తమిళనాడులో జయలలిత తర్వాత?

హబుల్‌

గతవారంరోజులపై టెలిస్కోప్‌

jaya
Jayalalitha

తమిళనాడులో జయలలిత తర్వాత?

దక్షిణాదిలో ఉక్కు మహిళగా పేరొందిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తీరని లోటే. ఇందిరాగాంధీ తర్వాత జయలలితనే ప్రజల్లో అత్యంత మన్ననలు పొందారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమ్మగా ప్రజల మనుసుల్లో ముద్ర వేసుకున్నారు. ఆమె మరణం మహిళా లోకాన్నే కాదు అందరినీ కదిలించింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె పార్టీ కార్యకర్తలు సైతం ఆమెను కీర్తించారు. విప్లవ నాయికగా పేరొందిన ఆమెను అభిమానించారు. చెన్నైలో పలుచోట్ల వారు ఫ్లెక్సీలు పెట్టి నీరా జనం పలికారు.

ఆ ప్లెక్సీల్లో ఏం రాశారంటే,’జయలలిత మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.జయ విరోధిగా ఉన్నప్పటికీ ఎదుట నిలిచింది సింహం అన్నంత హుందాగా తలబడ్డాం.మీరు పాలిం చకూడదని మాత్రమే భావించాం గానీ, జీవించ కూడదని ఎన్నడూ భావించలేదు తల్లి.ఇక ఎక్కడ చూడగలం నీలాంటి ఖ్యాతి కలిగిన మహోన్నత మైన వ్యక్తిని అని కొనియాడారు. భారతదేశ చరిత్రలో తనకొక ప్రత్యేక అధ్యాయాన్ని రచించుకున్న జయ లలిత సార్థక తను పొందారు.మహిళలే కాదు, ప్రతికూల పరిస్థితుల మధ్య సత మతమయ్యే వారందరికీ ఆమె స్ఫూర్తిగా నిలిచిపోయారు. సినీరం గంలో తనకొక తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న జయ ఆ స్థానం సహాయంతోనే రాజకీయాల్లో నెగ్గుకు వచ్చి ఏకంగా శాసించే స్థాయికి వచ్చారు. పేదలకు అన్నం పెట్టే అమ్మగా, ఇతరు లకు భయపెట్టే అమ్మోరిగా వ్యవహరించిన ఆమె ఎందుకనో సాష్టాంగ నమస్కారాలను, వెగటు విధేయతను ఆనందించారు. వ్యక్తి ఆరాధనతో ఓటర్లను ఆకట్టుకునే ప్రాంతీయ పార్టీగా మారిన అన్నా డిఎంకె ఎంజీఆర్‌నుంచి అదేఒరవడి కొనసాగిస్తోంది.జయలలిత హయాంలో ఆ పార్టీ మరింతగా వ్యక్తి కేంద్రీ కృతమైంది. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ద్రావిడ పార్టీలకు జయలలిత వంటి అయ్యంగార్‌ నాయకత్వం వహించడం విచిత్రమైన పరిస్థితే మరి.

ఆమె కాంగ్రెస్‌తో స్నేహం చేసి అనుకున్నది సాధించారు. అదే కాంగ్రెస్‌ను కాదని ఎన్డీయేకు మద్దతు తెలిపారు.తర్వాత ఎన్‌డిఎకు మద్దతు ఉపసంహరించి గతంలో ప్రభుత్వ పతనానికి కూడా కారణమయ్యారు. అన్నాదురై,ఆ తర్వాత కరుణానిధి ద్రవిడ రాజ కీయ సిద్దాం తాలకు ప్రతినిధులుగా వ్యవహరించగా,అదే వరుసలో వచ్చిన ఎంజీ రామచంద్రన్‌ భిన్నంగానే ఉన్నారు.ఆయన కంటే భిన్నంగా జయలలిత పాలన చేశారు. జనాకర్షక పథకాలతో ధరల పెరుగుదల,జీవన ప్రమాణాల తరుగుదల పరిస్థితుల్లో దుర్భరమైన బతుకులకు అన్నీ అమర్చి పెట్టే అమ్మగా మారిపోయారు.

అటువంటి జయలలిత మరణానంతరం తమిళనాడులో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జయలలిత స్నేహితురాలు శశికళ పార్టీతో పాటు ప్రభుత్వంపైన పెత్తనం చెలా యించేలా వ్యూహాలు రచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. జయ లలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి నుంచీ శశికళ తన మార్క్‌ చూపించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆమెతో పలుసార్లు కలిశారు.జయ లలిత మరణ ప్రకటన వచ్చిన అర్థరాత్రే పన్నీర్‌ సెల్వం రాజ్‌భవ న్‌కు వెళ్లి సిఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ, ఇంకా విధుల్లోకి దిగలేదు.శనివారంనాడు కేబినెట్‌ మీటింగ్‌ పెట్టుకుని సిఎంగా బాధ్యతలు తీసుకున్నారు. కేబినెట్‌ సమావేశానికి వెళ్లే ముందు సిఎం పన్నీర్‌ సెల్వం, మంత్రులు జయలలిత సమాధి వద్ద నివా ళులర్పించారు. దాదాపు 27 ఏళ్లుగా అన్నా డిఎంకె పార్టీకి అన్నీ తానై జయ నడిపించారు. పార్టీప్రధాన కార్యదర్శిగా ఆమె మరణం వరకు కొనసాగారు. ఇప్పుడు ఆ పవర్‌ఫుల్‌ పదవిని శశికళ చేపట్ట బోతుందా? లేదా? తేలాల్సిఉంది. కాగా,రెండు రోజులుగా పన్వీర్‌ సెల్వంతో ఆమె భేటీ జరిపి సిఎం పదవిలో తానే ఉంటానని శశికళ అడిగారని, దానికి సెల్వం స్పందిస్తూ ఇప్పుడు సాంకేతికంగా ఇబ్బందులు వస్తాయని, తర్వాత ఆలోచిద్దామని చెప్పగా, ఆమె పార్టీకి పరిమితం అవుతానని చెప్పారని తమిళ టీవీల్లో ప్రచారం జరిగింది. కానీ ఇదే సమయ ంలో శశికళ పార్టీ పదవి తీసుకోవద్దని కొందరు, జయలలిత మరణం వెనుక కుట్ర జరిగిందని కొందరు అప్పుడే రంగంలోకి దిగారు.అన్నా డిఎంకె పార్టీ సీనియర్‌ నేత పొన్నయన్‌ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎంపిక ఉంటుందని తెలిపారు. ప్రధాన కార్య దర్శి పదవికోసం ఎలాంటి ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు. ‘అమ్మ లేనప్పుడు కూడా పార్టీ సమిష్టిగా ముందు కెళ్తుందని పేర్కొ న్నారు.

‘అమ్మ ప్రవేశపెట్టిన పథకాలు, విధానాలు కొనసా గుతాయని వెల్లడించారు. జయ మరణానంతరం రాజాజీ హాల్‌లో ఆమె పార్థివదేహం వద్ద శశికళ కుటుంబ సభ్యులు మాత్రమే ఉండ టంపై సోషల్‌ మీడియా లో విమర్ళలు బాగా వచ్చాయి. దీంతో పార్టీ,ప్రభుత్వ వ్యవహారాల కు దూరంగా ఉండాలని జయలలిత స్నేహితురాలు శశికళ తన కుటుంబ సభ్యులకు సూచించారు.తమ కుటుంబ సభ్యులెవరూ పార్టీ,ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చరని, ఒకవేళ ఎవరైనా సూచనలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రు లకు,పార్టీ నేతలకు చెప్పారని తెలుస్తోంది. వాస్తవానికి 2011 డిసెంబర్‌లో శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులను జయ లలిత పార్టీ నుంచి బహిష్కరించారు. తనపై కుట్ర పన్నుతున్నారని అప్పట్లో ఆమె చెప్పారు కూడా. తర్వాత సుమారు నాలుగు నెలలకు మళ్లీ శశికళపై సస్పెన్షన్‌ ఎత్తివేసి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. శశికళ కుటుంబ సభ్యులను మాత్రం ప్యాలెస్‌లోకి అడుగుపెట్ట నివ్వలేదు. మళ్లీ జయలలిత మరణం తర్వాతే శశికళ భర్త నట రాజన్‌ కూడా తెరమీదకు వచ్చారు.కానీ ఇప్పుడు మళ్లీ తన బంధువులు పార్టీలోగానీ, ప్రభుత్వంలో గానీ చక్రంతిప్పడం మొదలు పెడితే అది మరింత నెగెటివ్‌ ఫలితాలను తీసుకొస్తుం దని భావించి తాజానిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని,ప్రజలు వేలెత్తిచూపే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారు.

ఈ మేరకు ఎలాంటి పదవులు ఆశించ కుండానే ప్రజా సేవ చేయడానికి ఆమె మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో జయలలిత మృతి నేపథ్యంలో తెరపైకి వస్తున్న ప్రశ్నలతో ప్రధాని నరేంద్రమోడీకి సినీనటి గౌతమి లేఖ రాసి సంచలనం సృష్టిం చారు. పైగా అది వ్యక్తిగతం కాదని, ప్రజల గళమని వ్యాఖ్యా నించారు. అందుకే ప్రధానికి లేఖ రాశానని వివరణ ఇచ్చారు. ‘కోట్లాది మంది ఎన్ను కున్న నేతకు ఏం జరిగిందనేది మనం తెలుసుకోవాలి.అది ఆసక్తి మాత్రమే కాదు. హక్కు కూడా.రాష్ట్ర పరిధిని దాటి ఒక విషయా న్ని తెలుసుకోవాలంటే దానికి కేంద్రం మాత్రమే ఉంది. అందుకే ప్రధానికి లేఖ రాశా, సమాధానం వస్తుందని కూడా నమ్ముతున్నా అని తెలిపారు. ప్రసిద్ద సినీనటుడు కమలహాసన్‌ భార్యగా ఉన్న గౌతమి కమల హాసన్‌కు దూరమవుతూ విడాకులు ఇచ్చేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. కమలహాసన్‌ కూడా జయ మరణంపై సంతాపం చెబుతూ విచిత్రమైన ట్వీట్‌ చేశారు. జయపై ఆధారపడిన వారిపై సానుభూతి చూపిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే తమిళనాడు దివంగత సిఎం జయలలిత వైద్యం ఖర్చుల బిల్లు రూ.80 కోట్లుగా తేలింది. జయకు 75 రోజుల పాటు వైద్యం అందించిన చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యం వేసిన మెడికల్‌ బిల్లు సుమారు రూ.80 కోట్లు ఉందని, మిగతా ఖర్చులను కలిపితే అది కాస్త పెరిగే అవకాశం ఉందని సమాచార హక్కు చట్టం కింద ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటీషన్‌తో ఈ విషయం బహిర్గతమైంది. ప్రజా ప్రతినిధులు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య ఖర్చులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. జయ వైద్యానికి అయిన ఖర్చులను కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఇప్పటికే రూ. 6కోట్లు చెల్లించింది కూడా. ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత జయ ఉన్న రెండో అంతస్తు మొత్తం ఖాళీ చేయించారు.

దీంతో ఈ అంతస్తులోని 30 గదుల అద్దెను జయ వైద్య ఖర్చుల్లోనే కలిపారు. వీటి ఒక రోజు అద్దె రూ.కోటీ. గుండెపోటును కంట్రోల్‌ చేసేందుకు వినియోగించే ఎక్మో, ఇతర లైఫ్‌ ససోర్టు యంత్రాల చార్జీలు వీటికి అదనం, అలాగే 40 మంది అపోలో వైద్యులకు కన్సల్టేషన్‌ చార్జీలు,మందులు, నర్సింగ్‌ చార్జీలు,లండన్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ రిచర్డ్‌ బిలే, అతని బృందం, సింగపూర్‌ ఫిజి యోథెరపిస్టు చార్జీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జయ భద్రతా సిబ్బందికి చెల్లించాల్సిన ఇతర ఖర్చుల బిల్లులు కూడా వేరుగా ఉన్నాయట. ఈ ఖర్చుల సంగతి ఎలా ఉన్నా సోషల్‌ మీడి యాలో జయలతిత మరణం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నష్టంగానే చెబుతూ సూచనలు బాగా వస్తున్నాయి. ఎంత ధనం ఉన్నా ఆమె కృశించిన ఆరోగ్యాన్ని కాపాడలేక పోయిందన్న విషయం గ్రహించాలని చెప్పాయి.

అందుకనే డ్రింకింగ్‌ ఎనఫ్‌ వాటర్‌, స్టాండ్‌ ఇన్‌ ద సన్‌, ఈట్‌ ఆన్‌ టైమ్‌, లిజన్‌ టు యువర్‌ బాడీ, స్టాప్‌ బీయింగ్‌ లేజీ, బీ బ్రిస్క్‌ అండ్‌ స్టే యాక్టీవ్‌ త్రోఅవుట్‌ ద డే… స్లీప్‌ ప్రాపర్లీ డ్యూరింగ్‌ నైట్స్‌… ఫైట్‌ యువర్‌ స్ట్రెస్‌ బ్యాక్‌ విత్‌ స్మైల్‌… మెయింటేన్‌ యువర్‌ బిఎంఐ, జస్ట్‌ బి హెల్త్‌ కాన్షియస్‌… టేక్‌ మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ ఎవరీ ఇయర్‌… మొత్తంగా ఫిట్‌నెస్‌ ఈజ్‌ కీ ఫర్‌ సక్సెస్‌ అంటూ సందేశాల మీద సందే శాలను ఇచ్చాయి. ఇదే సమయంలో ఎన్ని ఉన్నా ఎంత సంపాదిం చినా ఎంత బలగం ఉన్నా వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు అన్ని వదిలేసి ఒక మోడులా పైకి వెళ్లిపోయందనే సందేశాలు కూడా వచ్చాయి.

జయలలిత వదలి వెళ్లిన ఒక జీవిత సత్యం ఇదేనంటూ ప్రచారంలో పెట్టాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమెకు సంతాపం తెలుపుతూ ఆమె అన్నిట్లో గెలిచినా ఈ పోరాటంలో ఓడిపోయా రన్నారు. ఆయన ఢిల్లీ నుంచి రావడానికి ఎక్కిన విమానం ఇబ్బంది పెట్టడంతో తిరిగి ఢిల్లీ చేరుకుని తర్వాత మిలటరీ విమానంలో చెన్నైకి వచ్చి జయకు నివాళి అర్పించారు. ప్రధాని మోడి కూడా చెన్నై వచ్చి జయకు నివాళి అర్పించి కంటతడి పెట్టారు. ఆయన్ను రిసీవ్‌ చేసుకునేందుకు విమానాశ్రయానికి శశికళ వెళ్లడం గమనార్హం. అయితే, ఉక్కు జయలలిత తర్వాత తమిళనాడులో ఏం జరుగబోతుందనేది కీలక అంశమే. కాంగ్రెస్‌,బిజెపి లాంటి జాతీయ పార్టీలు కూడా ఇదే అదనుగా పాగా వేసేందుకు పావులు కదుపుతాయి కూడా. కురువృద్ధ్దుడు కరుణానిధి ఇప్పుడు విపక్షంలో ఉన్నా భవిష్యత్తులో ఆరోగ్యం సహకరిస్తేనే క్రియాశీలక రాజకీయాలు చేయ గలరు. గడిచిన ఎన్నికల్లో ఆయన పార్టీ గెలిచి అధికారంలోకి రావాల్సి ఉండింది. డిఎంకె,అన్నాడిఎంకె పార్టీలు వెంట వెంట అధికారంలోకి రావడం చాలా అరుదు. వెంట వెంట రెండోసారి గెలిచే అవకాశం ఈసారి జయలలిత పార్టీకి లభించింది. కిందటి ఎన్నికల్లో ఆమె గెలుపొందడం ఒక అసా ధారణ విష యం. ప్రత్యర్థుల అంచనాలు తలక్రిందు లయ్యాయి. ముందస్తు సర్వేలన్నీ విఫలమయ్యాయి.

ఆమె సిఎంగా బాధ్యతలు తీసుకుని అలా సమయం గడిచిందో లేదో అప్పుడే ఆమె పరలోకానికి వెళ్లిపోయారు. దశాబ్దాలుగా అన్నాడిఎంకెను అమ్మా డిఎంకెగా పాలించిన ఆమ్మ వెళ్లిపోయింది. ఆమె మరణం తమిళనాడు ప్రజలకు దిక్కులేని వ్యవహారంగానే మారింది. అమ్మలేని లోటు తీర్చేదెవ్వరు అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. దేశంలో రాజకీ యాలు ఒక ఎత్తు, తమిళనాడులో రాజకీయాలు మరో ఎత్తు. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు జెండాలు పాతినా, తమిళనాడులో మాత్రం పుల్ల కూడా పాతలేకపోయాయి. ఇప్పుడు ఆమె లేదు. కానీ ఆమె ఆస్తుల కోసం బంధువులు రంగంలోకి దిగారు. ఆమె నమ్మిన వారిని అనుమానిస్తున్నారు. అన్నాడిఎంకె అధినేత్రి జయలలితపై శశికళ, ఆమె బృందం కలిసి విష ప్రయోగం చేశారని అన్నాడిఎంకె సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్‌.కృష్ణమూర్తి ఆరో పించారు. ఇంకేం జరుగుతోంది.

వై.నాగేశ్వరరావు.