‘కళాబంధు’ వినూత్న సాహసం

వార్తల్లోని వ్యక్తి

TSR
TSR with Chiraneevi

‘కళాబంధు’ వినూత్న సాహసం

కళాబంధు సుబ్బరామిరెడ్డికి భావోద్వేగంహెచ్చు. ఆయన బిరుదే ‘కళాబంధు ఆయన ఆది నుంచి కళాప్రియుడు, కళా పోషకుడు.తెలుగు సాహిత్య, సాంస్కృతిక, భాషా, సినీరంగాలకు ఆయనతో దీటుగా సేవ చేసినవారు ఇప్పటివారిలో ఎవ్వరూ కనిపించరు. ఆయన రాజకీయరంగంలో ప్రవేశించకపోలేదు. లోక్‌సభకు, రాజ్య సభకు కాంగ్రెసు సభ్యుడుగా ఎన్నికైనారు. రాజకీయరంగంలో వున్నా, సినిమా భాషే. కళారంగానికి ఆయన చాలా ‘ఖరీదైన సేవలు చేశారు. వట్టిమాటలు చెప్పేవారేకాని, కళారంగానికి గట్టి మేలు చేసేవారు కొందరే. ఆ కొందరిలో ‘కళాబంధు అగ్రగణ్యుడ నడం నిస్సందేహం. మొన్న మెగాస్టార్‌ చిరంజీవి తొమ్మిదేళ్ల తరు వాత హీరోగా, ద్విపాత్రాభినయం చేసిన ‘ ఖైదీనెంబర్‌ 150 చిత్రం ప్రీ రిలీజ్‌ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా ‘యాటం బాంబు వంటి వార్తను పేల్లారు.

మెగాస్టార్‌ ‘స్ఫూర్తితో ఆ కు టుంబంలో ఏడుగురు నటులు, హీరోలు రూపొందారని, వారందరి తో కలిసి, తాను ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సుబ్బారామిరెడ్డి ప్రకటించే సరికి ఆ ఆపార అభిమాన సందోహంచేసిన హర్ష ధ్వానాలతో సభాప్రాంగణం దద్దరిల్లింది.నిజమే, ఒకే సినీకుటుంబం నుంచి ముగ్గురు, నలుగురు నటులు, హీరోలు వచ్చిన ఉదంతాలు ఆరుదుగా వున్నప్పటికీ, మెగాస్టార్‌ కుటుంబంనుంచి అధిక సంఖ్య లోనే నటులు అవిర్భవించారు.చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ‘మనం చిత్రంలో అయితే, నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య,అఖిల్‌ నటించారు. మెగస్టార్‌, ఆయన ప్రభావంతో, స్ఫూర్తి తో నటులైనవారితో సినిమా తీయడమంటే,అది పెద్దవార్తే. అయితే, ‘ఖైదీ నెంబర్‌ 150 హంగామాలో పడి ఆవార్త ప్రస్తుతానికి పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ‘కళాబంధుకు చిరంజీవితో సినిమా కొత్త విశేషమేవిూకాదు ‘స్టేట్‌ రౌడీ తీసింది ఆయనే. సాధారణంగా ఎవ్వ రూ చేయని కార్యక్రమాలు జయప్రదంగా చేయడం సుబ్బరామి రెడ్డికి సరదా! కృష్ణ భగవానుడు అర్జునునికి ‘భగవద్గీతను బోధిం చింది సంస్కృతంలోనే. ఆది దేవ భాష. అందువల్ల, ‘భగవద్గీతను సంస్కృత భాషలో నిర్మించి, ఆ చిత్రానికి సుబ్బరామిరెడ్డి జాతీయ అవార్డు స్వీకరించారు. అలాగే సంస్కృతంలో ‘ఆదిశంకరాచార్య హిందీలో ‘స్వామి వివేకానంద ‘చాంధిని దిల్‌వాల్‌ ‘లాంహే నిర్మించి, ప్రశంసలుపొందారు. ఇంకా తెలుగులో ‘జీవనపోరా టం గాంగ్‌ మాస్టర్‌ ‘సూర్య ఐపిఎస్‌ చిత్రాలు నిర్మించారు.

ఇక, నిర్మాణ రంగంలో కూడా ఆయన పట్టిందల్లా బంగారమే. తొలుత జగత్ప్ర సిద్దమైన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం రంగంలో మట్టిపనులకు కంట్రాక్టర్‌గా జీవి తం ప్రారంభించారు. ఈ పని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయన ప్రధాని ఇందిరాగాంధీ ప్రశంస లు, స్వర్ణపతకం పొందారు. 1967లో దీనితో ప్రజాజీవితం వైపు మళ్లీ, కాంగ్రెసులో చేరి, కాంగ్రెసు అధిష్టానవర్గంలో పేరు ప్రతిష్టలు సాధించారు.ఏ రంగం చేపట్టినా,ఆయన విజయమే సాధించారు. హైదరాబాద్‌లో అత్యంత ఆధునికమైన సినీ థియేటర్‌లను నిర్మించారు. తన పేరిట ప్రముఖ కళాకారులకు ప్రతిసంవత్సరం అవార్డులిస్తారు. 1993లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను ‘కళాసామ్రాట్‌ బిరుదుతోను, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ 1989లో ‘కళారత్న బిరుదు తోను సత్కరించారు. ఆయన కళాసేవకు ప్రశంసా సూచకంగా మంగుళూర్‌ యూనివర్శిటీ గౌవర డాక్టరేట్‌తో సత్కరించింది. ఇన్ని రంగాలలో ఎనలేని సేవలందించిన ఆయనకు సన్మానాలు, బిరుదులకేమి తక్కువ?2004లో తిరుమల తిరుపతి దేవస్ధానానికి ఛైర్మన్‌. 2006-8మధ్య కేంద్ర ప్రభుత్వంలో గనులశాఖ సహాయ మంత్రి.ఏరంగంలో వున్నా నిరాడంబరత్వం,నిబద్ధత, క్రమశిక్షణ ఆయన ప్రత్యేకతలు.ఎవ్వరినీ పరుషంగా ఒక్కమాట అనరు. ‘కళా బంధు వయస్సు 73సంవత్సరాలు.

డాక్టర్‌ తుర్లపాటి కుటుంబరావు
(”పద్మశ్రీ అవార్డు గ్రహీత)