ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలి

orderly system
orderly system


రాజ్యాలు అంతరించినా రాజులు పోయినా ఆ అవశేషాలు ఎంతో కొంత ఏదో ఒక రూపంలో నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అంతకంతకు పెరిగిపోతున్న విఐపి సంస్కృతి అటు సాధారణ ప్రజలతోపాటు ఇటు అధికారవర్గాలను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అయితే ఈ సంస్కృతిని కొంతవరకైనా నియంత్రించేది కేంద్ర ప్రభుత్వం. రెండుమూడేళ్ల క్రితం నుంచే కొన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా ఏ స్థాయి వ్యక్తి వాహనంపైనా విఐపి సంస్కృతిని ప్రదర్శిం చే బుగ్గలను వాహనాలపై పెట్టరాదని నిర్ణయం తీసు కున్నది. అత్యవసర సేవలు అందించే అంబులెన్సు, అగ్నిమాపక వాహనాలు లాంటి వాటికి మాత్రమే నీలి దీపాన్ని వాడేందుకు మినహాయింపు ఇచ్చారు. ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు వ్యక్తులు వాడే వాహనాలపౖౖె ఈ బుగ్గలను ఏర్పరచడానికి వీలులేదని, సైరన్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు అప్పటి కేంద్ర,రోడ్డు రవాణా రహదా రుల శాఖామంత్రి ప్రకటించారు.

వాహనాలపై ప్రత్యేక దీపాలను ఎప్పుడో తొలగించాల్సి ఉందని కూడా ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరిగి మొన్న సార్వ త్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ విఐపి సంస్కృ తిని పారద్రోలేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడిం చారు. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, మరి కొందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ దీపాలను తొలగించారు. బుగ్గకార్లేకాదు ఈ విఐపిసంస్కృతికి అద్దం పడుతూ ఉన్న వెట్టిచాకిరి, ఆర్డర్లీవ్యవస్థ కూడా భారత్‌ లాంటి ప్రజాస్వామ్యదేశంలో ఉండటం దురదృష్టకరం. ప్రధానంగా పోలీసుశాఖలో దశాబ్దాలపాటు సాగుతున్న ఈ వెట్టిచాకిరిని అంతమొందించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగినా అది ఏదోఒక రూపంలో కొన సాగుతూనే ఉన్నది. ఆర్డర్లీ వ్యవస్థ అన్నా, మరో పేరుతో పిలిచినాబ్రిటిష్‌కాలం నుండి ఉన్న ఈ దుస్సంప్రదా యాన్ని పారద్రోలలేకపోతున్నారు.

గతంలో ఈ విషయం ఎన్నోసార్లు పాలకుల దృష్టికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. 1979 ఆనాటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఈ వ్యవస్థను రద్దు చేస్తూ సెప్టెంబరు 19వ తేదీన జివో 612 ద్వారా ఉత్త ర్వులు జారీచేశారు. ప్రత్యామ్నాయంగా ఆర్డర్లీ వ్యవస్థను ఉపయోగించుకుం టున్న అధికా రులకు కాంపెన్సేంటరీ అలవెన్స్‌కింద కొంత డబ్బును చెల్లించే ఏర్పాటు చేశారు. అయితే ఒకటి రెండు నెలలు తాత్కాలికంగా ఈ వ్యవస్థ ఆగిపోయినా తర్వాత యధావిధిగా కొనసాగించారు. అటు ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేంటరీ అలవెన్సు తీసుకుంటూనే మరొకపక్క ఆర్డర్లీని నియమించుకోవడంతో అటు డబ్బుపోతున్నది, ఇటు ఆ వ్యవస్థను నియంత్రించలేక పోవడంతో 1988లో అక్టోబరు 31న కాంపెన్సేంటరీ అలవెన్సు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అల వెన్సురద్దు కావడంతో వారిని నియమించుకు నేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టయింది.దీంతో ఈ వ్యవస్థవల్ల ప్రధా నంగా హోం గార్డులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని మరొకసారి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించి రద్దుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా ఎన్నిసార్లు పాలకులు పదేపదే ప్రకటించినా, అధికారులు హెచ్చరించి నా ఆర్డర్లీవ్యవస్థ మాత్రం దూరం కాలేదు. అప్పుడప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు తాము తీవ్ర ఇక్కట్లకు గురవ్ఞతున్నామని కొందరు ఆర్డర్లీగా పనిచేస్తున్న వారు తమగోడు వెల్లబోసుకున్నప్పుడు విచారణ చేసి పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి చర్యలు తీసుకోబోతున్నట్లు నటించి ఆ తర్వాత మరిచిపోతున్నారు. హోంగార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో సానుభూతితో ఉంది.

హోంగార్డులకు దేశంలో ఎక్కడలేనివిధంగా జీతభత్యాలు పెంచారు. తాజాగా మొన్న సోమవారం హోంగార్డుల ప్రమాద బీమాను ఏకంగా ముప్ఫై లక్షలకు పెంచారు. ఇతర సౌకర్యాల విషయంలో కూడా ప్రభు త్వం ఎంతో ఉదారంగా వ్యవ హరిస్తుంది. కానీ ఆర్డర్లీ వ్యవస్థ నియంత్రించడంలో దృష్టి సారించలేకపోతున్నా రు. గతంలో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రావడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. ప్రస్తుతం నిరుద్యోగ రక్కసి ప్రబలి జీవనాధారంలేక మరో దిక్కులేక ఇదే పదివేలు అను కుంటూ హోంగార్డుల ఉద్యోగాలకు డిగ్రీ, పోస్టుగ్రాడ్యు యేట్‌ చివరకు ఇంజినీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన నిరుద్యోగులు కూడా క్యూలు కడుతున్నారు. అటు వంటి వారితో ఇంటిపనులు చేయించడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలి. కొందరు కానిస్టే బుల్స్‌ఆర్డర్లీగా మగ్గిపోతున్నారు. కూర గాయలు తేవడం, పిల్లలను ఆడించడం, కుక్కలకు స్నానాలు చేయించి పాలు అన్నం పెట్టడం, ఇంటిపని, వంటపని సమస్తం చేయిస్తున్నారు.

శాంతిభద్రతలు కాపాడాల్సిన చేతులతో ఇలాంటి పనులు చేయించడం దురదృష్టకరం. ఇక భద్రత కోసం ఇచ్చిన సిబ్బందిని కూడా కొందరు నేతలు వ్యక్తిగత పనులకు వాడుకోవడం స్టేటస్‌సింబల్‌గా మారిపోయింది. రక్షణకోసం పెట్టిన ఈ కానిస్టేబుల్స్‌ఏళ్లతరబడి ఒకటే చోట ఉండటం తుపాకి వాడే విధానాలను మరిచిపోయి అటెండర్లుగానే వ్యవహరి స్తున్నారు. మొత్తంమీద ప్రభుత్వమే జీతభత్యాలు ఇస్తూ ఆర్డర్లీ పేరుతోనో, రక్షణ పేరుతోనో వ్యక్తిగత పనులు చేయించడం రానురాను పెరిగిపోతున్నది. ఆర్డర్లీ అనే పేరు అన్నిశాఖల్లో లేకపోయినా దీన్ని ఏ రూపంలో ఉన్నా కూకటివేళ్లతో పెకిలివేయాలి. వారూ ప్రభుత్వ ఉద్యోగులు, సాటి మానవ్ఞలన్న విషయాన్ని ఎప్పుడూ విస్మరించరాదు.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌