కేన్సర్‌ తీవ్రంగా కమ్ముకున్న మూడో దేశం భారత్‌

Patient
Patient

కేన్సర్‌ తీవ్రంగా కమ్ముకున్న మూడో దేశం భారత్‌

భారతదేశంలో మహిళల జీవన శైలిలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. ఆర్థికంగా ఒకవైపు స్వయం శక్తితో ఎదుగుతున్నాఆరోగ్యపరంగా చాపకింద నీరు లా అవలక్షణాలు కమ్ముకొస్తున్నాయి. ఆహారపు అలవాట్లు మారు తున్నాయి. దానికి తగ్గట్టు శారీరక శ్రమ ఉండడం లేదు. ఆఫీసుల్లో కానీ మరే కార్యాలయాల్లో కానీ కదలిక లేని ఉద్యోగాల వల్ల కొంత, ఆలస్యంగా వైవాహికజీవితం ప్రారంభంకావడం, ఆలస్యంగా సంతా న వంతులు అవడం, సంతానం సంప్రాప్తించినా పొత్తిళ్ల పురిటికం దుకు స్తన్యపోషణ సరిగ్గా సమకూర్చకపోవడం ఇవన్నీ వారిని ఊబ కాయానికి తరువాత మధుమేహం, క్యాన్సర్‌ వంటిరోగాలకు బలి చేస్తున్నాయి.

కాల్‌ ఫర్‌ యాక్షన్‌ ఎక్స్‌పాండింగ్‌ కేన్సర్‌ కేర్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ఇండియా 2017 నివేదిక భారతదేశంలోని మహిళా కేన్సర్‌ రోగుల సంఖ్య రానురాను విపరీతంగా పెరుగుతోందని, దాని వెంటే మృత్యువ్ఞ చేరువవ్ఞతోందని హెచ్చరించింది. ప్రపంచం మొత్తం మీద చైనా, అమెరికా దేశాల తరువాత భారత్‌ మూడవ దేశంగా స్థానం వహించడం రాగల ప్రమాదాన్ని సూచిస్తోంది. భారతీయ మహిళల్లో కేన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధికి ప్రాణాలుకోల్పోయిన వారిసంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వ్యాధి లక్షణాలపై అవగాహన లోపించడం, ఆలస్యంగా వ్యాధి ఉనికిని గుర్తించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచంలో చైనా, అమెరికా దేశాల తరువాత భారత్‌లోనే ఈ కేసులు విశేష సంఖ్యలో ఉన్నాయి. ఈ సంఖ్య ఏటా 4.5 నుంచి ఐదు శాతం పెరుగుతోంది. ఒకనివేదిక ప్రకారం భారతదేశంలోని మహిళల్లో 0.7మిలియన్‌ మందికేన్సర్‌ పీడితులని తేలింది.

వాస్తవానికి ఇంకా ఎక్కువసంఖ్యలో ఉండవచ్చని తెలుస్తోంది.ఏటా 1మిలియన్‌ నుంచి 1.4 మిలియన్‌ మహిళా కేన్సర్‌ కేసులు గుర్తింపు లేకపోవడం లేదా రికార్డులలో నమోదుకాకపోవడం జరుగుతోంది. రొమ్ముకేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌ సోకిన మహిళల్లో మృతుల సంఖ్య 1.6 నుంచి 1.7 రెట్లు పురుషుల కన్నా ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని ప్రత్యేక కేన్సర్‌ వ్యాధుల వల్ల మృతుల సంఖ్య తీవ్రంగా ఉంటోంది. ప్రపం చంలో రొమ్ము కేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌ వల్ల మృతి చెందిన వారి జాబితాలో భారతదేశం ప్రథమస్థానంలో ఉంది. అలాగే జననేంద్రి య కేన్సర్‌ కేసుల్లో ప్రపంచంలో రెండోవస్థానం వహిస్తోంది.

2015లో వెలువడిన నివేదిక ప్రకారం రొమ్ము కేన్సర్‌ 19 శాతం, గర్భాశయం మూత్రకోశ కేన్సర్‌ 14 శాతం, జననేంద్రియ క్యాన్సర్‌ ఏడు శాతం మొత్తం 40 శాతం కేన్సర్‌ కేసులు కేరళ, తమిళనాడు, ఢిల్లీ, రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి. సాధారణ ప్రజల్లో వైద్యవృ త్తిలో ఉన్నవారిలో కూడా మహిళలకు సంబంధించిన కేన్సర్‌ వ్యాధుల విషయంలో పూర్తి అవగాహన ఉండడం లేదు. స్క్రీనింగ్‌, వంటి వ్యవస్థాపరమైన వైద్యపరీక్షల సౌకర్యం అందుబాటులో ఉన్న ప్పటికీ అవి మహిళల విషయంలో పరీక్షలు జరగడం సరిగ్గా లేవనే చెప్పవచ్చు. భారతదేశం ఆధారంగా నిర్వహించిన అధ్యయనంలో కేన్సర్‌ ప్రారంభదశలోనే స్క్రీనింగ్‌ చేయిస్తే వ్యాధిని సరిగ్గా గుర్తించవచ్చు. రొమ్ము కేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌ కేసుల్లో తొలిదశ లోనే స్క్రీనింగ్‌ చేయించి తగిన విధంగా చికిత్స చేయిస్తే వ్యాధి తీవ్రత బాగా తగ్గడానికి వీలవ్ఞతుంది. ప్రస్తుతం రోజూ కొత్తగా రెండువేల మందిమహిళా క్యాన్సర్‌ రోగులను గుర్తిస్తున్నారు.

వ్యాధి ముదిరిన దశల్లో 1200 కేసులు బయటపడుతున్నాయి. దీనివల్ల రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ రోగులకు అయిదేళ్ల జీవన ప్రమాణాలలో మూడు నుంచి ఏడు రెట్ల వరకు తగ్గుతోంది. ఆల స్యంగా వ్యాధిని కనుగొనడం కూడా వైద్య చికిత్స ఖర్చు మరింత భారం కావడానికి దారితీస్తుంది. ప్రారంభదశలో వైద్య ఖర్చు కన్నా వ్యాధి ముదిరిన దశలోవైద్య ఖర్చు 1.5నుంచి రెండు రెట్లు ఎక్కువ అవ్ఞతోంది. మరణాల సంఖ్య నుంచి ఆకస్మిక సంఘటనల నిష్పత్తి, జాతీయ కేన్సర్‌ నియంత్రణ కార్యక్రమానికి ఎంతో కీలకం. ప్రపంచ వ్యాప్తంగా పోల్చిచూస్తే భారత్‌లోని మహిళలకు కేన్సర్‌ వ్యాధుల కేసులు చాలా దురవస్థగానే చెప్పవచ్చు. ఈ కేన్సర్‌ మహమ్మారిని తక్షణం నియంత్రించడం తప్పనిసరి అని వైద్యశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో వ్యాధిని గుర్తించి నివారించడం, సమ ర్థంగా వైద్యచికిత్స చేయించడం, ఉపశమనానికి జాగ్రత్తలు తీసుకో వడం ఇవన్నీ వైద్యపరంగానే జరగాలి. మిగతా వ్యాధుల కన్నా కేన్సర్‌ వైద్యచికిత్స అత్యంత ఆర్థికభారంతో కూడుకున్నది. జనాభా లో 60 శాతం కన్నా ఎక్కువ మందికి క్యాన్సర్‌ రోగులను ఆస్పత్రి లో చేర్చి వైద్యం చేయించాలంటే వార్షిక తలసరి సరాసరి ఆదాయ పరిమితికి మించి భారం మోయవలసి వస్తుంది. దేశంలోని స్త్రీలలో లక్షమంది జనాభాలో 110మంది నుంచి 190-260 వరకు 2025 నాటికి పెరుగుతుందని అంచనాగా తెలుస్తోంది.

కేన్సర్‌కు దారితీసే అంశాలు కూడా భారతదేశంలో మరింత ఆందోళన కలి గిస్తు న్నాయి.వీటిలో స్థూలకాయం కేన్సర్‌కు దోహదపడుతోంది. 2004 నుంచి 2014 వరకు పరిశీలిస్తే దేశంలో స్థూలకాయులైన మహిళల సంఖ్య పెరిగింది. ప్రపంచంలో సరాసరి పెరుగుదల కన్నా రెండిం తలు భారతదేశంలో ఎక్కువగా ఉంటోంది. అదే విధంగా 2000 నుంచి 2014 మధ్యకాలంలో తలసరి ఆల్కహాలు వినియోగం మూడు రెట్లు పెరిగింది. సంతానం ఆలస్యం కావడం, శిశువ్ఞలకు స్తన్యపోషణ అందించే శైలి మారడం, జనాభా జీవన విధానంలో మార్పులు ఇవన్నీ వయస్సు మీరిన వారి సంఖ్య పెరగడానికి కార ణమై పరోక్షంగా క్యాన్సర్‌ వ్యాప్తికి దోహదపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏటేటా క్యాన్సర్‌ కేసుల సంఖ్య పెరుగుతోం ది.

దీంతోపాటు ఈ వ్యాధి వల్ల సగానికి సగం అంటే 50 శాతం మందికి ప్రాణహాని కూడా 50 శాతం వరకు పెరుగుతోంది. 2015లోఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి(ఐసిఎంఆర్‌) వివ రాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 48వేల మంది క్యాన్సర్‌ రోగులు వివిధరకాల క్యాన్సర్‌ వల్ల మృతి చెందారు.వీరిలో 20,235 మంది తెలంగాణకు చెందినవారు కాగా 28,082 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. రోజంతా కూర్చొని ఉండే జీవన శైలిలో ఊబకాయం కాలుష్య స్థాయిలు పెరగడం, స్మోకింగ్‌, పొగాకు ఆల్కహాలు విని యోగం ఆహారం అలవాట్లు మారడం ఇవన్నీ మరణాలకు కారణా లవ్ఞతున్నాయి.ఆస్పత్రుల ఆధారంగా లభించిన ఆధారాలను సమీ క్షించగా 2012-14లో క్యాన్సర్‌ శరీరంలో విస్తరించిన తర్వాత 17 శాతం మందిరోగులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

వ్యాధి విస్త రించిన తరువాత కాకుండా మొదట్లోనే ఆస్పత్రికి వచ్చేలా రోగుల్లో ఆ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆంకాల జిస్టు డాక్టర్లుచెబుతున్నారు. ఇందులో సమాజంతోపాటు ప్రభుత్వం కీలక పాత్ర వహించాలని సూచిస్తున్నారు. సెర్వికల్‌ క్యాన్సర్‌ ఎక్కు వ శాతం ఉంటోందని సామూహి వ్యాక్సినేషన్‌ దీనికి దోహదపడు తుందని చెప్పారు. గాయాలు కాని అల్సర్లు కానీ కంఠస్వరంలో మార్పు, దగ్గుతుంటే నెత్తురు పడడం వంటి లక్షణాలు సంక్రమింప చేస్తాయి. అసాధారణంగా రక్తం చిమ్మడం, లేదా దుర్వాసన, పుట్టు మచ్చల వంటివి ఏర్పడడం, పొత్తి కడుపు పనిలో తేడాలు, ఏనీమి యా,రొమ్ములో కణతలు, బరువ్ఞతగ్గడం, ఇవన్నీ కేన్సర్‌ లక్షణాలు. ఈ కేన్సర్‌ వ్యాధులన్నింటిలో ఛాతీక్యా న్సర్‌ అగ్రభాగాన ఉం టోంది.

ఐసిఎంఆర్‌ అంచనాల ప్రకారం భారతదేశంలో 1.73 మిలి యన్‌ క్యాన్సర్‌ కొత్త కేసులు వస్తాయని, 0.88 మిలియన్‌ క్యాన్సర్‌ సంబంధిత మరణాలు 2020 నాటికి సంభవిస్తాయని అంచనాలు. ప్రతి 8మంది పురుషుల్లో ఒకరు క్యాన్సరుకు గురవ్ఞతున్నారు. మహిళల్లో 9 మందిలో ఒకరు గురవ్ఞ తున్నారు. 2016లో 7.36 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడ్డారు.2020 నాటికి ఈ సంఖ్య 8.8 లక్షలకు చేరుకోవచ్చు. క్యాన్స ర్‌ చికిత్సకు ఇండియన్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసిటీ) శాస్త్రవేత్తలు రెండు ప్రధా న చికిత్స ప్రక్రియలను కనుగొ న్నారు. విపో-డిఎన్‌ఎ ఆధారంగా వ్యాక్సిన్‌ ఒకటి, ఈ వ్యాక్సిన్‌లో ట్యూమర్‌ను నిరోధించే లక్షణాలు ఉంటాయి. ఒకసారి ఈ వ్యాక్సిన్‌ ఇంజెక్టు చేస్తే రోగి కణాల్లోకి ప్రవే శించి టీ కణాలను ఉత్తేజపరు స్తుంది.

అవి క్యాన్సర్‌ కణాలపై దాడి చేసి నిర్మూలిస్తాయి. ఇమ్మూ నోథెరపీ, కిమోథెరపీ ఈ రెండిటినీ సమన్వయపరిచి ఉపయోగించి నట్టు డాక్టర్‌ అరబిందు చౌదరి చెప్పారు.ఇప్పటి వరకు రోగి శరీరం నుంచి డెండ్రిటిక్‌ కణాలను సేక రించి టిసెల్స్‌కు చైతన్యపరిచి వాటిని రోగిలోకి ఇంజెక్టు చేయడం జరుగుతోంది.దీన్ని ఇమ్మూనోథెరపీగా చికిత్స చేస్తున్నారు. కిమోథె రపీతో పాటు, ఇమ్యూనోథె రపీ సంయుక్తంగా ఉపయోగించడంతో క్యాన్సర్‌ వంటివి నయ మవ్ఞతాయి.జీవించే అవకాశాలు ఉన్నప్పటి కీ పాంక్రియాటిక్‌, ఊపిరి తిత్తులు, బ్రెయిన్‌ క్యాన్సర్లు నయంకావ్ఞ. 11సిటి కనుగొన్న ఇతర భారీ పరిశోధన మందులను నేరుగా క్యాన్సర్‌ మూలకణాల్లోకి పంపించి వాటిని లోలోపల నిర్మూలింప చేసే విధానం అవలంబిస్తే కొంతైనా సత్ఫలితాలు వస్తాయి.

డాక్టర్‌ బి.రామకృష్ణ (మదర్‌ థెరిస్సా సర్వీస్‌ సెంటర్‌)