ఆస్పత్రుల్లో బాక్టీరియా మాలిన్యాల క’హానీ

Bacteria
Bacteria in Hospitals

ఆస్పత్రుల్లో బాక్టీరియా మాలిన్యాల క’హానీ

నగర ఆస్పత్రులు రోగులకు వైద్యచికిత్స అందించ డమేకాదు కొన్నిబాక్టీరియా మాలిన్యాలను, అంటు వ్యాధులను కూడా సంక్రమింప చేయడానికి దోహద పడుతున్నాయి. ఎక్కడయితే రోగులకు వైద్యవసతు లు, స్వస్థత చేకూరగల దని భావిస్తున్నామో అక్కడే హానికరమైన బ్యాక్టీరియా రోగులకు వ్యాప్తి చెంచడం శోచనీయం.

ముఖ్యంగా ఆస్పత్రుల్లోని ఆపరేషన్‌థియేటర్లు,ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్లు, లేబర్‌ రూమ్స్‌ బ్యాక్టీరియామాలిన్యాలకు ఆధారాలుగా ఉంటున్నాయి. స్టెఫిలోకాకై, నురోమోనాల్‌, బాసి ల్లస్‌, మైక్రోకాకై, ఎంటకోబాక్టర్‌, ఇ.కోలి, క్లెబెలెర్లా, సిట్రోబ్యాక్టర్‌, వంటి హానికరమైన బ్యాక్టీరియా సూక్ష్మజీవ్ఞలు దేనికదే ఒంటరిగా విస్తరిస్తున్నాయని పరిశోధక బృందం వెల్లడించింది.పిడియాట్రిక్స్‌, నియోనాటల్‌, సర్జికల్‌, మెడి కల్‌ కేటగిరిలు,లేబర్‌ రూములు ఈ పర్నాజీవ్ఞలకు స్థావరాలవ్ఞతు న్నాయి.వీటిస్థాయి కూడా హెచ్చుగా ఉంటోంది.ఆపరేషన్‌ థియేట ర్లు ఎక్కువగా బాసిల్లన్‌ అనే బాక్టీరియా తెగలకు స్థావరమవ్ఞతుం డగా, ఐసియుఎన్‌ యూనిట్లు క్లెబె సిల్లా, నురుమోనాన్‌, వంటి వాటికి నెలవ్ఞగా ఉంటున్నాయి. ఈ బాక్టీరియా తెగలు యాంటి బయోటిక్స్‌ను ఎదిరించే మొండి బ్యాక్టీరియా(సూపర్‌బగ్స్‌)గా పరిణమిస్తున్నాయి. పరిశీలక బృందం ఆస్పత్రుల నేల, గోడలు, రోగుల పక్కలు ఊయెళ్లు, ట్రాలీలు, వెంటిలేటర్లు రక్తపోటును పరీక్షించే పరికరాలు నాడిని గుర్తించే పల్స్‌ ఆక్సిమీటరు, ఆపరేషన్‌ థియేటర్‌ టేబిళ్లు, రైట్లు, ఇతర పరికరాల నుంచి నమూనాలను సేకరించారు.
ఈ నమూనాలన్నీ వివిధస్థాయిల్లో మాలిన్యాల తీవ్రతను వెల్లడించా యి. బాక్టీరియా తోపాటు ఫంగస్‌ కూడా ఈ నమూనాల్లో బయట పడింది. గైన కాలజీ ఆపరేషన్‌ థియేటర్లు మాత్రం బ్యాక్టీరియా తీవ్ర తను తక్కువ స్థాయిలో చూపించగా, ఆర్థోపెడిక్స్‌ మైనర్‌ ఆపరేషన్‌ థియేటర్లలో ఎక్కువస్థాయిలో మాలిన్యాల తీవ్రతను వెల్లడించాయి. దంత వైద్య ఆపరేషన్‌ థియేటర్లు కూడా మాలిన్యంగా ఉన్నాయి. పరిశీలక బృందం వేర్వేరుగా బ్యాక్టీరియా తెగలను 43 నమూనా ల నుంచి గుర్తించగలిగింది. సాధారణమైన పరాన్నజీవ్ఞలు 75 శాతం బాసిల్లన్‌ తెగలుగా, మైక్రోకాకస్‌ 54శాతంగా ఉన్నట్టు గుర్తిం చారు. ఎక్కువస్థాయిలో సూక్ష్మజీవ్ఞల మాలిన్యాలున్నవి ఎప్పటిక ప్పుడు పర్యవే క్షించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఈ మేరకు ముందుగానే వీటి వ్యాప్తిని అరికట్టడానికి వీలవ్ఞతుంది. శక్తివంతమ మైన పరాన్న జీవ్ఞలు నెలకొన్న ఆపరేషన్‌ థియేటర్లు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు రోగులకు ప్రమాదభరితమవ్ఞతాయి.ఆపరేషన్‌ థియే టర్లలో ఫ్యూమి గేషన్‌ తక్కువ క్రిమిసంహారక రసాయనాలతో శుభ్ర పర్చడంతోపాటు సిబ్బంది శ్రద్ధతో స్వయంగా పరిశుభ్రపరచడం ఎంతయినాఅవసరం.ఆస్పత్రుల్లో రోగులకు అడ్మి షన్‌ అయిన 48 గంటల్లో లేదా అంతకన్నా ఎక్కువ వ్యవధిలో లేదా డిశ్చార్జి అయిన తరువాత 30 రోజులలో ఆస్పత్రులకు సం బంధించిన బాక్టీరియా మాలిన్యాలు కనిపిస్తాయి. అమెరికా వ్యాధి నియం త్రణ కేంద్రాలు, 1.7మిలియన్‌ ఆస్పత్రికి సంబంధించి అంటువ్యా ధులు
,అన్నిరకాల బ్యాక్టీరియా విస్తరిస్తాయి.వీటిఫలితంగా ఏటా 99 వేల మరణాలు సంభవిస్తున్నాయి.ఐరోపాలో గ్రామ్‌-నెగిటివ్‌ బ్యాక్టీ రియా అంటువ్యాధులు విస్తరిస్తున్నాయి.దీంతో 25వేల కేసు ల్లో రెండింట మూడొంతుల మరణాలు ఏటా సంభవిస్తున్నాయి. కోళ్లలో మందులకు లొంగని మొండి బ్యాక్టీరియా పౌల్ట్రీఫారాల్లోని కోళ్లమాంసం మాంస ప్రియులకు ఎంత అభిరుచిని కలిగిస్తుందో అంతకు రెట్టిపు ప్రమాదాన్ని కోరి తెస్తుంద ని పరిశోధకుల వల్ల బయటపడింది. భాగ్యనగరంలోని పౌల్ట్రీ ఫారాల్లో మందులకు ఏమాత్రం లొంగని బాక్టీరియా ‘హెలిక్‌బాక్టెర్‌ పులోరమ్‌ బ్రాయిలర్‌ దేశవాళీ కోళ్లలో బయటపడింది. ఇది ఏ మందులకు లొంగనిదే కాకుండా కాన్సర్‌ వ్యాధి కారకమని తేలింది. పౌల్ట్రీ కోళ్లలో లివర్‌, పేగుల్లో సాధారణంగా ఈ బాక్టీరియా కని పిస్తుంది. ఈ కోళ్లను వండుకుని వినియోగిస్తే జీర్ణాశయ వ్యాధులు మనుషులకు సంక్రమిస్తామని హైదరాబాద్‌ పరిశోధకులు నవంబరు 4న తమ పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారు. భారతదేశంలో హెచ్‌.పులోరమ్‌ ఒంటరి బ్యాక్టీరియా విస్తరణ ఫలితాలను వివరించే మొదటి నివేదిక ఇదే. ఇది క్యాన్సర్‌ కారక విషపూరిత మూలకాన్ని ఉత్పత్తి చేస్తుందని వెల్లడయింది. ఈ విషపూరిత కారకం డిఎన్‌ఎను పాడుచేస్తుంది. కణవలయంలోకి చొరబడుతుంది.

బ్యాక్టీరియా కాలేయానికి ఎప్పుడైతే సోకిందో ఆ అవయంలో క్యాన్సర్‌ ప్రమా దాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఇంతవరకు ఈ బాక్టీరియాకు సంబంధించి తెలియని జన్యు సంబంధాలను బ్రాయిలర్‌ కోళ్ల నుంచి వేరు చేయడమైందని అన్నారు. ఇందులో సూక్ష్మజీవిని ఎది రించే జన్యువ్ఞలు ఆరింటిని గుర్తించామని చెప్పారు. బ్రాయిలర్లలో యాంటి బయోటిక్స్‌ వాడకం ఇలా ఉండగా, కోళ్ల దాణా కూడా హెచ్‌పుల్లోరమ్‌లా యాంటి బయోటిక్స్‌ను ఎదిరించే మొండిగా తయారు అయినట్లు బయటపడింది. 182 వైరస్‌ జన్యువ్ఞలు ఈ బ్యాకీరియాను రోగకరంగా చేస్తు న్నాయి. హెచ్‌.పుల్లోరమ్‌ బ్యాక్టీరియాను కోడిమాంసం నమూనాల నుంచి ఒంటరిగా వేరు చేసి పరిశోధకులు పరిశీలించారు. ఇది నాలుగు రకాల యాంటిబయోటిక్స్‌ (అవి క్లోరోక్వెణలోన్స్‌, సిఫల్‌ స్టోరిక్స్‌, నల్థొణమెయ్రిన్‌, మైక్రోలైడ్స్‌)ను ప్రతిఘటించేదిగా పరి శోధకులు కనుగొన్నారు. హెచ్‌.పుల్లోరమ్‌ అన్న జూనోటిక్‌ బ్యాక్టీరి యా అంటే ఇది జంతువ్ఞల నుంచి మనుషులకు విస్తరిస్తుంది. ఈ విధంగాపౌల్ట్రీ కోళ్లనుంచి ఎక్కువగా విస్తరిస్తున్నది హెచ్‌.పుల్లోరమ్‌ విషవాహక బాక్టీరియా.ఇది కణచక్రంలోకి చొరబడి డిఎన్‌ఎకు నష్టం కలిగిస్తుంది.ఫలితంగా క్యాన్సర్‌కు దారితీయవచ్చు.బహుళ ఔషధా ల ప్రతికూల బాక్టీరియా బ్రాయిలర్‌ కోళ్లలో కనిపిస్తోంది. విచక్షణ రహితంగా మనుషులకుకానీ,జంతువ్ఞలకు కానీ యాంటిబయోటిక్స్‌ ను ఇష్టం వచ్చినట్లు వినియోగించడం నగరాల్లో అపరిశుభ్ర పరి స్థితులు ఈ బ్యాక్టీరియా విస్తరణకు దోహదం చేస్తున్నాయి.

పెట్ల వెంకటేశం