ఆదివాసులకు అనాదిగా అన్యాయమే

                  ఆదివాసులకు అనాదిగా అన్యాయమే

TRIBES
TRIBES

గిరిజన సంక్షేమం అభ్యున్నతే ధ్యేయం గా పనిచేస్తున్నామని దేశవ్యాప్తంగా వేలాది కోట్లు వెచ్చిస్తున్నామని ఒకపక్క నేత లు గొప్పలు చెప్పుకుంటున్నా మరొక పక్క కనీస సదుపాయాలు లేక అర్థాకలితో అల్లాడుతున్న లక్షలాది మంది గిరిపుత్రుల బాధలు వర్ణనాతీతం. వైద్యసదుపా యాల మాట అటుంచి కడుపునిండా తిండిలేక పౌష్టికా హారం లోపించి ఎందరో గిరిపుత్రులు వివిధ రకాల రోగాలబారిన పడి మంచాలకే పరిమితమై కృంగి, కృశించిపోతున్నారనే వార్తలు ఆవేదన కాదు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాదు వీరిలో కొందరు అంధులుగా మారుతున్నారనే వార్త ప్రజాస్వామ్యవాదుల హృదయా లను పిండేస్తుంది. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన మన్యం బాలలు రేచీకటి, గ్లోకోమా, కాటరాక్ట్‌, విటమిన్‌ లోపంతో అంధులుగా మారుతున్నారు. సర్వేంద్రియాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవి. అవే మూసుకుపోయి అంధులుగా మారితే ఆ వ్యక్తితో పాటు కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.అవిద్య, అజ్ఞానం, మూఢత్వం, దారిద్య్రం, ప్రకృతితోపాటు తోటి మానవ్ఞడి దోపిడీలతో గిరిజన తండాలు అతలాకుతలం అవ్ఞతున్నాయి.

గిరిజనులకు ప్రత్యేక ప్యాకేజీలు అంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న కోట్లాది నిధుల్లో ఐదోవంతు కూడా వారి దరిచేరడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయినా బ్రిటిష్‌ హయాంనాటి కష్టాలను ఆదివాసులు నేటికీ అనుభవి స్తున్నారు. వారిని ఆదుకోవడానికి ఎన్ని చట్టాలు చేసినా అవి కాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి. గిరిజనుల సమ స్యల పరిష్కారం కోసమంటూ పాలకులు వేస్తున్న కమి టీలు, నివేదికలు సమర్పిస్తున్నా వాటి ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకువచ్చి వారి కష్టాలను తీర్చేవారు కర వయ్యారని చెప్పొచ్చు. ప్రత్యేక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటిడిఎ) ఏర్పాటు చేసిన ఆశించిన ప్రయోజ నాలు చేకూరడం లేదు. ఇప్పటికీ వేలాది గిరిజన గ్రామా లకు కనీస దారి సౌకర్యం లేదు. నడవడానికి కూడా సరైన బాటలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఎర్ర బస్సు ఎక్కినవారే కాదు కనీసం ఈనాటి వరకు ఎర్ర బస్సు చూడనివారు ఉన్నారంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వేదికలు ఎక్కి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఓట్ల కోసం పాకులాడుతున్నారే తప్ప నేతల్లో చిత్తశుద్ధి కన్పిం చడం లేదు. వైద్యం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశా రనే చెప్పొచ్చు.

ఎండాకాలం పోయి వర్షాకాలం ఆరంభ మయ్యే ఈ తరుణంలో పాతనీరు, కొత్తనీరు కలయిక తోపాటు వాతావరణంలో వచ్చే మార్పుల వల్లమలేరియా, డయేరియా తదితర వ్యాధులు విజృంభించడం వందలాది మంది అసువ్ఞలు బాయటం ఏటా సర్వసాధారణ మైపోయింది. వాస్తవంగా తెల్లదొరల పాలనలో ఆదివాసులు ఎలాంటికష్టాలకు గురి అయ్యారో నేటికీ కొన్ని ప్రాంతాల్లో అవే పరిస్థితులు కొనసాగుతుండటం దురదృష్టకరం. గిరిజన వ్యవహారాలను బాధ్యతగా నిర్వ హించాలన్న రాజ్యాంగ నిర్మాతల నిర్దేశాన్ని ఎక్కడా ఆచరించినట్లు కన్పించడం లేదు. మనదేశంలో తొమ్మిది రాష్ట్రాల్లోనే గిరిజన ప్రాంతాల పరిపాలనలో గవర్నర్లకు గిరిజన ఎమ్మెల్యేలతో కూడిన సలహా మండళ్లకు విచక్షణాధికారులున్నాయి. రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్డ్‌ ద్వారా లభించిన ఈ అధికారాలను ఏ గవర్నర్‌ ఉపయోగించినట్లు కన్పించదు. శాసనసభలు ఆమోదించిన చట్టాలను గవర్నర్‌ తన విచక్షణాధికారాలతో సమీక్షించి గిరిజన ప్రాంతాలకు వర్తింప చేయాలి.

పంచాయతీ రాజ్‌ షెడ్యూల్డ్‌ ఏరియా విస్తరణ పథకం(పీసా) వడ్డీ వ్యాపార నిషేధ చట్టం, అటవీ వన్యప్రాణుల సంరక్షణ చట్టం, ఎక్సైజ్‌ చట్టం, భూ బదలాయింపు నిషేధ చట్టం (1/70) అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఇలా గిరిజనుల కోసం ఉద్దేశించబడిన చట్టాల అమలు తీరును పర్యవేక్షించాల్సిన గవర్నర్ల వ్యవస్థ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నా యి. వాస్తవంగా ఈ వ్యవహారాలను ఆయా రాష్ట్రాల్లో గిరిజన సలహా మండళ్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో పరిపాలన తీరుతెన్నులు, సిఫారసులతో కూడిన నివేదికలు ఏటా రాష్ట్రపతికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు అందచేయాలి. సంక్షేమ శాఖ వాటన్నింటిని అధ్యయనం చేసి సమీక్షించి నివేదికలు గవర్నర్లకు క్రమం తప్పకుండా అందించాలి. అసలు గిరిజన సలహామండళ్లు ఏడాదికి ఒకసారైనా సమావేశం అవ్ఞతున్నాయా? అనేది అనుమానమే. ఇక హక్కుల కల్పనలో గిరిజన సంక్షేమ శాఖ, అటవీశాఖ యంత్రాం గాలు తమపై నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తున్నాయని గిరిజ నులలో ఏనాటి నుంచో అసంతృప్తి పెల్లుబుకుతుంది.

2006లో పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టానికి సంబంధించిన నిబంధనలను ఇప్పటికీ త్రికరణశుద్ధిగా అమలుకు నోచుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి రాగానే ప్రభుత్వం తనకు తానుగా ఆదివాసుల వ్యక్తిగత ఉమ్మడి అటవీ ఆధారిత హక్కులపై సర్వే జరిపి వాటిని అమలు చేస్తుందని గిరిజనులు ఎంతోగానో ఆశించారు. ఇప్పటికీ అవి అమలుకు అంతంతమాత్రమే.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనాభివృద్ధిపై వెచ్చిస్తున్న నిధులు ఏమాత్రం వారికి చేరుతున్నాయో సమగ్రమైన క్షేత్రపరిశీలన, పరిశోధన చేయించాలి. రాజకీయాలకు అతీతంగా వారి అభ్యున్నతికి త్రికరణశుద్ధిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విద్య,వైద్య వంటి కనీస సదు పాయాలు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. దీనిని విస్మరిస్తే చరిత్ర క్షమించదు.
– దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌