నిషిద్ధ మందుల వాడకం ప్రాణాంతకం

BANNED
BANNED

నిషిద్ధ మందుల వాడకం ప్రాణాంతకం

మహారాష్ట్రలో పంటలపై చల్లిన క్రిమిసంహారక మందు లు వికటించి కొన్ని వందల మంది రైతులు తీవ్ర అస్వస్థులు కాగా దాదాపు 11మంది ప్రాణాలు కోల్పో వడం దేశమంతటా చర్చనీయాంశం అయింది. నిషేధించిన క్రిమిసం హారక మందులను వాడడంవల్లనే ఈ దుర్ఘటనలు సంభవిస్తున్నా యని నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణలోని జయశంకర్‌ జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రాపురంలో పురుగుల మందు పిచికారీ చేసి వ్యవసాయ కూలీ సోడిబాలకృష్ణ (25) తీవ్ర అస్వస్థ తకు గురై గురువారం రాత్రి (19వ తేదీ ) మృతిచెందాడు. మంగం పేట మండలం బుచ్చం పేటలో మద్దెల నరేందర్‌ (28) పురుగుల మందు పిచికారీ వికటించి అదేరోజు మృతిచెందాడు. మరో వ్యవసా య కూలీ గాంధారి నాగమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మొత్తం 66 క్రిమిసంహారక మందుల్లో 18 మందులు అత్యంత విషపూరితమైనవని వాటిని పంటలపై చల్లితే ప్రాణాలకే ప్రమాద మని హెచ్చరిస్తూ ఆ 10 మందులను క్లాస్‌-1 కేటగిరి కింద సిఎస్‌ఇ చేర్చింది.

వీటిని 30 నుంచి 60 దేశాల వరకు నిషేధించాయి. అయినా భారతదేశంలో వీటి వినియోగం అధికశాతంలో ఉండడం విశేషం. ఈనేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ఎన్విరాన్‌మెంట్‌ (సిఎస్‌ఇ) అక్టోబర్‌ 18న అత్యంత ప్రమాద కరమయిన ఏడు క్రిమిసంహారక మందుల జాబితాను విడుదల చేసింది. ఐఎఆర్‌ఐ శాస్త్రవేత్త అనుపమ్‌ శర్మ నాయకత్వంలో కేంద్ర కమిటీ 2015లో క్రిమిసంహారక మందుల వినియోగంపై సమీక్షిం చింది. కానీ తక్షణం వాటిని నిషేధించాలన్న విషయాన్ని పట్టించుకో లేదని మేధావివర్గం ఆక్షేపించింది.

అత్యంత ప్రమాదకరమయిన క్రిమిసంహారక మందుల జాబితా 18 క్లాస్‌1లో ఏడు మందులు ప్రస్తుతం రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. 2015-16లో ఇలాంటి 30 శాతం క్రిమిసంహారక మందులు వాడుకలో ఉన్నట్టు తేలింది. కేంద్రకమిటీ 66 రకాల క్రిమిసంహారక మదుల వినియోగంపై సమీక్షించినప్పటికీ వాటిలో 13 మందుల పైనే 2018 నుంచి నిషేధం విధించింది. మిగతా వాటిలో ఆరింటి ని 2020 నుంచి నిషేధించాలని సూచించింది. మిగతా మందులను తరువాత సమీక్ష వరకు వినియోగించడానికి అనుమతించింది.

ఇదే వ్యవసాయ నిపుణులకు, పరిశోధకులకు కొంత ఇబ్బంది తెచ్చిపెట్టిం ది. మన నిబంధనల్లో అత్యవసరంగా కొంత వ్యవధిని నిర్ణయిస్తే అలాగే సమర్థంగా ఆ నిబంధనలను అమలు చేస్తే ఇటువంటి మరణాలు జరగకుండా నిరోధించవచ్చని సిఎస్‌ఇ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రభూషణ్‌ పేర్కొన్నారు. క్రిమిసంహారక మందుల వినియోగం ఎక్కువయితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఈ ప్రమాదం నుంచి ఎలాంటిజాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ క్రిమి సంహారక మందుల నిర్వహణపై ప్రత్యేకచట్టాన్ని అమలు చేయాల్సి న అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా క్రిమిసం హారక మందుల నిర్వహణపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నిబం ధనలను గుర్తుచేశారు. క్రిమిసంహారక మందులను ఎవరైతే వినియో గిస్తున్నారో వారు వ్యక్తిగతంగా తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవా లి. ఈ మేరకు రక్షణ పరికరాలను వినియోగించాలి. అయితే ఈ పరికరాలు అత్యంత ఖరీదైనవే కాకుండా సరిగ్గా అందుబాటులో ఉండ వ్ఞ. క్లాస్‌-1 జాబితాలోని క్రిమిసంహారక మందులన్నిటికీ వ్యక్తిగత రక్షణ పరికరాలు అవసరం. ఈ పరికరాలను మనదేశం లోని చిన్న రైతులు వినియోగించడం తలకు మించిన పని. అందు వల్లనే గతంలో క్లాస్‌-1 జాబితాలోని క్రిమిసంహారక మందులను వాడరాదని నిషేధం విధించారు. మోనోక్రోట్‌ఫోస్‌, ఆక్సిడెమటాన్‌ మెథైల్‌1, ఎసిఫేట్‌, ప్రొసెనోఫోస్‌ వంటి క్రిమిసంహారక మందులు మహారాష్ట్ర మరణాలకు కారణమై ఉండవచ్చని పరిశీలకులు అభిప్రా యపడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ మోనోక్రోట్‌ ఫోన్‌, ఆక్సి డెమాటాల్‌ మైథేల్‌, తదితర క్రిమిసంహారక మందులను క్లాస్‌-1 జాబితాలోకే వస్తాయని చెప్పింది. జన్యుమార్పిడి విత్తనాలను విక్రయించే అమెరికాకు చెందిన మోనోశాంట్‌ సంస్థ భారతదేశంలో అక్రమంగా విత్తనాల అమ్మకం జరుపుతోందని, మొక్కలను నాశనం చేసే వాటిని సహించే పత్తిరకాలను సాగుచేస్తున్నారని 2008లో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణాసియా బయోటెక్నాలజీ సెంటర్‌, మహికో, మోనోశాంటో బయోటక్‌ (ఎంఎంబి) ఇండియా లిమిటెడ్‌ ఈ సంస్థలు రెండూ జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అప్రూవల్‌ కమిటీని అక్రమ అమ్మకాలపై అప్రమత్తం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. హెచ్‌టి పత్తి ని జిఇఎసి (జెనెటిక్‌ఇంజినీరింగ్‌ అప్రూవల్‌ కమిటీ)నుంచి అధికా రికమైన అనుమతి లేకుండా సాగు చేస్తున్నారని హెచ్చరిస్తూ మహి కో-మోనోశాంటో బయోటెక్‌ డైరెక్టర్‌ రాజేంద్రకేట్కర్‌ 2008 సెప్టెం బర్‌ 8న లేఖ రాశారు

. హెచ్‌.టి.రకం పత్తి విత్తనాలను రైతులకు భద్రతా ప్రమాణాలు లేకుండా అమ్ముతుండడంతో ఉత్పత్తిపై విప రీత ప్రభావం చూపుతుంది. భారతదేశంలో పంటలను నాశనం చేసే క్రిమికీటకాల సంఖ్య 279గా నమోదయింది. నిషేధించినా, ఆంక్షలు విధించినా, రెండుమూడు దేశాలు వాడకుండా ఉపసంహ రించకున్నా మనదేశంలో మాత్రంవాడుతున్న క్రిమిసంహారక మందు లు మొత్తం 66 వరకు ఉన్నాయి. ఆ మందుల్లో 18 మందులు అత్యంత విషపూరితమైనవి. వీటిని క్లాస్‌-1 కేటరి కింద చేర్చారు.

దాదాపు 40 నుంచి 60 దేశాలు నిషేధించాయి. ఈ క్లాస్‌ 1కేటగిరిలో మోనోక్రోటోపోస్‌ను ఐరోపాదేశాలతోపాటు 60 దేశాల్లో నిషేధించారు. డైక్టోర్వోస్‌ను ఐరోపా దేశాలతోపాటు 32 దేశాల్లో నిషేధించారు. ట్రైజాఫోస్‌ను ఐ.యు.తోపాటు 40 దేశాల్లో నిషే ధించారు. ఫాస్థామిడాన్‌ను ఐ.యుతోపాటు 49 దేశాలతో నిషేధిం చారు. కార్బోప్యూరాన్‌ను ఐ.యుతోపాటు 49 దేశాల్లో నిషేధించా రు. ఫోరేట్‌ను ఐయుతో పాటు 37 దేశాల్లో నిషేధించారు. మెథోమిల్‌ను 13 దేశాల్లో నిషేధించారు.

కేంద్ర నిపుణుల సంఘం మొత్తం 66 క్రిమిసంహారక మందులపై అధ్యయనం చేసింది. ఇవన్నీ నిషేధించినవే.కానీ భారతదేశంలో మాత్రం వాటిని వినియో గించడం విశేషం. క్లాస్‌-1 కేటగిరి క్రిమిసంహారక మందుల్లో 30 శాతం వరకు 2015-16లో వినియోగించారు. కేంద్ర నిపుణుల సంఘం మొత్తం 66 క్రిమిసంహారక మందు లపై అధ్యయనం చేసింది. ఇవన్నీ నిషేధించినవే. కానీ భారతదే శంలో మాత్రం వాటిని వినియోగించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో జి.ఎం. పత్తి బోల్‌గార్డ్‌ మూడురకం విత్తనాలను అక్రమంగా అమ్ము తుండడమే కాక, విచ్చలవిడిగా సాగు చేస్తున్నారు. తెలంగాణాలో ఈ రకం దాదాపు 20 శాతం కన్నా ఎక్కువ భూముల్లో సాగవ్ఞతోంది.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ విభాగం కానీ, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అప్రయిచల్‌ కమిటీ (జిఇఎసి) కానీ బోల్‌గార్డ్‌ మూడు రకాన్ని కానీ ఇటువంటి మరే రకాన్ని కానీ వాణిజ్య ప్రయోజనాలతో ఆమోదించలేదు. జీవభద్రత పరీక్షలు చేస్తేనేకానీ జిఎం రకం పత్తిని సాగు చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నా రైతులు ఆ విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. సరైన పరీక్షలు చేయకుంటే జిఎం కాటన్‌ కలుపు మొక్కలు విస్తరించడానికి దోహదం చేస్తుంది. ఈ కలుపు మొక్కల విస్తరణ చివరకు క్యాన్సర్‌ తీవ్రంగా సంక్రమించడానికి దారి తీస్తుంది. 2016,2017ల్లో ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది. ఒక్క తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో దీన్ని సాగు చేస్తున్నారు.

నేషనల్‌ సీడ్‌ అసోసియేషన్‌ సూచనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బయోటెక్నాలజిస్టులు, వ్యవసాయ శాస్త్రవేత్తలలో నిపుణుల కమిటీ ఏర్పాటయింది. నాలుగేళ్లుగా బిజి-3 పత్తి విత్తనాన్ని అనుమతిలేకుండా రైతులకు బహుళజాతి సంస్థలు అంటగడుతున్నా పట్టించుకోని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతోంది. మోన్‌శాంటో కంపెనీ రౌంట్‌ అప్‌ రెడీ ప్లెక్స్‌ (ఆర్‌ఆర్‌ఎఫ్‌) అనే కీటక నాశినిని తట్టుకునే బిజి-3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసింది.

అమెరికాలో వాణిజ్యపరం చేసి మనదేశంతోపాటు ప్రపంచదేశాలన్నిటికీ విక్రయించింది. అంతలోనే మహికో కంపెనీ ఆర్‌ఆర్‌ఎఫ్‌ కారకం గల బీజి-3 పత్తి రకాలను రైతు క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలనలు జరిపింది. ఇప్పుడు అది పత్తి పంటలో ఉంది. ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసే విధంగా వ్యాపిస్తోందని వ్యవసాయశాఖ కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని వ్యవసాయశాఖ ఆందోళన వెలిబుచ్చింది.

ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు అంచనాలకు మించి 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇందులో దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల్లో బిజి-3 పత్తి విత్తనం వేసినట్టు అంచనాగా తెలుస్తోంది. బీజీ పత్తి విత్తనం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. చాలా విత్తన కంపెనీలు బీజీ పత్తి విత్తనాలను విక్రయించాయి. దీనివల్ల పతి పండించే ప్రాంతాల్లో అనుమతిలేని చట్టవ్యతిరేక జన్యుమా ర్పిడి కలిగిన కొన్ని రకాల బీజీ-3 పత్తి రకాలు విత్తనోత్పత్తి సమయంలో సహజంగా కలుషితమయ్యాయి.

కలుపునాశిని, పురుగులను తట్టుకునే కారకాలు గల జన్యుమార్పిడి పత్తివిత్తనాలను అనుమతి లేకుండా అమ్ముతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటుంటి జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కేంద్రం అనుమతి లేకుండా అమ్ముతున్న విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని నియమించింది. బీజా-3 పత్తి రకాల వ్యాప్తిపై చర్చించి కేంద్రానికి నివేదించాలని విత్తనాల క్రమబద్ధీకరణ, పేటెంట్‌ హక్కులు తదితర అంశాలపై అదనపు అడ్వకేట్‌ జనరల్‌ నుంచి చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ కేంద్రానికి విన్నవించిన నివేదికలో పేర్కొంది.బోల్‌గార్డు మూడు రకాన్ని నిషేధించాలని కానీ, న్యాయపరమయిన చర్యకు అనుమతి ఇమ్మని కానీ కేంద్రాన్ని రాష్ట్రం కోరలేదు.

– కె.అమర్‌