ఉగ్రవాద ప్రోద్బలంతో కాశ్మీర్‌ యువత పెడదారి

Kashmir Youth
Kashmir Youth (File)

ఉగ్రవాద ప్రోద్బలంతో కాశ్మీర్‌ యువత పెడదారి

వేర్పాటువాదశక్తుల విచ్ఛిన్నకర బీభత్సాలతో కకావి కలమవ్ఞతున్న కాశ్మీర్‌లో నేడు యువత భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. ఈ రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. వేర్పాటు వాదులతోపాటు అనేక ప్రాంతాల్లో అల్లరి మూకలు ఎన్నికలను అడ్డుకోడానికి భద్రతా బలగాలను కూడా లెక్క చేయలేదు. 100 పోలీస్‌ స్టేషన్లను ఆక్రమించుకోడానికి ప్రయత్నిం చడంతో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు వేర్పాటువాదు లు మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. మృతులంతా 15 నుంచి 20 ఏళ్లలోపువారే. అంటే యువత ఏ విధంగా విధ్వంస కాండకు పాల్పడుతుందో ఊహించవచ్చు. ఉగ్రవాది బుర్హాన్‌వాసి ఎన్‌ కౌంటర్‌ను నిరసిస్తూ అధికార పిడిపి పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేయడంతో శ్రీనగర్‌లో ఈ ఉప ఎన్నిక జరిగింది.

ఏది జరిగినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత తిరుగుబాటు చేస్తూ ఆందోళనలకు దిగుతోంది.వేర్పాటువాదుల, పాక్‌ పాలకుల అండదం డలతోనే యువత అవాంఛనీయ దుర్ఘటనలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుద్యోగులు, ఎలాంటి ఉపాధి లేనివారు. దక్షిణాసియాలో ఉగ్రవాదానికి పురిటిగడ్డ పాకిస్థాన్‌. ఆదేశ ఉగ్రవాద ఆలోచన ధోరణే ఆసియాలో శాంతికి ప్రధాన అడ్డంకి. అభివృద్ధి కంటే విధ్వంసాన్నే అది కోరుకుంటోంది అని మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో జరిగిన ఒక కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని ఎదు ర్కొవడంలో రెండుదేశాలూ సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాయి. భారత్‌లో సరిహద్దు వెంబడి శాంతి రక్షణల కోసం అన్ని చర్యలు తీసుకుంటామని, ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహిం చేది లేదని హసీనా స్పష్టం చేశారు. ఉపాధి వనరులైన హస్తకళలు దెబ్బతిన్నాయి. ఉగ్రవాద దాడులు కారణంగా పర్యాటక రంగం దిగజారింది. గతంలో రోజుకు 15వేల మంది పర్యాటకులు వచ్చే వారు.

కానీ ఈనాడు ఆ సంఖ్య వందలకు పడిపోయింది. ఇప్పుడు రోజుకు 250కు మించి రావడం లేదు. భూతల స్వర్గంగా చరిత్రలో స్థానం సంపాదించుకున్న కాశ్మీర్‌లో నేడు పర్యాటక యాత్రికులే రావడం అరుదుగా మారడంతో జనజీవనం నిర్జీవమవ్ఞతోంది. ఈ రాష్ట్రాన్ని ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం 2014లో రూ. 80వేల కోట్ల ప్యాకేజిని ప్రకటించింది. 2006 నుంచి 2016 వరకు ప్రత్యేక హోదా కింద లక్షా ఆరువేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సా యంగా లభించినా యువతకు కాని అక్కడ వివిధ వర్గాల ప్రజలకు కానీ ఎలాంటి అభివృద్ధి అందలేదు. ఆ నిధులు ఏమయ్యాయో ఎందుకు ఖర్చు చేశారో తెలీదు. యువతకు ఉపాధి మార్గాలు చూ పిండచంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోక తప్పదు. 2004లో యుపిఎ ప్రభుత్వం 24వేల కోట్లు ఖర్చుకాగల పునర్నిర్మాణ పథకా న్ని ప్రకటించింది. 11 సెకార్టలో67వరకు ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ వాటిలో ఇప్పటి వరకు పదే పూర్తికావడం గమనార్హం. హిందూ ముస్లిం సామరస్యానికి ఆధారంగా కొనసాగుతున్న కాశ్మీరీ సంస్కృతి విస్తృతం కావడానికి ఉగ్రవాదం, వేర్పాటు వాదుల విధ్వంసకాండలే కారణం. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు ఊతం ఇస్తోంది.

ఉగ్రవాది బుర్హాన్‌ వాసి గత ఏడాది హతమారిన దగ్గర నుంచి ఘర్షణలు జరగడం పరిపాటి అయింది. 84 మంది పౌరులు ఒరిగిపోగా 12వేలమంది క్షతగాత్రులు అయ్యారు ఉగ్రవాద మూకల ప్రోద్భలంతో యువతరం పెడదారి పడుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం లో 14750 మంది పౌరులు, 6284 మంది భద్రతా దళాలు, 23,167 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధమే కాశ్మీర్‌ను రక్తసిక్తం చేస్తోంది. బుర్హాన్‌ వాసి వంటి శక్తుల ప్రభావం జనాన్ని హింసాత్మక సంఘటనలకు పురిగొల్పుతోంది. ఏ చిన్న సంఘటన జరిగినా మూకుమ్మడిగా ఆందోళనకారులు వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నారు. చావ్ఞకు కూడా వీరు భయపడడం లేదు. యువజనంలో ఈ ఆగ్రహావేశాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ ఉగ్రవాదమా? పర్యాటకమా ఏది కావాలో తేల్చుకోమని పిలుపునిచ్చారు.

జమ్మూ- శ్రీనగర్‌ జాతీయ రహదరిపై ఆసియా లోనే అతి పొడవైన సొరంగమార్గాన్ని ప్రారంభించిన సందర్భంగా మోడీ యువతరాన్ని ఉద్దేశిస్తూ ప్రసగించారు. యువత తన ఆగ్రహావేశాలను చల్లార్చుకుని భవిష్యత్‌ వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఉద్బోధించారు. దుష్టశక్తులు కొన్ని యువతను అల్లరమూకగా మార్చి రాళ్లు రువ్విస్తుంటే అదేయువత అయిదున్నరేళ్లు కష్టపడి చరిత్రాత్మక ప్రాజెక్టు పూర్తి చేశారని మోడీ విశ్లేషించారు. మౌలిక సదుపాయాలు విస్తరించి ప్రగతికి బాటలు వేస్తున్నట్టు ఇదే సంకల్పంతో మరో తొమ్మిది ప్రాజెక్టులను చేపడతా మని పేర్కొన్నారు. సొరంగ మార్గనిర్మాణంలో ఆ రాష్ట్ర యువజన శ్రమశక్తి వాటా 94 శాతం వరకు ఉంది. అయినా యువతలో నిరాశానిస్పృహలు తొలగించడానికి కార్యాచరణ పథకాలు ఏవి చేపట్టాలో కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

వచ్చే రెండేళ్లలో ఏడువేల కోట్ల విలువయిన ప్రాజెక్టులు ప్రారంభమవ్ఞతాయని కేంద్రం హామీ ఇస్తున్నా జనంలో స్పందన కనిపించడం లేదు. అడుగంటిన సంప్రదాయ ఉపాధి మార్గాలను కేంద్రం పునరుద్ధరించడానికి పూనుకొనడమేకాదు మానవత్వం, ప్రజాస్వామ్యం, హిందూముస్లిం సామరస్యం, ఈ మూడు అంశాల ఆధారంగా యువతను చైతన్యవంతులను చేయడానికి కేంద్రం చొరవ తీసుకోవాలి. అలాగే వేర్పాటు వాదుల కుట్రలను భగ్నం చేసే వ్యూహాలను సిద్ధం చేయాలి. ముఖ్యంగా యువతకు ఉపాధిని విస్తృతం చేస్తేనే కానీ అక్కడి సమస్యలు పరిష్కారం కావు.

కనుకుల యాదగిరి రెడ్డి