చిచ్చురేపిన మణిపూర్‌ కొత్తజిల్లాల ప్రహసనం

 Manipur CM IBoby
Manipur CM Iboby Singh

చిచ్చురేపిన మణిపూర్‌ కొత్తజిల్లాల ప్రహసనం

ఉద్రిక్తతలకు నెలవుగా మారుతున్న మణిపూర్‌ లో మరోవివాదం రాజుకుంది.ఈశాన్యరాష్ట్రాల కూటమిలో కీలకంగా ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో ఏ చిన్న వివాదం జరిగినా అది రగులుకుంటుంది. అక్కడి రాజ కీయ ప్రాబల్యంపై తీవ్ర ప్రభావంచూపిస్తుంది. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు వివాదం అక్కడి రెండు తెగల్లో చిచ్చురేపిందనే చెప్పాలి.

ముఖ్యమంత్రిఒక్రమ్‌ ఇబోబిసింగ్‌ రాష్ట్రంలో కొత్తగా ఏడు జిల్లాలు ఏర్పాటుచేయాలని తల పోస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాలు ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో మరో ఏడు జిల్లాలు ఏర్పాటుచేసి మొత్తం 16 జిల్లాలు చేయాలన్న ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌ప్రభుత్వ నిర్ణయం కేవలం నాగాల ప్రాబల్యాన్ని అడ్డుకోడానికేనన్న వాదనకు బలం చేకూరుతోంది. అసోం,నాగాలాండ్‌, మి జోరమ్‌, మైన్మార్‌ సరిహద్దులుగా ఉన్న ఈ ఈశాన్య భారత్‌లోని చిన్నరాష్ట్రంలో మీటీలు,కుకీలు,నాగాలు బల మైన సామాజికవర్గాలుగా ఉన్నాయి. 60శాతంవరకూ ఉన్న మీటీలు తదితర వర్గాలు మణిపూర్‌లోయల్లోని నాలుగుజిల్లాల్లో విస్తరించారు మొత్తం తొమ్మిదిజిల్లాల్లో ఐదు కొండప్రాంతాల్లోను, నాలుగు మణిపూర్‌ లోయ ప్రాంతంలో ఉన్నాయి. కొండప్రాంతాల్లోని ఐదుజిల్లాల్లో ఆధిపత్యం వహిస్తున్నది నాగా తెగకు చెందినవారే కావ డంతో ఈ ప్రాంతంలో వారి ప్రాబల్యం మరింత పెర గకుండా ఉండాలంటే ప్రస్తుతం కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాలుఇందుకు వేదిక కాగలవని దీనివల్ల కొత్తజిల్లాల్లోని విభజన జరగడం వల్ల నాగాల ప్రాబల్యం తగ్గుతుంద న్నది నాగాల వాదనగా ఉంది.

మణిపూర్‌లో మీటీ తెగకు చెందిన ప్రజలు ఆదినుంచి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే నాగాలు మాత్రం ఇటీవలి స్థానిక ఎన్నికల్లో బిజెపికి ఎక్కువ మద్దతునివ్వడంతో రాజకీయంగా తమ ఉనికి దెబ్బ తింటుందనే సీఎం ఇబోబిసింగ్‌ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టి నాగాలను దెబ్బతీసేందు కు కుట్రలుచేస్తోందని విమర్శలు ఎదుర్కొంటున్నది. నా గాలు ఎక్కువగా ఉన్న కొండప్రాంతాలను విభజించి కొత్త జిల్లాల ఏర్పాటు అక్కడ విధ్వంసాన్నే సృష్టిస్తున్నట్లు చెప్పాలి.జిల్లాల పునర్విభజనవల్ల వేరువేరుజిల్లాల పరిధి లోనికి వెళ్లి రాజకీయ ప్రాబల్యం కోల్పోతామన్న నాగాల వాదనకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. కేవ లం పరిపాలన సౌలభ్యం కోసమే పునర్విభజన చేసినట్లు సీఎం ఇబోబిసింగ్‌ చెపుతున్నా అసలు కారణం రాజకీ యంగా తమను దెబ్బతీసేందుకేనని నాగాలు బలంగా విశ్వసిస్తున్నారు. ఈశాన్య భారత్‌దేశంలోని అతిచిన్న రాష్ట్రానికి 16 జిల్లాలు అవసరమా అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ప్రభుత్వకోణంలో ఆలోచించినా ఎన్నికలముందు ఇంత హడావుడిగా ఎవరి అభిప్రాయా లు, సూచనలు పరిగణనలోనికి తీసుకోకుండా జిల్లాల పునర్విభజన నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నల పై ప్రభుత్వం స్పందించే పరిస్థితిలో కూడా లేదు. మరో రెండునెలల్లో ఎన్నికలకు తెరతీస్తున్న మణిపూర్‌రాష్ట్రం లో నెలకొంటున్న ఉద్రిక్తతల కారణంగా రెండు జాతీయ రహదారులు రెండునెలలకుపైబడి దిగ్బంధనానికి లోన య్యాయి.17వేలమందికిపైగా కేంద్రబలగాలు వచ్చా యంటే అక్కడిపరిస్థితులను అద్దంపడుతోంది.రాష్ట్రంలో బలమైన తెగ అయిన మీటీల ఓటుబ్యాంకును దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి ఈనిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంఅవుతోంది.చట్టపరంగా రాజ్యాంగ నిబంధన లను అనుసరిస్తే ఈనిర్ణయం ఎట్టిపరిస్థితుల్లోను నిలబడదు. రాజ్యాంగంలోని 371(సి) ప్రకారంచూస్తే కొండప్రాంత సంస్థల అనుమతులు లేకుండా జిల్లాలను విభజించే అధి కారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సుదీర్ఘపాలనానుభవం కలిగిన ముఖ్యమంత్రి సింగ్‌కు సైతం అంశం తెలియనిది కాదు.వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోయప్రాం తంలోని మీటీలమద్దతు పొందేందుకు ఆయన మరింత గా పావులు కదిపారన్నది నిపుణుల పరిశీలనలో తెలు స్తోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. నాగా తీవ్రవాద సంస్థగా ఉన్న నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌తో గత ఏడాదే కేంద్రంశాంతి ఒప్పందం చేసుకుంది. దీనితో నాగాలు బిజెపికి సహజంగానే సాను కూలంగా ఉన్నారు.

ఇందుకు జూన్‌లో ఇంఫాల్‌ నగర పాలకసంస్థ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటటానికి నాగాల మద్దతే కీలకమని పాలక ప్రభుత్వం భావిస్తోంది. నాగాల మద్దతుతో బిజెపి మరింత బలపడుతుందని గుర్తించిన సీఎం పునర్విభజన పావులు కదిపారు. దీనితో నాగా ప్రాంత జిల్లాలను మాత్రమే విభజించడంవల్ల వివిధ జి ల్లాల పరిధిలోనికి వెళ్లి రాజకీయంగా పట్టు కోల్పోతారని అపుడు తమకు ఎదురు ఉండదన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. మణిపూర్‌లోయలోని మీటీలు కాంగ్రెస్‌ మద్దతుదారులన్న బలమైన వాదన నాగాల్లో ఉంది. మీటీలు నాగాలమధ్య మొదటినుంచి అగాథం కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగపరంగా నాగాలకు ప్రత్యేకప్రతిపత్తి రక్షణ ఉంది. వారునివసించే ప్రాంతాల్లో ఇతరులు భూములు, ఆస్తులు కొనుగోలు చేయకూడదు. అదేసమయంలో నాగాలు రాష్ట్రంలో ఎక్కడైనా ఆస్తులు కొనుగోలుచేసేందుకు చట్టంలో అడ్డంకులు కూడా లేవు. ఈఅంశాన్నే మీటీలు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల నాగాల ప్రాబల్యంపెరుగుతుందని, తమ ఉనికి దెబ్బతింటుందని మీటీలు వాదిస్తున్నారు. మణిపూర్‌ లాంటి అతిచిన్న రాష్ట్రాల్లో తెగలమధ్య చిచ్చురేపి రాజకీయ పట్టును సాధించుకోవాలనుకోవడం మంచి సాంప్రదాయం కాదని అక్కడి రాజకీయవిశ్లేషకులు సైతం చెపుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు వీడి, జనసంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వనంతకాలం ఇలాంటి విద్వేషాలు రగులుతూనే ఉంటాయి. ఏదిఏమైనా ఎన్నికలు మరో రెండునెలల్లో జరుగనున్న నేపథ్యంలో మణిపూర్‌ ముఖ్యమంత్రి నిర్ణయం శాంతిభద్రతల దృష్ట్యా ఎటుదారితీస్తుందోనన్న ఆందోళనలకు అక్కడి ప్రభుత్వమే జవాబుదారీ కావాలి.

దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, వార్త