దక్షిణాసియా మైత్రిలో భారత్‌ కీలకపాత్ర

Indo south asian
Indo south asian Except pak

దక్షిణాసియా మైత్రిలో భారత్‌ కీలకపాత్ర

టెలికమ్యూనికేషన్‌, టెలిమెడిసిన్‌, విద్య, విపత్తు నివా రణ నిర్వహణ తదితర రంగాల్లో దక్ష్షిణాసియా దేశాల మధ్య (పాక్‌ మినహాయించి) మైత్రిని పెంపొందించడానికి భారత్‌ కీలక పాత్ర వహిస్తోంది. ఈ మైత్రిని చైనా విచ్ఛిన్నం చేయడానికి పరోక్షంగా తన వ్యూహాలను రూపొందిస్తోంది. భారత్‌ చుట్టూ ఉన్న దేశాలతో మైత్రిని పెంచుకుని భారత్‌ను అష్టదిగ్బంధం చేయాలన్నదే చైనా ఎత్తుగడ.అయినా దీనిని ఛేదించే సత్తా చూపించడానికి భారత్‌ శాస్త్ర, విజ్ఞాన సాంకేతికరంగాలతో ముందుకు దూసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రయోగానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక,రాజకీయ, సైనిక సహకారం మాది రిగానే సాంకేతిక సహకారం కూడా విస్తృతమవ్ఞతున్న ప్రస్తుత తరుణంలో దక్షిణాసియా ఉపగ్రహ (శాటిలైట్‌) ప్రయోగం ద్వారా భారత్‌ ఈ దిశలో మరింత ఎత్తుకు ఎదగబోతోంది. దక్షిణాసియా ప్రాంతదేశాలకు ఎన్నోవిధాలుగా ఉపయోగపడే ఈఉపగ్రహ ప్రయో గం ద్వారా భారత్‌ కీర్తిపతాకం రెపరెపలాడనుంది. దీని ద్వారా దక్షిణాసియా ప్రాంత దేశాల మధ్యసహకారం మరింత విస్తరించ నుంది. టెలీకమ్యూనికేషన్స్‌, టెలిమెడిసిన్‌, విద్య, విపత్తు, నిర్వ హణ మొదలగు రంగాల్లో ఈ ఉపగ్రహం తన సేవలను అందించ నుంది. నేపాల్‌,భూటాన్‌, శ్రీలంక, మాల్దీవ్ఞలు, ఆప్ఘనిస్థాన్‌, బంగ్లా దేశ్‌ మొదలగు దేశాలు లబ్ధ్దిపొందనున్నాయి.ముఖ్యంగా విపత్తులకు ఎక్కువగా గురయ్యే దక్షిణాసియా ప్రాంతంలో అత్యవసర సమయా ల్లో సమాచార పంపిణీకి ఈ ఉపగ్రహ ప్రయోగం ద్వారా సాధ్య పడనుంది. 2014లోపీఠం అధిష్టించినమోడీ తన ప్రమాణస్వీకారా నికి దక్షిణాసియా దేశాల్లోని నాయకులను ఆహ్వానించి ఇరుగు పొరు గు దేశాలతో చక్కని సంబంధాలకు శ్రీకారంచుట్టారు.

ముఖ్యంగా ఆయా దేశాలలో పర్యటించి మెత్రీబంధాలను పెంపొందించుకోవా లని బాటలు వేసారు. 2014లో సార్క్‌ సదస్సు సందర్భంగా దక్షి ణాసియా దేశాలకు ఉపయోగపడే సార్క్‌ ఉపగ్రహ రూపకల్పనలో భాగం కావాలని ఆయా దేశాలను కోరారు. 2015లో పాకిస్థాన్‌ ఈ ప్రాజెక్టు నుండి వైదొలగినప్పటికి ఉపగ్రహ కార్యక్రమాన్ని కొనసా గించారు. అనేక అంతర్గత సమస్యలు అపనమ్మకాలతో కొట్టుమిట్టా డుతున్నసార్క్‌ వేదికకు ఇటువంటి కార్యక్రమాల ద్వారా కొత్త ఉత్సా హం నింపేవీలుంది. 1985లో దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఆయా దేశాల మధ్య సహ కారం కోసం సార్క్‌ ఏర్పాటైంది.ప్రారంభం నుంచి ఈ వేదికను అనేక సమ స్యలు పట్టిపీడిస్తున్నాయి. పరిష్కారాలను వెతకటంలో సభ్యదేశాలు ప్రతి దశలో విఫలం అవ్ఞతూ వస్తున్నాయి. ఏడు దేశాల కూటమిగా ప్రారంభమైన సార్క్‌ 2007లో ఆఫ్గనిస్థాన్‌ను కలుపుకొని ఎనిమిది దేశాల కూటమిగా విస్తరించింది. పేదరికం, నిరుద్యోగం, వెనుకబా టుతనం, మతఛాందసవాదం, సరిహద్దు సమస్యలు, తీవ్రవాదం, మౌలికవసతుల లేమి దక్షిణాసియా ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటిని అధిగమించడానికి తమ ప్రజలకు చక్కని జీవన పరిస్థితులు కల్పించడానికి ఈ ప్రాంత దేశాలమధ్య సహకారం ఎంతో అవసరం. కాని ఇరుగుపొరుగు దేశాలమధ్య అప నమ్మకాలు ఆయారంగాల్లో సభ్యదేశాలు సహకరించుకోవడానికి అడ్డంకిగా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతీయ వేదికలతో పోలిస్తే సార్క్‌ అనేక విష యాల్లో తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేక ఎంతో వెనుకబడింది. ముఖ్యంగా ఈ మన స్పర్థలను ఆసరాగా చేసుకొని చైనా దక్షిణాసియా ప్రాంతంలో భారత్‌ను దిగ్బంధించాలని చూస్తుంది. హిందూ మహాసముద్రం, బంగా ళాఖాతం జలాలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని పరితపిస్తున్న చైనా భారత్‌కు వ్యతిరేకంగా మిగతా దక్షిణాసియా దేశాలను రెచ్చగొడుగుతుంది. 2014లో నేపాల్‌లో జరిగిన 18వ సార్క్‌ సదస్సులో చైనా సార్క్‌ లో పూర్తిస్థాయి సభ్యత్వం పొందాలన్న తన మనస్సులోని కోరికను బయటపెట్టింది. 2005 నుండి చైనా సార్క్‌ పరిశీలక సభ్యత్వాన్ని కొనసాగిస్తూ వస్తుంది. అలానే అనేక సందర్భా ల్లో చైనా సార్క్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం గురించి ప్రయత్నిస్తూ వస్తుంది. దక్షిణాసి యా ప్రాంతంలో బలమైన శక్తిగా ఉన్న భారత్‌ను ఎదుర్కోవాలంటే ముఖ్యంగా భారత్‌ ఆధిపత్యం వహిస్తున్న సార్క్‌ లాంటి వేదికల్లో పూర్తిస్థాయి సభ్యురాలిగా చేరిభారత్‌ను ఎదుర్కో వాలని ఆశిస్తోంది. అలానే భారతదేశం చుట్టూ ఉన్నదేశాల్లోని పోర్టులను అభివృద్ధిపరు స్తూ, ఆర్థికంగా సహాయంగా ఉంటూ వస్తోంది. అంతేకాకుండా దక్షి ణాసియా మొత్తానికి కూటమిగా ఉన్న సార్క్‌లో ఓటింగ్‌ హక్కులు పొంది ముప్పతిప్పలు పెట్టాలని భావిస్తుంది. దీనికి పాకిస్థాన్‌ కూడా వంతపాడుతోంది. చైనాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న పాక్‌కు భారత్‌ను ఇరుకున పెట్టడానికి ఇంతకు మించి కావలసిందేముంది.

ఈ దిశలోనే చైనా అనేక దక్షిణాసియా దేశాలతో చెలిమి నెరపుతోంది. తనకున్న ఆర్థిక సంపదను ఎరగావేసి ఈ దేశాలను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. గతంలో ఈ మధ్యకా లంలో భారత్‌ చేసిన తప్పులనుచైనా అవకాశంగా మలుచుకుంటుం ది. చైనా, నేపాల్‌ మధ్య బంధం దీనికి మంచి ఉదాహరణ. 2015 లో సుమారు ఐదునెలల దిగ్బంధం కారణంగా నేపాల్‌ భారత్‌మధ్య రాకపోకలకు అనేక అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవలసి వచ్చింది. ధరల పెరుగుదల మొదలగు కారణాలతో జీవితం అస్తవ్యస్థమైంది. అక్కడి ప్రజల్లో భారత్‌ పట్ల వ్యతిరేకత ఏర్పడింది. నేపాల్‌ చైనా వైపు మొగ్గుచూపడం ఆరంభించింది. ఆ సమ యంలో నేపాల్‌ ప్రధాని కె.పి శర్మ ఓలీ ప్రభుత్వంలో చైనా అనేక ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆయన స్థానంలో ప్రచండ ప్రధానిగా నాయకత్వ బాధ్యతలు తీసుకునే సమయంలో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను కొనసాగించాలని చైనా పట్టుబట్టింది. అప్పటిదాకా టిబెట్‌ సానుభూతిపరులను అణచడానికి మాత్రమే నేపాల్‌ సహాయం కోరిన చైనా క్రమంగా పద్ధతి మార్చింది. చైనా, నేపాల్‌ మధ్య సైనిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లా లని చైనా భావిస్తుంది. భూకంప ప్రాంతాలను పునర్నిర్మించ డానికి, ఇతర మౌలిక వసతులు కల్పించడానికి పెద్దమొత్తంలో సహాయం అందిస్తుంది.

భారత్‌తో కలిసి నడవాలని ప్రయత్నిస్తున్న ప్రచండకు స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవ్ఞతుంది. దీనిద్వారా స్థానిక నేపాలీ యుల్లో భారత్‌ వ్యతిరేక వైఖరి స్పష్టంగా అర్థం అవ్ఞతుంది. పాక్‌, చైనా ఆర్థికకారిడార్‌ ద్వారా పాక్‌తో ఆర్థిక సహకారానికి కూడా నడుం కట్టింది. బెలూచిస్థాన్‌ మీదుగా సాగే ఈ ప్రాజెక్టుకు అక్కడ వ్యతిరేకత వ్యక్తమవ్ఞతుంది. తమ వనరులు చైనా దోచుకోవడానికి ప్రయత్నిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నా చైనా పట్టించుకోవడం లేదు.ఇందులో భాగంగా రోడ్లు,రైల్వేలు ఇతర మౌలికవసతుల కల్ప నకు పూనుకుంటుంది. వాణిజ్యపరంగా,సరకు రవాణాపరంగా మల క్కా సంధులపై ఆధార పడడం ఏనాటికైనా ఇబ్బందేనని చైనా అభిప్రాయం.ఆగ్నేయాసియా దేశాలు అన్నీకలిసి మలక్కా జలసం ధులను దిగ్బంధిస్తే చైనాకు అది పెద్ద ఎదురుదెబ్బ.అందుకని చైనా కన్ను హిందూమహాసముద్రంపై అలానే దీనిని ఆనుకొని ఉన్న దేశా లపై పడింది. అందులో భాగంగానే మయన్మార్‌లో పోర్టు అభివృద్ధి పరుస్తుంది. అంతేకాకుండా బంగ్లా దేశ్‌లో కూడా చైనా తన పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. గత సంవత్సరం చైనా-బంగ్లాదేశ్‌ లు తమ సంబంధాలను వ్యూహా త్మకస్థాయి సంబంధాలకు తీసుకె ళ్లాలని నిర్ణయించాయి.మాల్దీవ్ఞలలోకూడా చైనా అనేక పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత అబ్దులా యామీన్‌ ప్రభుత్వం చైనావైపు అతిగా మొగ్గుచూపుతుంది. గత నషీద్‌ ప్రభుత్వం భారత్‌తో చక్కని సం బంధాలను నెరిపింది. దీనికి అబ్దులా యామీన్‌ స్వస్తిపలికి చైనా వైపు కదులుతున్నారు. అలాగే శ్రీలకంలో చైనా అనేక ప్రాజెక్టులకు పూనుకుంది.అనేక సందర్భాల్లో చైనా సబ్‌మెరైన్లు కొలంబో తీరంలో ప్రత్యక్షమవ్ఞతున్నాయి. ఇది భారత్‌కు ఏమాత్రం నచ్చడం లేదు. ముఖ్యంగా రాజపక్సే హయాంలో చైనా అనేక కాంట్రాక్టులు పొంది ఆదేశంపై పట్టు పెంచుకొంది. ముఖ్యంగా ఆదేశంలో 1.5 బిలియన్‌ డాలర్లతో పోర్టు సిటీ ప్రాజెక్టుకు చైనా సంస్థ రూపకల్పన చేసింది.

దీని ద్వారా దానికి చేరువలో సుమారు 100 హెక్టార్ల స్థలం 99 ఏళ్లు చైనాతన ఆధీనంలో ఉంచుకుంది. ఇది ఏనాటికైనా ప్రాంతీయ అస్థిరతకు, అలాగే తమకు కూడా ఇబ్బంది కాగలదని ప్రస్తుత సిరి సేన ప్రభుత్వం భావిస్తుంది. ఇలా చైనా భారత్‌కు చుట్టూ ఉన్న దేశాలపై పట్టు బిగించాలని ప్రయత్నిస్తుంది. వ్యూహాత్మకంగా ఆయా దేశాలను తన అదుపులో పెట్టుకొని భారత్‌పై కాలుదువ్ఞ్వతోంది. భారత్‌ దీనికి ధీటుగా స్పష్ట మైన కార్యాచరణతో ముందుకుసాగాల్సి ఉంది.దీనికి సార్క్‌ను సమ ర్థంగా వినియోగించుకోవాల్సిఉంది. దక్షిణాసియా దేశాలమధ్య పొర పచ్చాలకు తావ్ఞలేకుండా ఈ వేదికకు తిరిగి కొత్త ఊపు ఇవ్వాల్సి ఉంది. ప్రసుత్తం అనేక కారణాలతో వేదిక ఉనికే ప్రశ్నార్థకమైంది. ముఖ్యంగా వేదికను ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో భారత్‌, పాక్‌ సమస్య అతి ముఖ్యమైంది. కాశ్మీరు సమస్య పరిష్కారానికి మూడో మనిషికి అవకాశం ఇవ్వకుండా ధ్వైపాక్షికంగానే సమస్యకు ఒకము గింపు ఇవ్వాలని భారత్‌ ప్రయత్నిస్తుండగా కాశ్మీరు సమస్యను ప్రాంతీయ వేదికలు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావనకు తెచ్చి పాక్‌ సమస్యను మరింత క్లిష్టంగా మారుస్తుంది. దీంతో ఇరుదేశాల మధ్య చిచ్చు వేదికపై ప్రభావం చూపుతోంది.అడపాదడపా జరుగుతున్న తీవ్రవాద ఘటనలు మొదలగు కారణాలచేత సదస్సులను బహిష్క రించడం ఆనవాయితీగా మారుతోంది. ఒకవేళ పాక్‌ తన వైఖరి మార్చుకోనట్లయితే భారత్‌ మిగతా దేశాలను కలుపుకొని సాగాల్సి ఉంది. సభ్యదేశాల మధ్య రవాణా అనుసంధానం నేటికి ఒక కళ గానే ఉండిపోతుంది.

అనేక ప్రాజెక్టులు అనేక కారణాల వల్ల నెమ్మ దిగా సాగుతున్నాయి. ఈ వేదికను సభ్యదేశాల మధ్య సమస్యలను చర్చించడానికి కాకుండా ముందుగా ప్రాంతం మొత్తాన్ని ప్రభావం చేసే పేదరికం, తీవ్ర వాదం, నిరుద్యోగం, తదితర క్లిష్ట సమస్యల ను పారద్రోలడానికి ఉపయోగించాల్సి ఉంది. పెరుగుతున్న మత ఛాందసవాద నిర్మూలనకు సభ్యదేశాలు ఉమ్మడిగా కదలాల్సి ఉంది. సాంకేతిక సహకారం పెంపొందించాల్సి ఉంది. ప్రస్తుత ఉపగ్రహ ప్రయోగం ఈ దిశలో ముందడుగుగా భావించి భవిష్యత్తులో ఇటు వంటి మరిన్ని కార్యక్రమాలకు పూనుకొని ప్రాంతీయ అభివృద్ధికి సభ్యదేశాలు పాటుపడాలని ఆశిద్దాం.

– సముద్రాల వి.కె