దక్షిణ మధ్య రైల్వేకు అనాదిగా అన్యాయమే

Secunderabad Raillway Station
Secunderabad Raillway Station

దక్షిణ మధ్య రైల్వేకు అనాదిగా అన్యాయమే

అనేకకష్టనష్టాలు,మిట్టపల్లాలు అడ్డంకులు ఒక్కొ క్కటిని అధిగమిస్తూ దక్షిణమధ్య రైల్వే యాభై వసంతాలు పూర్తిచేసుకుంది.ఆదాయం సమకూర్చడంలో భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉన్న దక్షిణమధ్య రైల్వేల కు నిధుల కేటాయింపులో కేంద్రపాలకులు అనాదిగా సవతితల్లి ప్రేమ ప్రదర్శించారనే చొప్పొచ్చు. ప్రధానంగా ఉత్తరభారతానికి చెందిన వారే రైల్వే మంత్రులుగా ఉండ టంతో నిధుల కేటాయింపు ఉద్యోగాల నియామకం విష యంలో దక్షిణ మధ్యరైల్వేకి అనాదిగా అన్యాయమే జరి గింది.అయినా ఒకపక్క నిధులకొరత, మరొకపక్క కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శించినా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ప్రజాదరాభిమానాలు చూరగొంటూ దక్షిణమధ్యరైల్వే పురోగాభివృద్ధివైపు అడుగులు వేసింది. భారతదేశంలో దక్షిణమధ్యరైల్వే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

వాస్తవంగా దక్షిణమధ్యరైల్వేకు నిజాం కాలంలో పునా ది వేశారు. 1873లో కుదిరిన ఒప్పందం మేరకు నిజాం స్టేట్‌ రైల్వే సంస్థను నిజాం పాలకులు ఏర్పాటు చేశారు. నిజాం సర్కార్‌ ఐదులక్షల పౌండ్లు తన వాటా కింద పెట్టుబడి పెట్టి రైల్వే వ్యవస్థకు నాంది పలికింది. దీంతో వాడి-హైదరాబాద్‌ మధ్య 110మైళ్లదూరం రైలు మార్గా న్ని రెండు కోట్ల రూపాయలు వ్యయం చేసి నిర్మించారు. 1874 అక్టోబరు ఎనిమిదిన వాడి నుంచి హైదరాబాద్‌కు నూతన రైలు మార్గం ప్రారంభమై మొదటి రైలుకు పచ్చ జెండా ఊపారు. నిజాం స్టేట్‌ రైల్వే పరిధిలో చితాపూర్‌ మొదటిస్టేషన్‌గా రికార్డు సృష్టించింది.ఆ తర్వాత వాడి- సికింద్రాబాద్‌ మార్గాన్ని 99ఏళ్లు లీజుకు తీసుకున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ మార్గాన్ని 210 మైళ్లు, వరం గల్‌ నుంచి చంద్రాపూర్‌కు 160 మైళ్లు నిర్మించి దక్షిణ, ఉత్తర భారత్‌లకు అనుసంధానం ఏర్పరిచారు. మొత్తం మీద 1930లో నిజాం పాలనలో ఉన్న ప్రాంతం వరకు రైల్వే సొంతం అయింది. 1889లో విజయవాడ స్టేషన్‌ ప్రారంభించారు.గోవా-గుంతకల్‌మార్గాన్ని విజయవాడకు అనుంసధానిస్తూ ఇంకో మార్గాన్ని1890లో నిర్మించారు. అన్నిటికంటే ప్రధానంగాప్రతిష్టాకరమైన మద్రాస్‌-హౌరా రైలును 1900 సంవత్సరంలో ప్రవేశపెట్టి దేశంలోనే నిజాం స్టేట్‌ రైల్వేకు గుర్తింపు తీసుకువచ్చారు. ఇలా ఆనాటి బ్రిటిష్‌ పాలకులకు దీటుగా ప్రపంచంలోనే ప్రై వేట్‌ యాజమాన్యంతో నడిచే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా నిజాం పాలకులు తీర్చిదిద్దారు. బ్రిటిష్‌పాలకులు తమ స్వలాభాల ఆకాంక్షతోపాటు సరుకుల రవాణాతో వ్యాపా రాభివృద్ధి కోసం రైల్వేను ఏర్పాటు చేస్తే నిజాంలు సరు కుల రవాణా కంటే ప్రజాసౌకర్యాలకే పెద్దపీట వేశారు. స్వాతంత్య్రం అనంతరం భారత రైల్వేల్లో 1952లో నిజాం స్టేట్‌ రైల్వే విలీనం అయింది.

ఆ తర్వాత జోన్‌ విభజనలో 1966 అక్టోబరు రెండున గాంధీజయంతి నాడు దక్షిణ రైల్వేగా ఆవిర్భవించి భారత రైల్వేలో తొమ్మిదో జోన్‌గా చేరింది. అప్పటి నుండి అంచలంచెలు గా పెరుగుతూ సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా లక్షలాది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నది. 704 రైల్వే స్టేష న్లతో ఆరువేల ఇరవైఎనిమిది కిలోమీటర్ల పొడవ్ఞనా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళ నాడురాష్ట్రాలకు దక్షిణమధ్యరైల్వే విస్తరించింది. దాదాపు ఎనభైనాలుగువేల మందికిపైగా సిబ్బందితో745 ప్యాసిం జర్‌ రైళ్లు, 270 ఎక్స్‌ప్రెస్‌లతో సేవలందిస్తున్నది. స్వాతంత్య్రం అనంతరం భారతరైల్వేలో విలీనమైన తర్వాత దక్షిణ మధ్యరైల్వేకు అంతటి ప్రాధాన్యత ఇవ్వ లేదనే అసంతృప్తి దక్షిణాది ప్రజల్లో నెలకొన్నది. దక్షిణ మధ్యరైల్వే నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర పాల కులువివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఏనాటి నుంచో ఉన్నాయి.అందుకు గత రెండుమూడుదశాబ్దాలుగా కేటా యించిన నిధులు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది.

ఇప్పటికీ భారతదేశంలో అన్ని జోన్‌లకంటే దక్షిణమధ్యరైల్వే అధిక ఆదాయం సమకూర్చుకుంటున్నది.రెండు తెలుగు రాష్ట్రా లకు సంబంధించి ఆనాటి నిజాం,బ్రిటిష్‌ పాలకులు స్వాతంత్య్రం రాకముందు మూడువేల ఎనిమిదివందల ఇరవైఎనిమిది కిలోమీటర్ల రైలుమార్గాన్ని నిర్మిస్తే స్వాతం త్య్రం వచ్చిన తర్వాత ఆరేడువందల కిలోమీటర్లకు మించి రైలు మార్గాన్ని నిర్మించలేకపోయారు. ప్రతి ఏటా రైల్వేబడ్జెట్‌లో నిధుల కేటాయింపులోకూడా ఇతర జోన్‌ లకంటే చాలా తక్కువగా ఉంటున్నాయి. పోనీ ప్రకటించి న నిధులు కూడా ఆచరణకు వచ్చే సరికి కార్యరూపం దాల్చడంలేదు.పశ్చిమబెంగాల్‌, బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో ప్రతి వెయ్యిచదరపు కిలోమీటర్లకు సగటున ముప్ఫై ఎనిమిది కిలోమీటర్ల రైల్వే లైన్‌ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం 18కిలోమీటర్ల లోపే ఉంది. పశ్చిమ బెంగాల్‌పరిధిలోని తూర్పు రైల్వేల ఆదాయంకంటే ఖర్చు రెట్టింపు అవ్ఞతున్నది. దక్షిణమధ్యరైల్వే కంటే అత్యంత ఎక్కువ కేటాయింపు చేస్తున్నారు.నిధుల కొరత కారణం గా దక్షిణమధ్యరైల్వే కొత్త బోగీలను సమకూర్చుకోలేని దుస్థితిలో ఉందనే చెప్పొచ్చు. కోచ్‌ఫ్యాక్టరీలో తయార వ్ఞతున్న బోగీల్లో అధికశాతం పలుకుబడి జోన్‌లకు తర లిపోతున్నాయి.

డిమాండ్‌ను బట్టి ఆయా జోన్‌లకు బోగీ లు కేటాయిస్తున్నట్టు చెప్తున్నా వాస్తవంగా రాజకీయ ఒత్తిడులు, అధికారుల ఇష్టాయిష్టాలపై ఆయా జోన్‌లకు తరలిస్తున్నారనేది కాదనలేని వాస్తవం. వరంగల్‌జిల్లా ఖాజీపేట్‌ దగ్గర కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ఏనాడో ప్రకటించినా నేటికీ ఆచరణ రూపం దాల్చలేదు. ఏదిఏమైనా దక్షిణమధ్యరైల్వేకు మాత్రం తీరని అన్యా యమే జరుగుతున్నది.

స్వార్థరాజకీయ ప్రయోజనాల పేరిట సొంత రాష్ట్రాలకు విచ్చలవిడిగా ప్రాజెక్టులను తరలించుకువెళ్లి కొందరు రాజకీయనాయకులు మొత్తం వ్యవస్థ ప్రగతిని కుంటుపరుస్తున్నారని చెప్పకతప్పదు.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌