నీటిని ఒడిసిపట్టి బీడుభూములకు తరలించే గట్టి ప్రయత్నం జరగలేదని చెప్పొచ్చు.ఎట్టకేలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం భగీరథ ప్రయత్నంతో గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడుభూము లకు మళ్లించి ఆ ప్రాంతాలనుండి కరవ్ఞ రక్కసిని శాశ్వ తంగా పారద్రోలే కార్యక్రమం సఫలీకృతమవ్ఞతున్నది. ఈ బహుబలి ప్రాజెక్టును తెలంగాణ ప్రజల కలలను సాకా రం చేసేలా రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావ్ఞ సోమవారం మధ్యమానేరులో గోదావరి జలాలకు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వచ్చే ఖరీఫ్‌ నుండి గోదావరి జలాలు ప్రాజెక్టులోని మిగిలిన ఆయకట్టు ప్రాంతాలకు కూడా నీరు అందించేందుకు ఇంజనీర్లు సంబంధిత అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.తెలంగాణాలోని అత్యధిక జిల్లాలకుసాగునీరు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును మూడేళ్లలోపే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ఆధునికమైన అతిపెద్ద ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 139 మెగావాట్లు గరిష్ట సామర్థ్యం కలిగిన పంపులను అమర్చారు.గోదావరి నీటిని సముద్ర మట్టానికి92 మీటర్ల ఎత్తు నుండి వివిధ దశల్లో ఎత్తిపోతల పథకం ద్వారా ఎక్కడికక్కడ ఆయకట్టుకు నీటిని అందిస్తూ 618 మీటర్ల ఎత్తుకు పంపుచేస్తూ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్నా రు.ఇలా అనేక ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ప్రాజె క్టును తెలంగాణ వరదాయినిగా అభివర్ణించవచ్చు. కాళేశ్వ రం ద్వారా దాదాపు 75 లక్షల ఎకరాలకుపైగా నీరు అం దించి రెండు పంటలు పండే విధంగా రూపుదిద్దుతున్నా రు. ఈ నీటి నిల్వల వల్ల భూగర్భజలాలు పెరిగి మరో 20లక్షల ఎకరాలకు అదనంగా సాగుకు అవకాశాలు ఏర్ప డతాయి. ఇక తాగునీరు సమస్య కూడా చాలావరకు పరి ష్కారం అవ్ఞతుంది.మరొకపక్క ఆంధ్రప్రదేశ్‌కు సంబంధిం చికూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ రాష్ట్ర పరిస్థితి కూడా ఎంతో మెరుగుపడుతుంది.కానీ రాజకీయవివాదాల కారణంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం ఇంకా నత్తనడక నడు స్తున్నదనే చెప్పొచ్చు. మరో రెండేళ్లలోపు పూర్తవ్ఞతుందని చెప్తున్నా ఆ పరిస్థితులు ఏమీ కన్పించడం లేదు. వాస్త వంగా తెలుగు రాష్ట్రాల్లో చిన్న,పెద్ద నదులు కలిపి దాదా పు నాలుగువందలకుపైగా పొంగిపొర్లుతున్నాయి. ఏటా సరాసరి మూడు,నాలుగువేలకుపైగా టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నది. ఈ పార్టీ, ఆ పార్టీఅని తేడాలేకుండా ఎవరు అధికారంలో ఉన్నా సాగు నీటి విషయంలో సమర్థవంతంగా వ్యవహరించలేదనే చెప్పొచ్చు.దీనికితోడు పాలకుల పక్షపాతం, అవగాహనా రాహిత్యం, కొందరు అధికారుల దుర్బుద్ధి కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు తీరని అన్యా యం జరిగింది. అందులో తెలంగాణ రాయలసీమతో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఫలితంగా వరుస కరవ్ఞలు,దుర్భిక్షం,వలసలు, ఆకలిచావ్ఞలు, ఆత్మ హత్యలతో ఆ ప్రాంతాలు నీటికి అల్లాడిపోతున్నాయి. అతిపెద్ద నీటివనరు అయిన గోదావరి, కృష్ణానదులు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రవహిస్తున్నా బంగారం పండే సారవంతమైన భూములున్నా ఆరుగాలం కష్టపడి రక్తాన్ని చిందించి ఉత్పత్తులుపెంచే శ్రమజీవ్ఞలున్నా కేవలం సాగు నీటిసౌకర్యం లేని కారణంగా అవన్నీ నిరుపయోగమవ్ఞ తున్నాయి.ఏటా లక్షలాది ఎకరాలకుసరిపోయే నీరు పాల కుల చేతకానితనాన్ని ఎత్తిచూపుతూ సముద్రం పాలైపోతు న్నాయి. మరొకపక్క అటు ఆంధ్రప్రదేశ్‌లో కానీ, ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ వేలాది గ్రామాలు గుక్కెడు మంచినీటి కోసం కూడా అలమటిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే మంచినీటి వ్యాపారం కొన్ని వందల కోట్లల్లో నేటికీ జరుగుతున్నది. దశాబ్దాలుగా బీడుబారిన భూముల కు నీరు అందించాలని,ఎండిపోతున్న గొంతుల్లో గుక్కెడు నీరుపోయాలనే ఏకైక లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ముందువెనుక ఆలోచించకుండా వ్యయం గురించి వెరవ కుండా నడుంకట్టారు, పూర్తి చేశారు. ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు తమ జీవనానికి ఒక దారి దొరికిందని మెట్టప్రాంత ప్రజ లు ఆనందించే రోజులు వచ్చాయి.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాగునీటి రంగానికి కొంత ప్రాముఖ్యతఇచ్చినట్లు కన్పించినా అది శంకుస్థాపనలకు, ప్రకటనలకే పరిమితమ య్యాయి. తగినంత నిధులు కేటాయించకపోవడం, ఆర్థిక పరిస్థితుల్లో సమగ్రమైన మార్పు తీసుకురాగలిగిన ప్రాజె క్టులపై ఆసక్తి,అవగాహన ఆనాటి పాలకులకు లేకపోవడ మే కారణం.నాగార్జునసాగర్‌, శ్రీశైలం,శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు లు లేకుండా తెలుగురాష్ట్రాల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే ఊహకే అందదు.ఈ మూడుప్రాజెక్టులు తప్పస్వాతంత్య్రం వచ్చిన తర్వాత మరో భారీ ప్రాజెక్టుకు అంకురార్పణే జరగలేదు.ఈ ప్రాజెక్టుల నిర్మాణంకూడా దశాబ్దాలతరబడి కొనసాగిందనే చెప్పొచ్చు.జనాకర్షణ పథకాలకోసం వేలాది కోట్లరూపాయలు మంచినీళ్లలా ఖర్చుపెట్టిన నేతలు ప్రాజె క్టుల నిర్మాణానికి అవసరం మేరకు నిధులు కేటాయించ లేదనేది కాదనలేని వాస్తవం. ఫలితంగా కృష్ణా,గోదావరి నదుల్లో మిగిలిన నీటినేకాదు కేటాయించిన నీటిని కూడా ఉపయోగించుకోలేకపోయాం. ఏదిఏమైనా ప్రపంచంలోనే అతిపెద్ద బహుళదశల కాళేశ్వరం బహుళార్థకసాధక ఎత్తి పోతలపథకం నిర్మాణంద్వారా సాగునీటిరంగంలో తెలం గాణప్రభుత్వం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/