గుండెపోటుకు చికిత్స లేటైతే చేటే!

Heart Attack
Heart Attack

గుండెపోటుకు చికిత్స లేటైతే చేటే!

తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటు వచ్చిన రోగులను తగిన సమయంలో ఆస్పత్రులకు చేర్చలేని పరిస్థితి కనిపిస్తోంది. కార్డియాలిజిస్టుల సొసైటీ నిర్వహించి న అధ్యయనంలో ఇది వెల్లడయింది. తెలంగాణలో ఆరోగ్యభద్ర తకు సంబంధించిన వైద్యసేవల్లో ఎన్నో లోపాలు కనిపించాయి. గుండెపోటు తీవ్రంగా వచ్చేటప్పుడు అర్బన్‌ ఏరియాల్లోని రోగుల ను ఆస్పత్రికి చేర్చడానికి దాదాపు నాలుగు నుంచి ఆరు గంటలు పడుతుండగా, సెవిూ అర్బన్‌ ఏరియాల్లో 12 గంటల సమయం పడుతోంది.ఇటువంటి రోగులను 60 నుండి 90 నిముషాల లోపే ఆస్పత్రులకు చికిత్సకోసం తరలించడం అవసరం. ఈ 60-90 నిముషాలే రోగులకు భద్రత కలిగించే అమృత ఘడియలు. గుండె పోటు వ్యాధులకు చికిత్సపొందే రోగులు తప్పనిసరిగా ఈ అమృత ఘడియలు మించకుండా ఆస్పత్రులకు చేరడం డాక్టర్లచే పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. కార్డియాలజిస్టుల సొసైటీ ఆఫ్‌ ఇండియా ఈ విషయమై సర్వేనిర్వహించింది. ఆస్పత్రుల్లో కార్డియో థెరపీ పొందుతున్న రోగులను ప్రత్యక్షంగా కలిసి వారి కష్టసుఖా లను విచారించింది. ఇది ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే కాదు వరంగల్‌, కరీంనగర్‌ వంటి పట్టణాల్లోనూ కనిపిస్తోంది. వరంగల్‌, కరీంనగర్‌ పట్టణాల్లో ఈ మేరకు కేర్‌ లాబ్‌లు ఉన్నాయి. అలాగే ఆస్పత్రులు ప్రాథమిక చికిత్సలో భాగంగా కరోనరీయాంజియో ప్లాస్టే చికిత్సఅందించే అవకాశాలున్నాయి. అ యితే చాలా మందికి దీనిపై అవగాహన లేదు. గ్రామాల్లో ప్రాక్టీసు చేసే వైద్యులకు కూడాఈ విష యాలు సరిగ్గా తెలియ వ్ఞ.కరోనరీయాంజియో ప్లాస్టే చికిత్స గుండెపోటు రోగులను ఆదుకోగలదు.దీనివల్ల సత్ఫలి తాలు కనిపిస్తాయి కూడా. అయితే ఈ వైద్యం అందాలంటే రోగి సకాలంలో ఆస్పత్రికి చేరుకుంటేనే సాధ్యమవ్ఞతుంది. ఈ విషయం లో బహుముఖ ప్రణాళిక అవసరం. క్షేత్రస్థాయిలోని మెడికల్‌ ప్రాక్టీషనర్లు, ప్రభుత్వం కూడా సమన్వయంతో వ్యవహరిస్తే రోగిని సకాలంలో ఆస్పత్రికి చేర్చగలుగుతారు. కొంతమంది ఛాతీలో నొప్పి వచ్చినా అశ్రద్ధ చేస్తుంటారు. స్థానిక డాక్టర్ల నుంచి ఏవో మందులు తీసుకుని ఉపశమనం పొందుతుంటారు. వెంటనే సరైన డాక్టర్‌ను వారు సంప్రదించరు.
ముందుజాగ్రత్త చర్యలేమిటో తెలుసుకోరు. తెలియకపోవడం కొంత కారణమయితే ఆర్థిక ఇబ్బంది మరో కారణం. అందువల్ల ఇటువంటి రోగులకు ఉచితంగా ప్రభుత్వం అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలి. చాలామంది రోగులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఆస్పత్రులకు సకాలంలో చేరుకోకపోవడం జరుగు తోంది. తెలంగాణ చాప్టర్‌ ఆఫ్‌ కార్డియాలజిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (టిసిఎస్‌3) నగరానికి చెందిన 18 కార్డియిక్‌ సెంటర్ల నుంచి ఈ సమాచారం సేకరించింది. ఆగస్టు 18 నుంచి 24 తేదీల్లో ఈ సర్వే జరిగింది. ఈ సమయంలో 296 మంది గుండె పోటు రోగులు యాంటియోప్లాస్టీ చికిత్స పొందగలిగారు. వారిలో 68 మంది మాత్రమే 90 నిముషాల్లో అమృత ఘడియల్లో జీవితాన్ని రక్షించుకొనే చికిత్స పొందగలిగారు. మిగతా 228 మంది రోగులు యాంజియాప్లాస్టీని ఆలస్యంగా పొందగలిగారు. ఇది కొన్ని గంటలు కాదు కొన్ని వారాలు ఆలస్యమయితే 5 నుంచి 10శాతంకేసుల్లో ప్రాణపాయం సంభవించే పరిస్థితి ఏర్పడుతుంది. వైద్య సాంకేతిక ప్రక్రియలో ప్రయిమరీ కరోనరీ యాంజియోప్లాస్టీ (పిసిఎ) అంటే గుండెధమనుల్లో ఎక్కడయితే రక్తం గడ్డకడుతుందో అక్కడ ధమనులను తెరిచి స్టంట్స్‌ అమరుస్తారు. ఇది గుండెపోటు రావడానికి ముందు లేదా తరువాత చేస్తారు. సకాలంలో చేసినా లేదా అలస్యమైనా వ్యయంలో తేడా ఉండదు.

డాక్టర్‌ బి. రామకృష్ణ
(మదర్‌థెరిసా సర్వీస్‌ కేర్‌ సెంటర్‌)