అమలుకాని ఆదేశాలెందుకు?

FARMERS
Indian Agriculture

అమలుకాని ఆదేశాలెందుకు?

అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శనిలా తయారైంది రైతులపాలిట పెద్దనోట్ల రద్దు.కొత్త సంవత్స రంలోనైనా ఈ సమస్యకు కొంత మేరకు పరి ష్కారం దొరుకుతుందనే రైతుల ఆశలు అడియాశలవ్ఞ తున్నాయి. రైతులు రోజురోజుకు నీరుగారిపోతున్నారు.

గత నాలుగౖెెదు సంవత్సరాలుగా తెలుగురాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు అతివృష్టి, మరికొన్ని ప్రాంతాలు అనావృష్టి తో అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ ఆల స్యంగా నైనా వర్షాలు కురిసాయి. అధికశాతం సాగునీటి వనరు లన్నీ కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌ దిగుబడులు తగ్గినా రబీలో ఆ నష్టాలను పూడ్చుకోవచ్చని రైతన్నలు రెట్టింపు ఉత్సాహంతో సాగుకు సమయాత్తంఅవ్ఞతున్న తరు ణంలో పెద్దనోట్లరద్దు పిడుగుపాటులా వారితలపై పడింది. అప్పులు ఇచ్చేసంగతి అలా ఉంచండి. తాము బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తీసుకోలేని విచిత్ర పరి స్థితులు ఎదుర్కొంటున్నారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని, వారి అభ్యున్నతే లక్ష్యమని చెప్పుకునే పాల కపెద్దలు రైతులకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా వారా నికి ఇరవైనాలుగువేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వా లని ఆదేశాల మీద ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ ఆ ఆదేశాలను కిందిస్థాయి బ్యాంకుఉద్యోగులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.అవసరంమేరకు డబ్బు సరఫరా చేయ కుండా రైతులకు వారానికి ఇరవైనాలుగువేలు ఇవ్వ మంటే ఎలా ఇవ్వగలమని బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తు న్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు ల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికీ రైతుకు రెండు మూడు వేలకంటే ఎక్కువగా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. దీంతో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్‌లో నష్టాలను చవిచూసినా తలతాకట్టుపెట్టి పంట రుణాలను చెల్లించారు. తిరిగి తీసుకొని రబీకి పెట్టుబడికి వాడుకోవాల్సిన సమయంలో ఈ పెద్దనోట్ల రద్దు వారిపట్ల శనిలా దాపురించింది.

వాస్తవంగా ఖరీఫ్‌ కు, రబీకి సంబంధించి ఎంతో ముందుగా రాత్రింబవళ్లు చర్చించి అధ్యయనం అనంతరం ప్రణాళిక తయారు చేస్తారు.ఎంత అప్పు ఇవ్వాల్సింది?ఏయే పంటలు విత్తు కోవాల్సిందో కూడా ఆ ప్రణాళికలో నిర్ధేశిస్తారు. ఇవేమి రైతులకు తెలియకపోయినా అందులో వారు భాగస్వా ములు కాకపోయినా ప్రణాళికలు తయారు చేయడం ఏటా ఒక మామూలుగా తయారైంది. ఈ రబీకి సంబం ధించి కూడా పంటరుణాలు తెలంగాణరాష్ట్రంలో ముప్ఫై వేల కోట్లు. మరో పధ్నాలుగువేల కోట్లు టర్మ్‌లోన్స్‌ ఇ వ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇది బ్యాంకు అధికారు లు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరు కలిసి రూపొందించిన ప్రణాళిక. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లో యాభైరెండువేల కోట్ల పంట రుణాలు, ఇరవై వేల కోట్లు టర్మ్‌లోన్స్‌ఇవ్వనున్నట్లు ఆ నివేదికలో రూ పొందించారు.రబీనాట్లు డిసెంబరు నాటికి పూర్తికా వాలి. మెట్ట పంటలయితే డిసెంబరు మొదటివారానికే విత్తుకుంటారు. కానీ ఈసారి ఈ నోట్ల రద్దుతో పెట్టుబడి లేక ఎరువ్ఞలు, క్రిమిసంహారక మందులు చివరకు కూలీ లకు రోజువారీ కూలిడబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో చాలా మంది రైతులు చేతులెత్తేశారు.కాడికింద పెట్టి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న పెద్ద రైతులు,వ్యాపారులు, కొందరు రైతులకు అప్పులిచ్చే వారు.

ప్రభుత్వ విధానాలతో అది తగ్గిపోయినా కొన్నిప్రాంతాల్లో కొంతమేరకు కొనసాగుతు న్నా ఈ నోట్లరద్దుతో వారుకూడా పూర్తిగా చేతులెత్తే శారు. దీంతో రైతులకు కాలు, చేయి ఆడడంలేదు. నార్లు ముదిరిపోయాయి. మెట్టపంటల్లో కలుపు తీయాల్సిన సమయంలో కూడా చాలా ప్రాంతాల్లో విత్తనాలు కూడా వేయలేకపోయారు.ఆలస్యంగానైనా కళ్లు తెరిచిన రిజర్వు బ్యాంకు అధికారవర్గం గ్రామీణ ప్రాంతాలకు నలభైశాతం నిధు లను తరలించాలని మంగళవారం ఆదేశించింది. అయితే ఆ దేశాలు అమలు అవ్ఞతాయా? అనే అనుమా నాలువ్యక్తమవ్ఞతున్నాయి.ఆదేశాలు ఇవ్వడం కిందిస్థాయి లో అమలుకు నోచుకోకపోవడం సాధారణమైపోయింది. రైతుల విషయంలో ఎన్నోఆదేశాలు కాగితాలకే పరిమిత మవ్ఞతున్నాయి.ఏపార్టీ అధికారంలోకి వచ్చినా ఏదో ఒక రూపంలో రైతులకు నష్టం జరుగుతూనే ఉంది. మొత్తం మీద అటు ప్రకృతిపెట్టే ఇబ్బందులు ఇటు తమకు సేవ చేస్తామని చెప్పుకుంటూ తోటి మానవ్ఞడు చేస్తున్న దగా తో గ్రామీణరైతాంగం అల్లాడిపోతున్నది. ఇప్పటికి చాలా మంది అధికారులకు రైతులపై సదభిప్రాయం లేదు. రైతులంటే సంపన్నులని,అన్ని వసతులతోగ్రామాల్లో హా యిగా జీవిస్తున్నారని ఒక అపోహ ఉంది. అది ఒకనాటి పరిస్థితి.నేడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏ రైతు వ్యవసాయంపై సంతృప్తిగా లేరు. ఒకనాడు వ్యవసాయం చేయడమే గౌరవ ప్రదంగా భావించేవారు. నేడు వ్యవసాయమే ఒక శాపంగా పరిణమించిందని వా పోతున్నారు. వ్యవసాయం తప్ప మరేదైనా జీవనాధారం దొరికతే చిన్న,పెద్ద తేడా లేకుండా అందరు రైతులు గ్రామాలను వదిలిపోవడానికి సిద్ధపడుతున్నారు. చివ రకు ఏ చిరుద్యోగం దొరికినా పట్టణాలకు పంపడానికి మొగ్గుచూపుతున్నారు.

ఇప్పటికైనా పాలకులు ఆలోచించా లి. ప్రధానంగా ఇప్పుడు రబీలోరైతులు ఎదుర్కొంటున్న సమస్యకు తక్షణ పరిష్కారంగా తాము ఇచ్చిన ఆదే శాలను త్రికరణశుద్ధిగా అమలుకు ప్రయత్నించాలి. అవి ఏమేరకు ఆచరణలో ఉన్నాయి? ఎంతవరకు రైతులకు అందుతున్నాయనే విషయాలను పరిశీలించి చర్యలు తీసుకున్నప్పుడే కొంతవరకైనా రైతులకు ఆశించిన మేలు జరుగుతుంది. ఈ రబీ కష్టాల నుండి తాత్కాలికంగా నైనా బయటపడతారు.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, వార్త