చిదంబరం అరెస్టు ఏ సంకేతాలిస్తుంది?

Chidambaram
Chidambaram

మీడియా కుంభకోణం కేసులో కేంద్ర ఆర్థి కశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌పార్టీకి చెందిన సీనియర్‌ నేత చిదంబరాన్ని ఎట్టకే లకు బుధవారం రాత్రి నాటకీయ పరిణామాలమధ్య కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) అరెస్టు చేసింది.ఈ నెల 26 వరకూ సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ ప్రత్యేక కోర్టు గురు వారం సాయంత్రం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్‌కోసం ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం, ఆ తీర్పుపై సుప్రీంకోర్టు తక్షణ విచారణకు అనుమతించక పోవడంతో సిబిఐకి కేంద్ర మాజీ హోంమంత్రిని అరెస్టు చేసేందుకు వీలుకలి గింది. ఐతే మంగళవారం ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరిం చినప్పటి నుంచే ఆయనను అరెస్టు చేసేందుకు సిబిఐ ఇడి అధికారులు శక్తివంచనలేకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నా రు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి ఢిల్లీలో గాలింపు చర్యలు విస్తృతంగా చేపట్టారు. లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. రెండు గంటల్లోగా తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరుతూ నోటీసులను ఆయన ఇంటి ముందు అంటించారు. ఆయన విదేశాలకు పారిపోకుండా ఎయిర్‌ పోర్టులతోసహా అన్నిప్రాంతాల్లో గట్టినిఘా ఏర్పా టుచేసినట్లు అధికారులే ప్రకటించుకున్నారు. ఇలా అధికా రులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు విస్తృతంగా గాలింపులు చేపడుతున్నట్లు చెప్పుకుంటున్న తరుణంలో అనూహ్యంగా బుధవారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ ప్రధాన కార్యాల యంలో ప్రత్యక్షమై విలేకరుల సమావేశంలో ప్రసంగించా రు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తనకుకానీ, తన కు టుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధంలేదని, తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అసలు ఈ కేసులో తాము నిందితులం కాదని, సిబిఐ, ఇడిలు ఏకోర్టులోనూ చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేయలేదని, దీనికితోడు సిబిఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా తాను తప్పుచేసినట్లు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టంగా విలేకరుల సమావేశంలో చెప్పా రు. అయితే తాను, తన కుమారుడు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు నిరాథార ప్రచారం జరుగుతున్నదని సిబిఐ విచారణకు పిలిచినప్పుడు కోర్టునుంచి రక్షణ కోరడం సహ జమని ఆయన వివరించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన తర్వాత నేరుగా జోర్‌బాగ్‌లోని తన నివాసానికే చిదంబరం వెళ్లారు.ఆయనకోసం గాలింపు చ ర్యలు చేస్తున్న సిబిఐబృందానికి ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతుండగా టీవీల్లో ప్రత్యక్షప్రసారం కావ డంతో ఒక్కసారిగా కళ్లుతెరిచి ఆ ప్రాంతాలకు ఆగమేఘాల మీద చేరుకున్నారు. కానీ చిదంబరం అప్పటికే ఇంటికి చేరుకుని తలుపులు వేసుకోవడంతో ప్రహరీగోడఎక్కి లోని కి దూకి వెలుపలకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్భందించా రు. అరెస్టుకు సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత ఆయనను సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. దీనికి సంబంధించి రాజకీయనేతలు ఎవరి పార్టీల విధానాలకు అనుగుణంగా వారు స్పందిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ నేతలు సహజంగానే చిదంబరానికి మద్దతు గా సమర్థిస్తూ రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతోసహా అనేకమంది సీనియర్‌కాంగ్రెస్‌ నేతలు ప్రకటనలుకూడా చే శారు. రాజకీయకక్షతోనే అరెస్టులు చేయిస్తున్నారనే ఆరోప ణలు గుప్పించారు. మరోపక్క చట్టం తనపని తానుచేసు కుంటూపోతుందని, ఇందులో తమ ప్రమేయం ఏమీలేదని అధికారంలో ఉన్న బిజెపి నేతలు అంటున్నారు. ఏదేమైనా ఈ కేసులోనే కాదు దేశంలో మరెన్నికేసుల్లో దర్యాప్తు సం స్థలు వ్యవహరి స్తున్న తీరుపై విమర్శలు వెల్లుబుకుతున్నా యి. ముఖ్యంగా దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సి బిఐ నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఎవరు అధి కారంలో ఉంటే వారి ఆలోచనలకు, ఆదేశాలకు అనుగుణం గా వ్యవహరిస్తున్నదనే అపవాదు మూటగట్టుకుంటున్నది. ఇది ఇప్పటికిప్పుడు ప్రారంభంకాలేదు. సిబిఐలో రాజకీయ జోక్యం పెరిగేకొద్దీ ఆ సంస్థ ప్రతిష్ట మంటగలుస్తున్నదేమో ననిపిస్తున్నది. రెండుమూడు దశాబ్దాలుగా సిబిఐపట్ల వి శ్వాసం, నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. అందులోనూ ఇటీవల సిబిఐలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, కీలకపదవ్ఞల్లో ఉన్న అధికా రులమధ్య వచ్చే అభిప్రాయబేధాలు ఆ సంస్థ ప్రతిష్టను మరింత దెబ్బతీశాయనే చెప్పొచ్చు.రాజకీయాల్లో నాయకు లు వస్తుంటారు, పోతుంటారు. ఈరోజు ఒకరు అధికారం లో ఉంటే మరోసారి ఇంకొకపార్టీ అధికారంలోకి రావచ్చు. కానీ సంస్థలు, వారుచేపట్టే చర్యలుమాత్రం గుర్తుండిపో తుంటాయి. కాకతాళీయంగా జరిగిందో, లేక కాంగ్రెస్‌ నేత లు ఆరోపిస్తున్నట్లు కక్షగట్టి వ్యవహరిస్తున్నారోఏమోకానీ 2010లో జరిగిన సంఘటనకు ప్రతీకారంగా ఇది జరిగిం దనే ప్రచారం జరుగుతున్నది. 2010లో అప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న పి.చిదంబరం సమయంలోనే అప్ప టి గుజరాత్‌ రాష్ట్రహోంమంత్రి అమిత్‌షా అరెస్టయ్యారు. 2005లో సోహ్రుబుద్దీన్‌ షేక్‌ గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పోలీసు కస్టడీలోనే మరణించడంతో అప్పటి హోంమంత్రిగా ఉన్న అమిత్‌షాపై ఆరోపణలు పెల్లుబుకడం కేసులు నమోదుకావడంతో సుప్రీంకోర్టు ఆదే శాల మేరకు అమిత్‌షాను సిబిఐ అధికారులు ఆనాడు అరెస్టు చేశారు. అందుకు ప్రతీకారంగా ఇప్పుడు ఈ అరె స్టు జరిగిందని, సిబిఐ అధికారులు అంత వెంటాడి అరెస్టు చేసినట్లు కాంగ్రెస్‌నేతలు ఆరోపిస్తున్నారు. బెయిల్‌ నిరాక రించిన తర్వాత ఆయన నేరుగా సిబిఐ ముందుహాజరై ఉంటే ఆయన ప్రతిష్ట మరింత ఇనుమడించేది. అలాకాకుం డా ఆయన ఒకరోజంతా అదృశ్యం కావడం,విలేకరుల స మావేశంపెట్టి ఆ తర్వాత ఇంటికి వెళ్లి తలుపులు వేసుకోవ డం ఆయన స్థాయికి తగ్గట్టుగా కన్పించడంలేదు. ఏదేమై నా రాజకీయకక్షలు తీర్చుకోవడంకోసం దర్యాప్తు సంస్థలను పనిముట్లుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు తరుచుగా వినిపిస్తున్నాయి. దానికి తగినట్లుగా కొందరు అధికారులు వ్యవహరించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతున్నది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/