గందరగోళంగా మారుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ

COUNCELLING
COUNCELLING

గందరగోళంగా మారుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ రోజుకో ఉత్తర్వుతో గందరగోళంగా మారుతుంది. విద్యాశాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన అవగాహన లేకపో వడం వివాదాస్పదమవ్ఞతుంది. బదిలీల ప్రక్రియలో భాగంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న అందరు ఉపాధ్యా యులు,ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకు న్నారు. రెండు సంవత్స రాల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉపా ధ్యాయులు కూడా దరఖాస్తులు పెట్టడంతో సుమారురాష్ట్ర వ్యాప్తంగా ఎనభైవేల మంది నుండి బదిలీల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

అనేక మంది ఉపాధ్యాయులు ‘ఫ్రిఫరెన్షియల్‌ క్యాటగిరీ కింద తమకు తమ కుటుంబ సభ్యులకు అనారోగ్యం లేకున్నా అనారోగ్యంతో బాధపడుతున్నామని, శస్త్రచికిత్సలు సైతం చేయించామని, వివిధ రకాల వ్యాధులకు సంబంధించి జిల్లాల్లోని మెడికల్‌ బోర్డులోని వైద్యులతో కుమ్మక్కై నకిలీ సర్టిఫికేట్లు జతచేసి సీనియారిటీ జాబితాలో ముందున్నారు. ప్రతీ జిల్లాలో సుమా రు మూడువందల నుండి అయిదు వందల మంది ఉపాధ్యా యులు ప్రిఫరెన్షియల్‌ క్యాటగిరిలో ముందున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నకిలీ సర్టిఫికేట్లు కలిగిన 17 మంది టీచర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో కూడా నకిలీ సర్టిఫికెట్లు జతచేసిన వారిపై విచారణ చేపట్టాలి. తద్వారా అసలు ఆరోగ్య సమస్య లతో సతమతమయ్యేవారు వెనుకబడిపోతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్నవారే అడ్డదారులు తొక్కితే సమాజం ఎటు పయనిస్తుందో అర్థంకావడం లేదు.

ఈసారి వెక్‌ కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీలు చేపడతామని ప్రభుత్వం పేర్కొంది. వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియపై ఉపాధ్యాయులకు అవగాహన లేదు. కనీసం శిక్షణ ఇవ్వలేదు. ప్రతీ ఉపాధ్యా యుడు ఖాళీగా ఉన్న పోస్టులలో ఆప్ఫన్స్‌ ఇవ్వాల్సివ్ఞంది. ఏ.పి రాష్ట్రంలో గతంలో జరిగిన ఉపాధ్యాయుల వెబ్‌ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరిగాయని తెలుస్తుంది. లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. సీనియారిటీ జాబితాలో ముందంజలో ఉన్నవారు తాను కోరుకున్న ప్రాంతం కాకుండా దూరంగా వెళ్లే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. సుమారు నలభైవేలకుపైగా సెకండ్‌ గ్రేడ్‌ ఉపాధ్యాయులు తమకు కేటాయించిన రెండు రోజుల గడువ్ఞ ఆప్ఫన్స్‌ల్లో నమోదు సాధ్యమవ్ఞతుందా? గంటల తరబడి నెట్‌ సెంటర్‌లలో కూర్చుంటేగాని ఆప్షన్స్‌ ఇవ్వలేం, సర్వర్‌ డౌన్‌ కావడం, సిగ్నల్‌ సమస్యలు కూడా ఉంటాయి.

కాబట్టి సుమారు వారం రోజుల పాటు వెబ్‌ ఆప్షన్స్‌ పెట్టుకునే అవకాశాన్ని ఎస్‌.జి.టి ఉపాధ్యాయులకు ఇవ్వాలి. జిల్లాల వారీగా మెడికల్‌ బోర్డు నుండి సర్టిఫికెట్లు పొందిన ఉపాధ్యాయుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి. నకిలీ అని తేలితే సర్వీస్‌ నుండి తొలగించాలి. పారదర్శకంగా బదిలీలు చేపట్టాలి. ఎలాంటి అక్రమాలకు తావ్ఞ ఇవ్వకుండా బదిలీలు చేపట్టి విద్యాశాఖ ప్రతిష్టను పెంచాలి.

– కామిడి సతీష్‌రెడ్డి