నిరాశ, నిస్పృహల్లో యువజనం

Career
Career

నిరాశ, నిస్పృహల్లో యువజనం

మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటడం లేదంటారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో పాలకులు అనుసరిస్తున్న తీరు అందుకు అద్దంపడుతున్నది. ఇంటికో ఉద్యోగం అంటారు. కోటి ఉద్యోగాలంటారు. యువతకు ఉపాధి అంటారు. బ్యాం కులకు అలా వెళ్లి ఇలా రుణాలు పొంది చిన్నచిన్న పరిశ్ర మలు స్థాపించవచ్చంటారు. నిరుద్యోగభృతి ఏర్పాటు చేస్తామంటారు. నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే విష యంలో పాలకులు చెపుతున్న మాటలకు చేస్తున్న కార్యక్ర మాలకు పొంతన ఉండటంలేదు. ఈపార్టీ ఆపార్టీ అని కాదు. ఎవరు అధికారంలోనికి వచ్చినా ఇదే కొనసాగుతున్నది. అందుకే నిరుద్యోగం ఏడాదికేడాదికీ విస్తరిస్తున్నది.

ఈ సమస్య ఒక్క భారత్‌దేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇంటర్నేష నల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ గత ఏడాది వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 20 కోట్లమం దికిపైగా నిరుద్యోగులు ఉన్నారని వెల్లడించింది. ఏటా లక్షలాదిమందికిపైగా పెరుగుతున్నారు. నిరుద్యోగుల సంఖ్య ఇలా అదుపులేకుండా పెరిగిపోతుండటానికి రకరకాల కారణా లున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిం చకపోవడం కూడా ఒక కారణమని విశ్లేషిస్తున్నారు. మరొక పక్క విస్తరిస్తున్న సాంకేతిక, యంత్రీకరణ కూడా గ్రామ సీమల్లో నిరుద్యోగాన్ని పెంచుతున్నది.

ఆధునిక యంత్రాల అవసరం అందులో మరోవాదనకు తావులేదు, కానీ నిరుద్యోగుల విషయాన్ని కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా ఈ సమస్య పట్ల కేంద్ర రాష్ట్ర పాలకులు ఆచరణయోగ్యమైన కార్యక్రమం చేపట్టడంలేదనే విమర్శలను కొట్టిపారేయలేం. ఎన్నికల సమయంలో ఆపద మొక్కుల్లా నిరుద్యోగులకు ఆశలు కల్పించడం ఆ తర్వాత విస్మరించడం పరిపాటిగా మారిపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఏపార్టీ అధికా రంలో ఉన్నా పరిస్థితి ఇలానే కొనసాగుతున్నది.

అలా అని నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఏమీ చేయడంలేదని చెప్పడంలేదు. కేంద్ర రాష్ట్ర పాలకులు నిరుద్యోగసమస్య పరిష్కారంకోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. కోట్లా దిరూపాయలు వెచ్చిస్తున్నారు. అయినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. యువతే జాతి పురోగతికి మూలాధారమని నేటి బాలలు యువకులేరేపటి దేశ భవిత నిర్ణేతలని యువ జన శక్తియుక్తులై దేశాభివృద్ధికి బాటలని అంటూ ఉపన్యా సాలిస్తున్నారు. సంక్షేమపథకాలు ప్రకటిస్తున్నారు. కానీ యువ జనుల్లో రోజురోజుకూ నిరుత్సాహం పెరిగిపోతున్నది. నిరక్షరాస్యులైన యువకులే కాదు. ఉన్నత చదువులు అభ్య సించిన వారు కూడా నిరాశానిస్ప్రహలకు లోనవుతున్నారు.

పట్టణాల్లో ఉన్న యువకుల పరిస్థితి ఇందుకు మినహాయిం పులు కాకపోయినా రాష్ట్ర ప్రగతికి పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నయువత పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతున్నది. చదివినచదవులకు తగినట్లు ఉపాధి దొర క్కపోయినా జీవించేందుకు అవసరమైన కనీస సంపాదనకు సైతం నోచుకోక దుర్భరపరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. డిగ్రీ పోస్టుగ్రాడ్యుయేట్‌పూర్తిచేసినవారే కాదు ఇంజనీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ డిగ్రీలు పొందినవారుసైతం గ్రామాల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

రోజువారి వ్యవ సాయ కూలికి వెళ్లలేక ఒకవేళ పరిస్థితుల ప్రభావంతో కూలికి వెళ్లినా అలవాటులేని కష్టంచేయలేక దేశంలో కోట్లాదిమంది యువకులు పడుతున్న వేదన వర్ణించలేం. పనిచేసే శక్తి ఉంది. ఉన్నంతలో కొద్దోగొప్పో మేధాశక్తి ఉంది. కష్టపడి పనిచేయాలనేఉత్సాహం ఉంది. సంఘంలో తమకోస్థానం కల్పించుకోవాలనే తపన ఉంది. అయినా ఏ ఆధారం లేకని రుత్సాహంగా అర్ధాకలితో అసంతృప్తితో అల్లాడిపోతున్నారు. ఇక మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ చేసిన మెరికల్లాంటి యువతీ యువకులు ఇప్పటివరకూ విదేశాల బాటపట్టారు. అక్కడ పరిస్థితులు కూడా ఇందుకు భిన్నంగాలేకపోవడం తమ ఉద్యో గాలు తమకే కావాలని ఏదేశానికాదేశం క్రమేణా ఆదిశగా ఆలోచించడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. అమెరికా లాంటి దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

మన దేశ యువకులకు అక్కడ అవకాశాలు రానురాను తగ్గిపోతు న్నాయి. వాస్తవంగా అక్కడికి వెళ్లి అక్కడి ప్రజలకు సేవచే యాలని ఏ విద్యార్ధీకోరుకోడు. లక్షలాది రూపాయలు ప్రజా ధనంతో తాము చదువుకుంటున్నామని వారికి కూడా తెలుసు. ఇక్కడి ప్రజల డబ్బుతో చదివి ఈ ప్రాంత ప్రజలకు సేవలందించాల్సిన యువతరం ఏదోరకంగా విదేశాలకు వెళ్లి తమ విజ్ఞానాన్ని మరింతపెంపొందించుకుని అక్కడ సేవలందించడానికి ఆరాటపడుతున్నారంటే అర్ధంచేసుకో వాలి. ఇలా విదేశాలకు వెళుతున్నవారిలో తెలుగువారే అగ్ర స్థానంలో ఉన్నారు. వీరంతా ఎందుకువెళుతున్నారనేది ప్రత్యే కంగా చర్చించాల్సిన అవసరం లేదు.

ఒకవేళ వీరంతా ఇక్కడే సేవలందించాలనుకుంటే వారికి తగిన వసతులు వేతనాలు చెల్లించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నా యి. ఇక కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు జీవనోపాధి కల్పిస్తున్న పథకాల విషయంలో కూడా అసంతృప్తి నెలకొంటున్నది. పెరిగిపోయిన అవినీతి ఆశ్రిత పక్షపాతంతో అర్హులైన అభ్యర్థు లకంటే ఉత్తరం దక్షిణో సమర్పించినవారికే అగ్రపీఠం వేస్తు న్నారు. ఇక నిరుద్యోగులను మోసంచేసే కార్యక్రమం నిరా టంకంగా జరుగుతున్నది. ఇదంతా ఆ లేత మనసులపై చెరగనిముద్రవేస్తున్నది. అన్యాయాన్ని నిలదీస్తే రకరకాల వేధింపులకు గురిచేస్తున్నారు. విధిలేనిపరిస్థితుల్లో పక్కమార్గాలు పడుతున్న యువకులు కూడా లేకపోలేదు.

ఇప్పటికైనా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కళ్లుతెరవాలి. యువ జనుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి. ప్రభుత్వ విధానాల్లోను, వైఖరిలోనూ మార్పులురావాలి. అవి అమలుచేసేందుకు త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే కొంతమేరకైనా లక్ష్యసాధనకు అవకాశాలున్నాయి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌