కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?

Contract Lectures
Contract Lectures (File)

కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నవారందరినీ రెగ్యు లర్‌ చేస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించారు. దీనితో రాష్ట్రం లో వివిధ ప్రభుత్వ శాఖలలో నేరుగా నియామకాల ద్వారా పనిచే స్తున్న వారు సంబరపడ్డారు. రెండున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరినీ పర్మినెంట్‌ చేయకపోగా, రెగ్యులర్‌ చేయాలని ఆందోళనల బాటపట్టిన వారిని తీవ్రంగా ఆడిచివేస్తున్నా రు. కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మె మీద ప్రభుత్వం కక్ష గట్టింది.

వారు చేసిన పాపమేమిటి?చట్టబద్ధంగా సమ్మె చేయటమే వారి నేరమైంది. సమ్మెను బేషరతుగా విరమించాలంటున్నారు. చర్చలు జరిపే అవకా శమే లేదని మంత్రి తెగేసి చెప్పారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలకు అవకాశం లేదనటమే ఆశ్చర్యకరం. రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కాలేజీలలో కాంట్రాక్టు, విధానంలో పనిచేస్తున్న లెక్చరర్లు వారి అసోసియేషన్లుగా ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రులకు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్‌ చేయా లని 2016 ఫిబ్రవరి 7న మంత్రివర్గంలో తీర్మానం చేసింది. అందు లో భాగంగనే 2016 ఫిబ్రవరి 26న జి.వో.నెం.16ను విడుదల చేశారు. దీని ప్రకారం అర్హతలు రూపొందించింది.ఇక క్రమబద్ధ్దీకరణ ప్రక్రియను ప్రారంభించాలి. రాష్ట్రంలో3678కు పైగా పనిచేస్తున్న వారు రెగ్యులర్‌ అవ్ఞతామని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో అన్ని డిగ్రీ జూయనిర్‌ కాలేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్స్‌ నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమ్మె చట్టవిరుద్ధమని అప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది.దీనివల్ల కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మె సమస్య మరింత జటిలమవ్ఞతుంది. కాంట్రాక్టు లెక్చరర్లు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెండున్నర ఏళ్లలో అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించారు.అయినా పరిష్కారంలేదు. ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.

వారి మొర పట్టించుకోవడానికి ప్రభుత్వానికి తీరిక లేకుండాపోతుంది. ఇక గత్యంతరం లేక తమ హక్కుల సాధన కోసం దశల వారిగా ఉద్యమం చేపట్టారు. అయినా ప్రభుత్వం చెవికెక్కించుకోక పోవడం మూలంగా చివరి అస్త్రంగా సమ్మెలోకి దిగారు. కాంట్రాక్టు లెక్చరర్లు అనేక ఏళ్లుగా వెట్టిచాకిరి చేస్తూ ప్రభుత్వ సహకారం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వాలు అన్ని అర్హతలున్నవారిని ఇంటర్వ్యూలకు పిలిచి జి.ఓ.నెం 142,143ల ద్వారా కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించారు. అప్పటి నుండి చాలీచాలని వేతనాలతో 4,5 నెలలకొకసారి జీతాలు తీసుకుంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంఖ్యను ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నా రు. ప్రభుత్వం ఇచ్చే అతి తక్కువ వేతనాలు సరిపోక అప్పులతో కుటుంబాలను పోషిస్తున్నా దుస్థితి నెలకొంది.కాంట్రాక్టు లెక్చరర్‌ ఏ సంఘానికి అనుబంధం లేకుండా జాయింటు యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి, విద్యామంత్రికి మెమోరాండాలిచ్చి చివరికి ప్రజాస్వామ్యపద్ధతిలో చట్ట ప్రకారం సమ్మెనోటీసు ఇచ్చారు. కనీసం సమ్మె నోటీసు ఇచ్చిన వారితో ప్రభుత్వం చర్చలకు పిలు వకుండా, చర్చించకుండా ఏకపక్షంగా జి.ఓ.నెం.14ప్రకారం కాంట్రా క్టు లెక్చరర్స్‌ జీతాలు 50 శాతం పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ప్రభుత్వం రెగ్యులర్‌ చేస్తామనే లోగా ఇచ్చిన హామీని అమలు చేయాలని పెేరివిజన్‌తోపాటు 10వ పిఆర్‌సి ప్రకారం వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలో పూర్తిస్థాయి బోధనా సిబ్బందిలేని పరిస్థితి తీవ్ర సమస్య అయితే మౌలిక సౌకర్యాల కొరత కూడా మరొకపెద్ద సమస్యగా ఉంది. రాష్ట్రంలో 404 జూనియర్‌ కళాశాలలో సగానికిపైగా సొంత భవనాలు లేవ్ఞ. కొన్ని ఉన్నత పాఠశాలలో షిప్టు విధానంలో నడుస్తున్నాయి. కాలేజీలకు భూములు లేని పరిస్థితులు ఉన్నాయి. చాలా కాలేజీలకు ప్రహారి గోడలు లేవ్ఞ. కనీస నీటి వసతులు, టాయి లేట్లు, లేక మరీ దారుణ పరిస్థితి ఉంది. ఈ సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. సమస్యలు పరిష్కరిం చండి అని ప్రజాస్వామ్య పద్ధతిలో కోరుతుంటే వారి సమస్యలు పరిష్కరించకుండా కనీసం చర్చలకు పిలువకుండా సమ్మె వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆనటం బాధ్యాతారాహిత్యమే. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.

ఉజ్జిని రత్నాకర్‌రావు
(రచయిత: ప్రధాన కార్యదర్శి, ఎఐటియుసి తెలంగాణ రాష్ట్రసమితి)