కాలుష్య రక్కసి కోరల్లో ఢిల్లీ

POLLUTION
POLLUTION

కాలుష్య రక్కసి కోరల్లో ఢిల్లీ

కాలుష్యనివారణకు కేంద్ర,రాష్ట్రాల పాలకులు ఆచరణ యోగ్యంకాని విధానాలతో ప్రయోగాలు చేస్తూ సమస్యను రోజురోజుకు జటిలం చేస్తున్నారు. ఫలి తంగా పర్యావరణం విషతుల్యంగా మారుతున్నది. కోట్లాది మంది పౌరులు అనేకవ్యాధులకు లోనవ్ఞతున్నారు. ప్రభు త్వాలు,అధికారులు మారినప్పుడు ఎవరికితోచిన ఆలోచనలు వారు అమలు చేసేందుకు ప్రయత్నం చేయడం దీనికితోడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో అపహాస్యం పాలవ్ఞతున్నారు.

నిర్దిష్టవిధానం, ఉన్న చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేయకపోవడంవల్ల పర్యావరణ పరి స్థితి అంతకంతకు ఆందోళనకరంగా తయారవ్ఞతున్నది. దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టిన వాయుకాలుష్యం జనజీవ నాన్ని అస్తవ్యస్తం చేసిందని చెప్పొచ్చు. గత రెండు రోజులుగా చుట్టుముట్టిన బూడిదరంగు కాలు ష్యభూతంతో రోడ్డు ప్రమాదాలు సంభవించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లైట్లు వేసినా కానరాని విషపు పొగ మూలంగా రైళ్లు, విమానరాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఎన్నో చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పరిస్థితిని ముందుగానే అంచ నా వేసిన ప్రభుత్వం పాఠశాలలకు సెలవ్ఞ దినాలు ప్రకటించ డమేకాక కొన్ని బస్సు సర్వీసులు రద్దు చేయడం, మరికొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేశారు.

కాలుష్యపు విషపు పొర కారణంగా ఎక్కడ ఏమి ఉందో తెలుసుకోలేని పరిస్థితిలో రోడ్డుపై నిలబడి ఉన్న ప్రజలపైకి ఒక టిప్పర్‌ దూసుకువెళ్లిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా,మరో తొమ్మిదిమంది వరకు గాయపడ్డారు. బుధవారం నాటి అత్యవసర పరిస్థితిని తన కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సమీక్షించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కార్బన్‌ మోనాక్సైడ్‌,సల్ఫర్‌ డయాక్సైడ్‌ తదితర సమ్మిళితమై ఢిల్లీలో గాలిని విషపూరితం చేశాయని కేంద్ర కాలుష్యనియంత్రణ బోర్డువెల్లడించింది. ఏకంగా కాలుష్యం స్థాయి బుధవారంఐదువందలకు పెరగడం ప్రమాదపరిస్థితికి అద్దంపట్టిందని సిపిసి పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ వాయుకాలుష్యం అంతకంతకు పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం నగరాల్లోని సగానికి పైగా నివసిస్తున్నది. అది రానురాను ఊహించని రీతిలో పెరుగుతున్నది. భారతదేశంలో పట్టణీకరణ వేగం పెరిగిపోతున్నది. నగరాలు అదుపు ఆజ్ఞాలేకుండా విస్తరిస్తు న్నాయి. 2001లో పట్టణప్రాంత జనాభా దాదాపు ఇరవై తొమ్మిది కోట్లుకాగా ఇప్పుడు నలభై కోట్లకుపైగా చేరుకున్నది. పల్లెలు నుంచి పెద్దస్థాయిలో వలసలు వస్తూ పట్టణాలు, నగర ప్రాంతాలపై ఒత్తిడి పెంచుతున్నాయి.

దీంతో గృహ నిర్మాణం,పారిశ్రామీకరణ,వాహనాల విషయంలోఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా విస్తరిస్తుండటంతో సమస్య తీవ్రరూపం దాలుస్తున్నది. ఈ విస్తరణలో భాగంగా చెట్లను నరికివేస్తుం డటంతో వాతావరణం విషకలుషితమై స్వచ్ఛమైన గాలి,నీరు అందకుండాపోతున్నాయి. దేశంలోని ఆరు మెట్రోనగరాలు ఢిల్లీ,బెంగళూరు,హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబాయి, చెన్నై, తదితర నగరాల్లో గతంలో నిర్వహించిన సర్వేలో వాయు కాలుష్యం అదుపు తప్పిపోతుందనే విషయాన్ని గుర్తించారు. ముఖ్యంగా దట్టంగా అలముకున్న వాయుకాలుష్యం నగర జీవి ఊపిరితిత్తులకు తూట్లు పొడుస్తుందని ఆ సర్వే హెచ్చ రించింది.

చెన్నై,ఢిల్లీ కోల్‌కత్తాలో వాయుకాలుష్యం అప్పటికే తారాస్థాయిలో ఉన్నట్లు బయటపడింది.తర్వాత పారిశ్రామిక కాలుష్యం కూడా దీనికితోడవ్ఞతున్నది. హైదరాబాద్‌లో నిర్మాణరంగంవల్ల పీల్చేగాలిలో ధూళికణా లు అధికంగా చేరుతున్నట్లు కూడా గుర్తించారు. అన్నిటికంటే ముఖ్యంగా వాహన కాలుష్యం హైదరాబాద్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు కూడా ఆనాడే గుర్తించారు. వాయుకాలుష్యం విష యంలో చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల కంటే కూడా భారత్‌లోఅధికంగాఉంది.

భారతదేశంలో వాతావర ణంలో ధూళికణాలు ఉండాల్సిన స్థాయికన్నా మూడు నుంచి ఐదురెట్లు అధికంగా ఉండి శ్వాస సమస్యల నుంచి క్యాన్సర్‌ దాకా అనేకరోగాలకు కారణమవ్ఞతున్నాయి.వాయుకాలుష్యం ప్రభావం ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలపై తీవ్రంగా చూపు తున్నది. ఏటా ఆరు లక్షలకుపైగా అకాల మరణాలకు దారితీ స్తున్నట్లు వైద్యనిపుణులే చెప్తున్నారు. వాయుకాలుష్యం వల్ల మనిషికే కాదు దేశ సుసంపన్న చరిత్ర, సంస్కృతులకు ప్రతీకలుగా బాసిల్లుతున్న వారసత్వకట్టడాలకు కూడా ముంపు ముంచుకొస్తున్నది. వాయుకాలుష్యం ఇలా విస్తరించ డంపట్ల పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళనవ్యక్తం చేస్తున్నా రు. ప్రపంచంలో తొంభై శాతం పైగా ప్రజలు పీలుస్తున్న గాలి నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాయుకాలుష్య నివేదిక స్పష్టీకరిం చింది. అంతేకాదు గాలిలోని ధూళికణాల కారణంగా మనిషి శరీరంలోని కీలక అవయవాలైన ఊపిరితిత్తులు గుండె, మెదడు,తదితర వాటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనల్లో వెలడైంది. ఏకంగా ఏటా ముఫ్పై లక్షల మరణాలు నమోదవ్ఞతున్నట్లు కూడా ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.

అనారోగ్య కారణాలతో చనిపోతున్నవారిలో వాయుకాలుష్యం కారణంతో ఎనిమిదోవంతు మరణిస్తున్నా రనేది నివేదికలు స్పస్టం చేస్తున్నాయి. నేల,రహదారులపై నుంచి లేచే ధూళి, పరిశ్రమల పొగ,వివిధరకాల బూడిద, లోహపదార్థాలు నైట్రోజన్‌ డయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, అమోనియా, కార్బన్‌మోనాక్సైడ్‌ వంటి రసాయనాలు నిర్దే శిత మార్గదర్శకాల కంటే ప్రమాద కరంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థే గుర్తించింది.

వాయు కాలుష్యం మరణాల్లో దాదాపు తొంభై శాతం లేదా మధ్యాదాయ దేశాల్లోనే సంభవి స్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలపైనే వదిలిపెట్టకుండా స్వచ్ఛందసంస్థలనుంచి సామాన్యుల వరకు అందరూ కాలుష్య నియంత్రణలో భాగస్వాములు కావాలి. అలాగే పరిశ్రమలు కాలుష్యం వెదజల్లకుండా ఆధునిక సాం కేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాయుకాలుష్యానికి మూలకారణాలైన వాహనాల విషయం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌