కొనసాగుతున్న అనిశ్చితి

రాష్ట్రం: తమిళనాడు

Palani samy, Dinakaran

Palani samy, Dinakaran

కొనసాగుతున్న అనిశ్చితి

తమిళనాడు రాష్ట్రంలో రాజకీయం రోజుకో రకంగా మారుతోంది. గ్రూపులు,సమీకరణలు ఎప్పటికప్పు డు మారుతున్నాయి. తమిళనాడుపై ఆధిపత్యం సాధించడానికి కేంద్రం లోని బిజెపి కూడా తనకు అను కూలంగా ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని వ్యూహాలను అమ లు చేయడంతోతమిళనాడు రాజ కీయమంతా రహస్యంగా మారింది. దివంగత మాజీ సిఎం జయలలిత మిగిల్చిన రాజ కీయ శూన్యం ఫలితం రాష్ట్ర రాజకీయాన్ని పూర్తి అని శ్చితంగా మార్చింది. అన్నాడిఎంకె ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనసాగుతుందా?మధ్యలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా? రాష్ట్రపతి పాలన వస్తుందా? అనే అనుమానాలతో రాజకీయాలు అస్థిరంగా కొనసా గుతున్నాయి.

ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామి తన కుర్చీని మరింత సుస్థిరం చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. శశికళ వారసుడిగా తెరపైకి వచ్చిన దిన కరన్‌ ఆధిప త్యాన్ని చెక్‌ పెట్టే విధంగా ముఖ్యమంత్రి పళనిస్వామి పావ్ఞలు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంతో చేతులు కలిపే ప్రయత్నంలో ఉ న్నారు. అవసరమైతే పళనిస్వామి పన్నీర్‌సెల్వం వర్గా లు విలీనంకావడానికి ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఏ ప్రాతిపదికన ఇరువర్గాలు విలీనం కావాలన్న విష యంలో రెండు గ్రూపుల మధ్య చర్చ జరుగుతున్నది. మరోవైపు ఇరువర్గాలను దెబ్బతీసి తానే అధికారం లోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలని దినకరన్‌ నెంబర్‌ గేమ్‌ను ప్రారంభించారు.

ఇప్పటికే తనకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించిన ఆయ న వారితో సమావేశాలు మంతనాలు జరుపుతున్నా రు.దీంతో అధికార అన్నాడిఎంకె మూడు గ్రూపులుగా చీలిపోవడంతో మరోసారి మెజారిటీ అంశాన్ని విపక్ష డిఎంకె ముందుకు తెస్తోంది. అధికారపార్టీలో ఎవరికి మెజారిటీ లేదని ఇప్పుడు అధికారంలో ఉన్న పళని స్వామిపై అవిశ్వాసతీర్మానం పెట్టే ప్రయత్నంలో డిఎంకె తెరవెనుక సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు దినకరన్‌ తనపై నమోదైన కేసుల నుంచి తప్పించు కోవడంతోపాటు బిజెపితో రహస్య అవగాహనకు వచ్చి ఏఐడిఎంకెని తన గుప్పిట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం లో ఢిల్లీలో క్యాంప్‌ వేశారు. బిజెపి అగ్రనేతలతో దిన కరన్‌మంతనాలు జరుపుతున్నారు.పళనిస్వామి, పన్నీ ర్‌సెల్వం వెంటఉన్న ఎమ్మెల్యేలను మరింత మందిని తనవైపునకు తెచ్చుకునే ప్రయత్నాలను కొనసాగిస్తు న్నారు. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తాము మద్దతు ఇస్తామని దినకరన్‌ బిజెపి నాయకులకు హామీ ఇస్తున్నారు. దీనికి ప్రతిగా తనకు రాష్ట్రంలో పార్టీపై పట్టుపెరిగేలా సహకరించాలని భవి ష్యత్తులో కూడా బిజెపికి వ్యతిరేకంగా వెళ్లనని ఆయ న వారికి హామీ ఇస్తున్నారు.దీనికి బిజెపి అగ్రనాయ కత్వం ఎలాస్పందించింది అన్నది బయటకు రాలేదు.

అసలు బిజెపి ఏఐడిఎంకెలో ఎవరికి మద్దతు ఇస్తుంద నేది కూడా బయటకు రావడం లేదు. మొత్తంగా తమి ళనాడులో ఏర్పడిన అనిశ్చిత రాజకీయ పరిస్థితుల్లో సంక్షోభం ఏర్పడితే రాష్ట్రపతిపాలన విధించి తద్వారా కొత్త రాజకీయ శక్తులను రంగంలోకి తీసుకురావాలని బిజెపి ప్రయత్నిస్తుంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను రంగంలోకి తీసుకువచ్చి ఆయనను జయలలితకు ప్రత్యామ్నాయ రాజకీయ కేంద్ర బిందువ్ఞగా చేసే ప్రయత్నాల్లో ఆ పార్టీ ఉంది.అయితే రజనీకాంత్‌ తన రాజకీయ ప్రవేశంగురించి భవిష్యత్‌ రాజకీయ వ్యూహా ల గురించి బయటపడడం లేదు.

ముఖ్య మంత్రి పళనిస్వామి మాజీ సిఎం పన్నీర్‌తో సయోధ్య కుదిరితే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రాజకీయవర్గాలు ప్రచారం జరుగు తున్నది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ జైలులో ఉండడంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించి సాధారణ సభ్యురాలిగా నియమించే వ్యూ హంతో సిఎం పళనివర్గం ముందుకు వెళ్తున్నది. శశి కళను సాధారణ సభ్యురాలిగా హోదాను తగ్గిస్తే ఆమె నియమించిన ఉపప్రధాని కార్యదర్శి పదవి కూడా రద్దు అయ్యే అవకాశం ఉండడంతో ఈ దిశగా పళని వర్గం రాజకీయ వ్యూహాలను రచిస్తుంది.తద్వారా దిన కరన్‌నుకూడా ఒంటరిగాచేసి ఎమ్మెల్యేలందరిని దారికి తెచ్చుకొని వచ్చే నాలుగేళ్లు తన పదవిని సుస్థిరం చేసుకోవడంకోసం పళనివర్గం ఆలోచిస్తున్నది. అయితే పళనివర్గానికి పన్నీర్‌సెల్వం సహకరిస్తారా? సయోధ్య కు ముందుకు వస్తారా? ఇరువర్గాల మధ్య రాజకీయ షరతులు కుదురుతాయా?అన్నది మాత్రం సందేహం గానే మిగిలింది. ఎఐడిఎంకెలో ఎవరికివారు పార్టీపై అధికారంపై పట్టుకోసం వ్యూహాలను అమలు చేస్తూ రహస్యసమావేశాలను కొనసాగిస్తున్నారు.

ఢిల్లీలోని బిజెపి పెద్దలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నాలు కొనసాగిస్తు న్నారు. విపక్షనేత ఎంకె స్టాలిన్‌ అధికార ఎఐడిఎంకె లో కొనసాగుతున్న రాజకీయనాటకాలను సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఎఐడిఎంకెలో మూడువర్గాల పోరు మధ్య అసంతృప్తి ఎమ్మెల్యేలను తనవైపునకు తెచ్చు కునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తం గా అధికారపార్టీలోఎమ్మెల్యేలు దినకరన్‌,పళనిస్వామి, పన్నీర్‌సెల్వంల మధ్య చీలి మరికొందరు తనవైపునకు వస్తే తమిళనాడులో అధికారపార్టీకి మెజారిటీ లేదని గవర్నర్‌కు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి స్టాలిన్‌ రంగం సిద్ధం చేస్తున్నారు.దీంతో తమిళనాడులో రాజ కీయాలపై సస్పెన్స్‌ ఇప్పట్లో తేలిపోయే అవకాశాలు కన్పించడం లేదు.

-మిట్టపల్లి శ్రీనివాస్‌