చుట్టుముడుతున్న ప్రత్యేక హోదా సెగలు

AP MP's Demands
AP MP’s Demands

చుట్టుముడుతున్న ప్రత్యేక హోదా సెగలు

ప్రత్యేకహోదా విషయం చిలికిచిలికి గాలి వానగా మారుతున్నది. ఈ డిమాండ్‌ సెగలు నగరాలు,పట్టణాలు దాటి గ్రామాల ను చుట్టుముడుతున్నాయి. అన్నిస్థాయిల్లోనూ చర్చో పచర్చలు జరుగుతున్నాయి. విజయవాడలో సోమవారం ప్రత్యేకహోదా సాధన కోసం కొన్ని రాజకీయపార్టీలు ప్రజా సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు,మేధావ్ఞలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు శ్రీకారం చుట్టాలని కేంద్రం మెడలు వంచి తమ లక్ష్యసాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆ సమావేశం లో పాల్గొన్న పలువురు వక్తలు ప్రకటించారు.

ఇక ఢిల్లీ పార్ల మెంటులో బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం నోటీ సు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ,టిడిపి ఎంపిలు నిరసన కార్యక్రమా లు కొనసాగిస్తున్నారు. తాము ఇచ్చిన నోటీసులను అను మతించి చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకొక పక్క కాంగ్రెస్‌పార్టీ ఢిల్లీలో జరిగిన ఎనభైనాలుగోవ ప్లీనరీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదాతో సహా విభజన హామీలన్నీ అమలుకు త్రిక రణశుద్ధిగా కృషి చేస్తామని వెల్లడించారు.రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొం టున్నారు. అటు కేంద్ర పెద్దలను ఒప్పించలేక, ఇటు జనా న్ని మెప్పించలేకపోయినా ఎన్‌డిఎ ప్రభుత్వం ఆంధ్రప్రదే శ్‌కు చేసిన సహాయసహకారాల గూర్చి వివరిస్తూనే ఉన్నా రు. అసలు బిజెపి కేంద్రపెద్దలు ఎందుకు ఇలా వ్యవహరి స్తున్నారో సామాన్యులకు అర్థంకాకపోయినా రాజకీయ పరి శీలకులకు అర్థంకాని బ్రహ్మరహస్యం ఏమీ కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ బలోపేతం కావాలనుకోవడం లో తప్పులేదు.

ఉత్తరాదిలో తగ్గుతున్న బలాన్ని దక్షిణాది లో పూడ్చుకోవాలనే రాజకీయ వ్యూహాన్ని కూడా తప్పుపట్ట లేం.కానీ తాము స్వయంగా ఇచ్చినమాట,హామీలను తామే కాలరాయడం ఎంతవరకు సమంజసం?వాస్తవానికి ప్రత్యేక హోదా అన్నది ఆనాటి బిజెపి నేత ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పట్టుబట్టడం వల్లనే అప్పటి కాంగ్రెస్‌ నేతలు అంగీకరించారు.

ప్రధానమంత్రి మోడీ కూడా అప్ప టి ఎన్నికలసభలో లక్షలాది మంది ప్రజల ముందు తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని ప్రక టించారు. అక్కడ బిజెపి,ఇక్కడ తెలుగు దేశం అధికారంలో కి రావడంతో విభజన చట్టంలోని హామీ లన్నీ అమలైపోతా యనిఆశించారు. వడ్డించేవాడు తనవాడైతే ఎక్కడ కూర్చుం టే ఏమిటి అన్నట్లు వెనుకబడి ఆంధ్రప్రదేశ్‌ కు అడిగినా, అడక్కపోయినా చేయూతనిస్తారని ఆశించారు. కానీ అధికా రంలోకి వచ్చిన తర్వాత క్రమేణా స్వరంలో మార్పువచ్చిం ది.మాటలే తప్ప చేతలు లేవని చాలా కాలం క్రితమే తేలిం ది.వేలాది కోట్లరూపాయల వ్యయంతో నిర్మిం చతలపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నిధు ల వర్షం కురిపిస్తారని ఆశపడ్డారు. నిధుల సంగతి దేవ్ఞడె రుగు.మట్టి నీరుఇచ్చి చేతులు దులుపుకొని వెళ్లారు. ఆనాడే పలువురు ప్రజాస్వామ్యవాదులు పెదవి విరిచారు.

అయినా మిత్రబంధం కొనసాగించారు.అయితేఇందులో చంద్రబాబు పాత్ర కూడా కొంత అభ్యంతరకరంగా ఉంది. అందరిని కలుపుకొని పోయేలా సమర్థవంతంగా వ్యవహరించలేకపో యారేమోననిపిస్తున్నది.రాజధాని ఎంపిక విషయంలోకానీ, పోలవరం తదితర ప్రాజెక్టుల విషయంలో కానీ అఖిలపక్షా న్ని, ప్రజాసంస్థలను, ప్రజాస్వామ్యవాదులతో సమావేశం ఏర్పాటు చేసి వారివారి అభిప్రాయాలను కూడా తీసుకొని వ్ఞంటే ఎంతో హుందాగా ఉండేది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని కూడా విస్మరించడం లోపంగానే కనిపిస్తున్నది.

అందరితో సమాలోచనలు జరిపి వారి ఇచ్చిన సూచనలను, సలహాలనువినాల్సిన బాధ్యత ఒక రాష్ట్రనేతగా ముఖ్యమం త్రికి ఉంది.అందుకే మన పెద్దలు చెప్పారు. వినదగు ఎవ్వ రు చెప్పిన…. అందరి మాటలు ఓపికగా విని ఆ తర్వాత తనకు ఇష్టమైన, ఆచరణయోగ్యమైన నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.టిడిపిలోనే తనకు నచ్చిన కొందరు అనుచరుల తో తప్ప మిగిలిన వారితో తన ఆలోచనలను పంచుకోలే దనే అసంతృప్తికూడా ఉంది. మొత్తానికి రాష్ట్రానికి జరగా ల్సిన న్యాయం జరగలేదనేది కాదనలేని వాస్తవం. పరిస్థి తులు చేయిదాటిపోతుండడంతో టిడిపి మంత్రులు కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేయడం,అవిశ్వాస తీర్మా నం నోటీసులు ఇవ్వడం చకచక జరిగిపోయింది.

ఇందులో కూడా ఏమాత్రం జాప్యం జరిగినా తెలుగు ప్రజల ముందు ముఖ్యమంత్రి పలుచనఅయిపోయేవారు.నిజానికి తెగేదాకా లాగేందుకు చంద్రబాబుకు ఇష్టంలేదు. అందుకే ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ అంటే కూడా ఒప్పుకున్నారు. అయి నా అదికూడా చేసే పరిస్థితిలేకుండాపోయింది. విశాఖజోన్‌ ను పక్కకు పెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విలేకరుల సమావేశం పెట్టి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని తేల్చిచెప్పడమే కాదు హేళన చేస్తున్న ట్లు వ్యాఖ్యలు చేయడం తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. దీంతో చంద్రబాబుకు తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదొకరకంగా ఆయనకు కలిసివచ్చిందని చెప్పొచ్చు. ఆంధ్ర ప్రదేశ్‌కు ఇప్పటికే చాలా చేశాం.చేస్తున్నాం అని బిజెపి పెద్దలు సెలవిస్తున్నారు.గతంలో ఆపార్టీ అధ్యక్షుడు రెండు తెలుగురాష్ట్రాల పర్యటనకు వచ్చినప్పుడు లక్షలాది రూపా యలు కేటాయించినట్లు అంకెలతోసహా వివరాలు అందించి వెళ్లారు.అంతేకాదు తాముఇచ్చిన డబ్బుకుటిడిపి ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని ఆరోపించారు. అందుకే ఈ విష యంలో పార్లమెంటులో చర్చజరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఏదిఏమైనా పరిస్థితులు చేయి దాటుతున్నాయి. ఎందుకో ఏమోకాని తెలుగుప్రజలకు ఏదైనా పోరాటంతోటే వస్తుం దేమో.విశాఖ ఉక్కుకాని, ఆనాటి ప్రాజెక్టులు కాని, అంతెందుకు మొన్నటి తెలంగాణ రాష్ట్రఏర్పాటు కాని తెలు గు ప్రజలు పోరాటంచేసి సాధించుకున్నవనేది అందరికి తెలిసినవే.ఇక ప్రత్యేకహోదా ఉద్యమం ఎటుదారి తీస్తుం దో? ఎంతమంది ప్రాణాలు తీస్తుందో? మరెన్నివేల కోట్ల ఆ స్తుల నష్టం జరుగుతుందోనని ప్రజాస్వామ్యవాదుల ఆందోళన, ఆవేదన.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌