ఖరీదైన వైద్యం -గరీబౌతున్న జనం

treatment
treatment

ఖరీదైన వైద్యంగరీబౌతున్న జనం

గ్రామాల్లోని 86శాతం మంది నగరాల్లో 82 శాతం మంది ప్రభు త్వపరంగా కానీ ప్రయివేట్‌రంగం ద్వారా కానీ ఎలాంటి ఆరోగ్య వైద్యపథకాలకు నోచుకోవడం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వైద్యపథకాలున్నాయని, వాటి ద్వారా తమ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయన్న అవగాహన చాలా మందికి లేదు. అవగాహన పెంచే లా ప్రచారం కూడా జరగడం లేదు. వైద్య బీమాకు సంబంధించి ప్రయివేట్‌ఏజెన్సీలు చాలా పరిమిత పరిధిలో బీమాను అమలు చేయగలుగుతున్నాయి. నగరాల్లో ఉన్నతాదాయ వర్గాల వారిలో 12శాతం మంది మాత్రమే ఇటువంటి బీమా సౌకర్యాల పరిధిలోకి వస్తున్నారు. మిగతా వారికి ప్రయివేట్‌ వైద్యబీమా అందడం లేదు.

గ్రామీణుల ఆదాయం అంతంత మాత్రమే. వీరిలో కూలీలు, అట్టడుగు వర్గాల సంపాదన కనీసం తిండిగింజలకు కూడా చాలదు. ఈ పరిస్థితుల్లో కుటుం బంలో ఎవరికైనా వైద్యంకోసం ఖర్చుపెట్టాలంటే తమ సంపాదన తోపాటు రుణాలు తెచ్చుకుని ఆస్పత్రులకు ధారపోస్తుంటారు. ఈ విధంగా సంపాదనలో 68 శాతం, రుణమొత్తాలు 25శాతం వైద్యం ఖర్చులకే చెల్లుచీటి అవ్ఞతున్నాయి. నగరాల్లోనూ ప్రజలు తమ సంపాదనలో 75 శాతం తెచ్చుకున్న అప్పుల్లో 18 శాతం వైద్యానికే అర్పించవలసి వస్తోంది. గ్రామాల్లోని నిరుపేద ప్రజలు ఒక శాతం మంది వైద్యఖర్చుల కోసం తమ ఆస్తులను అమ్ముకోవలసిన దుస్థితి కూడా కొనసాగుతోంది. ఐదుశాతం కన్నా ఎక్కువమంది తమ స్నేహితులు,బంధువ్ఞల నుంచి అప్పుచేసి ఖర్చుపెట్టవలసి వస్తోంది. ఫలితంగా ఏటా కొన్ని లక్షలమంది వైద్యఖర్చుల కోసం వెచ్చిస్తూ అప్పులపాలయి కటిక దరిద్య్రం అనుభవిస్తున్నారు. బడా కంపెనీలు తయారు చేసే ఔషధాలను బ్రాండెడ్‌ మందులు గా వ్యవహరిస్తారు.

ఆ మందుల పేటెంట్‌ గడువ్ఞ తీరిపోగానే, వాటిలోని రసాయనాలతో వేరే కంపెనీలు ఉత్పత్తి చేసే మందులను జనరిక్స్‌ అంటారు. బ్రాండెడ్‌ మందులకన్నా ఇవి 30-80 శాతం తక్కువ ధరకేలభిస్తాయి. ఏదైనా మందును కొత్తగా తయారుచేయా లంటే ఆమేరకుపరిశోధనలకే ఎక్కువగా నిధులు ఖర్చు చేయవలసి వస్తుంది. కనుక దాన్ని కని పెట్టిన కంపెనీకి 20 ఏళ్లపాటు పేటెంట్‌ ఇచ్చి ఆమేరకు ఖర్చులు రాబట్టుకోడానికి వీలు కల్పిస్తారు. ఆపే టెంట్‌ గడువ్ఞ తీరిపోగానే ఇతర కంపెనీలు వాటిని బాగా తక్కువ ఖర్చుకే తయారు చేసిచౌకగా విక్రయిస్తాయి.అవే జనరిక్‌ మందులు. ప్రజలకు చౌకగా జనరిక్స్‌ను అందించడానికి కేంద్రప్రభు త్వం 2008లోనే జనఔషధి పథకాన్ని ప్రారంభించినా అది కొనసాగడం లేదు.ఈ జనరిక్‌ మందుల విక్రయానికి2008లో ప్రారం భించిన జన ఔషధి పథకం ఎందుకు విఫలమైందో పరిశీలించడం అవస రం. ఈ పథకం కింద ఎనిమిది రాష్ట్రాల్లో తెరిచిన 178 జన ఔషధి దుకాణాలను తెరిచారు.

అయితే వీటిలో 85 దుకాణాలు 2015 జూన్‌ నాటికి మూతపడ్డాయి. ఇదే పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన జీవనధార దుకాణాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. వైద్యులు జనరిక్స్‌ను సిఫార్సు చేయకపోవడం ఒక్కటే దీనికి కారణం కాదు. ఈ దుకాణాల్లో అన్ని మందులూ దొరక్కపోవడం పెద్దలోపం.జన ఔషధి దుకాణాలకు మందులను సరఫరా చేయా ల్సిన బాధ్యత ప్రభుత్వరంగ ఫార్మా కంపెనీలదే. కానీ ఆ కంపె నీలు అన్నివ్యాధుల చికిత్సకు మందులను అందిం చడం లేదు. అందుకే అనేక జన ఔషధి విక్రయశాలలు బోసిపోవడం ప్రారం భించాయి. ఈ లోటును భర్తీ చేయడానికి ప్రైవేట్‌ ఫార్మాకంపెనీల నుంచి జనరిక్స్‌ను కొన డానికి టెండర్లు పిలిచినా చివరి క్షణంలో వాటిని రద్దుచేశారు. తమి ళనాడు, రాజస్థాన్‌,హర్యానా,కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాస్పత్రు లే ఉచితంగా మందులు ఇవ్వడం వల్ల అక్కడ జన ఔషధి ప్రయోగం విఫలమైంది. అన్నింటినీ మించి వైద్యులు బ్రాండెడ్‌ మందులు రాస్తే దుకాణాలు వాటికి జనరిక్స్‌ను విక్రయించడం చట్టరీత్యానేరం. ఇలా జరగకుండా వైద్యులు తప్ప నిసరిగా జనరిక్‌ మందులనే రాసేలా చూడటానికి కేంద్రప్రభుత్వం బిల్లు తీసుకురాడానికి యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈలోగా జన ఔషది పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర సంకల్పించింది. 2016 మార్చికి 21 రాష్ట్రాల్లో 253 జన ఔషధి దుకాణాలు ఉండగావీటి సంఖ్యను 2017 చివరికల్లా మూడు వేలకు పెంచాలని,2వేల కొత్త రక్తశుద్ధి కేంద్రా లను నెలకొల్పాలని 2016-17 కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదించింది. జన ఔషధి దుకాణాల్లో 577 ప్రాణరక్షక మందులు, 250 వైద్యపరిక రాలను విక్రయిస్తారు. కొత్త జనఔషధి కేంద్రాల్లో వెయ్యి దుకాణాల ను ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్పుతామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 50వేల మందికి ఒక జన ఔషధి దుకాణం వంతున అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది.

2014 చివరినాటికి భారతదేశంలో 4.1 కోట్ల మధుమేహ రోగులు, 5.7 కోట్ల హృద్రో గులు, 22 లక్షల మంది క్షయరోగులు, 11 లక్షల మంది కేన్సర్‌ రోగులు, 25 లక్షల మంది హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌ రోగులు ఉన్నారు. వయోజనుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు రక్తపోటుతో బాధపడుతు న్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వహయాంలో 58 శాతం హృద్రోగ మందులు, 21శాతం మధుమేహ మందులను ధరల నియంత్రణ లోకి తెచ్చారు. ధరల నియంత్రణ పరిధిలోని మందులు మరీ ఎక్కువగా ఉన్నాయని, వాటి జాబితాను తగ్గించికొత్త పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతీయ ఔషధి దుకాణాల్లో సులువ్ఞగా, చౌకగా, విరివిగా లభించేలా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మెదడు, రొమ్ము కేన్సర్‌ వ్యాధుల నివారణకు వినియోగించే ట్రెస్టుజుమాజ్‌, టెమోజొలోమైడ్‌ వంటి మందుల ధరలను54శాతం వరకు తగ్గించినా అవి మార్కెట్లో లభ్యంకావడం లేదు.ఆస్పత్రుల ఫార్మసీల వద్ద మాత్రమే అవి లభ్యంఅవ్ఞతున్నాయి. ఇమ్యూనో థెరపీ, లేదా బయోలాజి కల్‌ థెరపీ విధానాలు సత్ఫలితాలు ఇస్తు న్నాయి. అయితే ఈ చికిత్సలకు వ్యయం భరించలేని విధంగా తయారైంది. ఈ విధానాలకు వినియోగించే మందులు మార్కెట్లో అందుబాటు కావడంలేదు.

ఆస్పత్రులు ఈ విషయంలో గుత్తాధి పత్యం వహిస్తున్నాయి. అన్ని మందులూ తమ ఫార్మసీల ద్వారానే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తుంటాయి. రోగులు ఈ మందుల ధరలు ఏది ఎక్కడ ఎలా ఉన్నాయో చూడడం సాధారణంగా జర గదు. పాతవైద్య పద్ధతుల ప్రకారం కిమోథెరపీ కేసులో రేడియే షన్‌కు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.5వేల వరకు ఖర్చు అవ్ఞతుంది. అయితే ఆధునిక టెక్నాలజీ ప్రకారం రూ.30వేలనుంచి రూ.35వేల వరకుఆస్పత్రు ల్లో ఐఎంఆర్‌టి వసూలు చేస్తోంది. అదే ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో రూ.70వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవ్ఞతోంది. ఇమ్యూనోథెరపీ వంటికొత్త చికిత్స విధానం ప్రకారం నెలకు 60వేల నుంచి 80వేల వరకు కేన్సర్‌ స్థాయినిబట్టి ఖర్చు పెట్టవలసివస్తోంది.కొన్ని మందుల ధరలను నేషనల్‌ ఫార్మాస్యూటి కల్‌ ప్రైసింగ్‌ ఆథారిటీ తగ్గించినా మొత్తం చికిత్సకు వ్యయం తడిసిమోపెడవ్ఞతోందని సీనియర్‌ డాక్టర్లు చెబుతున్నారు. కేన్సర్‌ ప్రారంభంలోనే అంటే ఆ లక్షణాలు కనిపించినప్పుడే చికిత్స ప్రారం భిస్తే చాలా వరకు నివారించవచ్చు. కానీ వ్యాధి ముదిరిన తరువాత చికిత్స ప్రారంభిస్తే ఆ రోగి అధిక వ్యయం భరించవలసి వస్తోంది. చాలా మంది రోగులు ఇంత ఖర్చు ఎలా తట్టుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అందు కనే కేన్సర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు, స్పెషల్‌ కేర్‌ ప్యాకేజీలను చాలా మంది ఆశిస్తుంటారు.

ఆస్పత్రిలో చికిత్స పొందాలంటే సగటున ప్రతిఒక్కరికి పట్టణాల్లో రూ.25 వేలు, గ్రామాల్లో రూ.15వేల వరకు ఖర్చు అవ్ఞతోంది. ఔషధాలు, వైద్యపరికరాల ధరలను అదుపు చే యడానికి ప్రభుత్వపరంగా ఎలాంటి సంస్థ లేకపోవడం ప్రత్యేకించి చెప్పుకోదగిన అంశం. దీన్ని సాకుగా తీసుకొని ఈ ఉత్పత్తి సంస్థలు రోగులను నిలువ్ఞ దోపిడీ చేస్తున్నాయి.ఇటీవల స్టెంట్ల ధరలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. హృద్రోగ్రానికి సంబంధించి వినియోగించే ఈ స్టెంట్ల ధర అమెరికా వంటి దేశాల్లో రూ.28వేల నుంచి48 వేల వరకు ఉండగా మనదేశంలో రూ.60 వేల నుంచి రూ.1.40 లక్షల వరకు అమ్ముతున్నారు. ఇదే విధంగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు, చెవ్ఞడు కలిగిన వారు శబ్దం వినడానికి వినియోగించే పరికరాల ధరలు విదేశాల్లో చాలా తక్కువస్థాయిలో ఉండగా మనదేశంలో మాత్రం అందుబాటులో లేకుండాపోతున్నాయి.

ఈ పరిస్థితి నివారించాలంటే స్వదేశీయంగా ఔషధాలు వైద్యపరికరాలు ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం సాధిస్తేనే పేదరోగులకు ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. కేన్సర్‌, మధుమేహం, పార్కిన్‌సన్స్‌, డెంగూ వంటి ప్రాణాంతక వ్యాధు లను నయంచేయడానికి మనదేశంలో సరైన వైద్యవిధానం అందుబా టులో లేదు. ఇదివరకటి ఔషధాలకు వ్యాధులు లొంగడం లేదు. ఆధునికంగా ఈ వ్యాధులను నివారించగల ఔషధాలను కొనుగొనడా నికి నిరంతరం పరిశోధనలు అవసరం. సరైన ఔషధాన్ని కనుగొనా లంటే పరిశోధనలకు కొన్నేళ్లు వ్యవధి పడుతోంది. అంతేకాక పరి శోధనలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పు డు నిధులు అందుతుండాలి. కానీ ప్రభుత్వాలు ఈ సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం లేదు.ఇతర కార్యక్రమాలకు కొన్ని కోట్లు వెచ్చి స్తున్నారు.ప్రచారాల పేరిటలక్షలు తగలేస్తున్నారు.ప్రజల మూలుగు లను పీల్చిపిప్పి చేస్తున్న వ్యాధుల నివారణకు ఎందుకో ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పోల్చలేని రోగాలతో జనం మంచం పడుతున్నారు.

ఉదాహరణకు ఉత్తరాంధ్రలోని ఉద్దానం ప్రాంతాన్ని పరిశీలిస్తే కిడ్నీ వ్యాధులతో గతపదేళ్లలో 4500 మంది ప్రణాలు కోల్పోయినా ప్రభుత్వం ఇంత వరకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.క్షయ,మలేరియా, డెంగ్యూ, చిగున్‌ గున్యా వంటి వ్యాధులకు గత 30ఏళ్లలో ఎన్నో ఔషధాలను ప్రతి పాదించినప్పటికీ వాటిలో రోగులకు అందుబాటులోకి వచ్చేవి కేవ లం 21 ఔషధాలే.ఏదైనా కొత్తగా ఔషధం కనుగొని అందబాటులోకి తేవాలంటే దాదాపు 260 కోట్లు ఖర్చుఅవ్ఞతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంత భారీ వ్యయాన్ని భరించే ఆర్థికశక్తి ఏ ఒక్క దేశానికీ ఉండకపోవచ్చు. అంతర్జాతీయస్థాయిలో భారీగా నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. జాతీయ,అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి ఔషధాల పరిశోధ నలను ప్రోత్సహిస్తేనే రోగులకు మేలు జరుగుతుంది.

బి.రామకృష్ణ
(మదర్‌ థెరిసా హెల్త్‌కేర్‌ సెంటర్‌)