దేవుడి సొమ్ముకే కన్నాలా?

Temple1
Temple

దేవుడి సొమ్ముకే కన్నాలా?

భారతీయ సంస్కృతికి మారుపేరుగా భక్తివిశ్వాసాల కు నిలయాలుగా ప్రజాదారణ పొంది ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొందిన దేవాలయాలు దీనావస్థకు చేరుకుంటున్నాయి.’అన్నీవ్ఞన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు ఎంతో విలువైన ఆస్తిపాస్తులున్నా నిత్యపూజలకు గతిలేక, దీపంపెట్టే దిక్కులేక కళావిహీనంగా మిగిలిపోతున్నాయి, జీర్ణావస్థకు చేరుకుంటున్నాయి. మరొకపక్క ఆదాయం ఉన్న దేవాలయాల్లో అవినీతి, అవకతవకలు రాజ్యమేలుతు న్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన శ్రీకాళ హస్తీిశ్వర దేవాలయంలో అవినీతినిరోధకశాఖ అధికారులు శుక్రవారం చేసిన అకస్మిక దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం.

కర్నూలు జిల్లా నంద్యాలకు చెం దిన భక్తులు కొందరు కూరగాయలు ఉచితంగా సరఫరా చేస్తే దాదాపు పదిలక్షల రూపాయాలకు ఆ కూరగాయాలు కొన్నట్లు బిల్లులుపెట్టి భోంచేసిన విషయం బయటకు వచ్చి నట్లు సమాచారం.ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడి దేవ్ఞని సొమ్మును దిగమింగినట్లు ఎసిబి అధికారుల దృష్టికి వచ్చి నట్లు చెపుతున్నారు. రికార్డులు సీజ్‌చేసి తీసుకుపోయారు. దర్యాప్తు అనంతరం మొత్తం అవతవకలు బయటకువచ్చే అవకాశాలున్నాయి.అయితే తమ భాగోతం వెలుగు చూడ కుండాఅప్పుడే కొందరు పావ్ఞలుకదుపుతున్నట్లు తెలిసింది. అక్కడేకాదు ఉభయ తెలుగురాష్టాల్లో అనేక దేవాలయాల్లో ఈ అవినీతి, అవకతవకలు రాజ్యమేలుతున్నాయి. రాజ కీయ అవసరాలకోసం దేవ్ఞడిని, దేవాలయాలను, దైవ భక్తిని దుర్వినియోగంచేసే దుష్టసంప్రదాయం ఆరంభమై నప్పటి నుంచి దేవాలయ వ్యవస్థ పతనంమొదలైందని చె ప్పొచ్చు.

పవిత్రమైన హిందూదేవాలయ వ్యవస్థలో పాల కులజోక్యం రోజురోజుకూ పెరిగిపోతున్నదని, గతంలో ఎందరో ధర్మాచార్యులు, పీఠాధిపతులు తీవ్రఆందోళన వ్య క్తం చేశారు. దేవాలయాలపై వచ్చేఆదాయం దైవ ప్రచారా నికి ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని మఠాధిపతు లు డిమాండ్‌ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేవాలయా ల ఆస్తులు కాపాడటానికి ఒక ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం వస్తుందేమోనని మరికొందరు అభిప్రాయపడు తున్నారు. గతంలో ఎన్నో విదేశీదాడులు ఎదుర్కొని మరె న్నో ఆటుపోట్లను తట్టుకున్న దేవ్ఞళ్లు ఇప్పుడు స్వజనుల దోపిడీలను నివారించలేకపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యపూజలు అందుకోని దేవ్ఞళ్లు,దేవాలయాలు వేలసంఖ్యలో ఉన్నాయి.

ఆస్తులుస్వాహా చేయడమేకాదు వందలాది సంవత్సరాలచరిత్రకలిగిన అపురూప శిల్పఖం డాలున్న దేవాలయాల ప్రాంగణాల్లో విగ్రహాలను పెకిలిం చుకుపోతున్నారు. గుప్తనిధులకోసం నిరాటంకంగా తవ్వకా లు జరుగుతున్నాయి. ఈ ముఠాలు అప్పుడప్పుడూ పట్టు బడినా వారిపై అంతంతమాత్రంచర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటుడంతో అవినిరాటంకంగా జరుగుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాలను తరలించే ముఠా ఒకటిపట్టుబడింది.పోలీసులు అరెస్టుచేశారు. కేసు నమోదు చేశారు. చట్టంలో ఉన్న లొసుగులతో బయటకువచ్చి మళ్లీ అదేపని కొనసాగించే సంప్రదాయం యధేచ్ఛగా జరుగుతు న్నది.ఇంత జరుగుతున్నా,దేవ్ఞళ్లను, దేవ్ఞళ్ల ఆస్తులను పరి రక్షించాల్సిన దేవాదాయశాఖ అంతగా శ్రద్ధచూపడం లేదు.

అసలు దేవాలయాల భూములెన్ని?ఎవరెవరి ఆధీనంలో ఉ న్నాయి?వాటిపైరావాల్సిన ఆదాయమెంతవస్తున్నది? తది తర వివరాలు దేవాదాయశాఖవద్ద ఇప్పటివరకు స్పష్టంగా లేవ్ఞ. దీనికితోడు సంక్షేమంపేరుతో ప్రభుత్వమేకొన్ని ప్రాం తాల్లో దేవ్ఞళ్ల భూములను కేటాయిస్తున్నది.. పాలకులు అధికారులతో ఇలాంటి ప్రమాదముంటుందనే దేవ్ఞళ్ల ఆస్తు లనుకాపాడేందుకు భక్తులుసమర్పించుకునే ప్రతిపైసా సద్వి నియోగంచేసేందుకు ఎంతోముందుచూపుతో పెద్దలు ‘ధర్మ కర్తలవ్యవస్థను ఏనాడో ఏర్పరిచారు.ఎలాంటి జీతభత్యాలు లేకుండా, లాభాపేక్షలేకుండా దేవ్ఞడిసేవలో తరలించాల నుకునే ఆశయాలున్నవారిని, భూరివిరాళాలు సమర్పించు కున్న వారిని ధర్మకర్తలుగా నియమించేవారు.

వారుఎంతో నీతినియమాలు, నియమనిష్టలు, భక్తివిశ్వాసాలతో సత్ప్రర్త నతో ప్రజలకు ఎంతోఆదర్శంగా ఉండేవారు. పంచాచతీ రాజ్‌ వ్యవస్థవచ్చిన తర్వాత గ్రామరాజకీయాలు చోటుచేసు కోవడంతో ఆ ప్రభావం దేవాలయవ్యవస్థపై పడింది. ధర్మ కర్తలమండలి రాజకీయ పునరావాసంగా మారిపోయింది. వ్యక్తిగత గుణాలు,దైవచింతనవంటి ఉత్తమ గుణాలను పరి గణనలోకి తీసుకోకుండా తమ అనుయాయులను, పార్టీ కార్యకర్తలను ధర్మకర్తల మండలిలో నింపడమే పనిగా నిర్ణ యాలు తీసుకోవడం ప్రారంభమైనప్పటి నుండి ఆలయ వ్యవస్థ భ్రష్టుపట్టింది. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న తిరుపతివెంకన్నకూడా ఈ అవినీతిపరులనుంచి తప్పించు కోలేకపోతున్నారు.

పేరుకేఅది స్వతంత్ర ప్రతిపత్తిగలసంస్థ. వాస్తవంగా అధికారంలోవ్ఞన్న నాయకులు ఏమాదేశిస్తే అది జరగాల్సిందే.అక్కడ పాలకమండలిని నియమించేందుకు ఎపిప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతున్నది. ఇప్పటి కౖనా పాలకులు విజ్ఞతతో ఆలోచించాలి. దేవాలయాలకు ధర్మకర్తలను నియమించేటప్పుడు వ్యక్తిగతచరిత్రను, సేవా ధర్మనిరతిని పరిగణనలోకి తీసుకోవాలి.ఆలయాల ఆస్తు లను పరిరక్షించే ఉద్యమంలో భాగస్వాములవ్ఞతారన్న విశ్వాసమున్న వారిని ధర్మకర్తలుగా నియమిస్తే కొంతలో కొంతవరకైనా దేవ్ఞళ్లకు, దేవాలయాలకు, ఆస్తులకు రక్షణ ఏర్పడుతుంది. ఇదేపరిస్థితి కొనసాగితే తాము భక్తితో సమ ర్పించుకుంటున్న కానుకలు సద్వినియోగం కావడం లేదని ప్రజల్లో అనుమానాలు ఏర్పడితే ఎటువైపు దారితీస్తుందో పెద్దలు ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలి.

– దామెర్ల సాయిబాబ,

ఎడిటర్‌, హైదరాబాద్‌