అభద్రతలో రైలు ప్రయాణాలు

Train Accident (FILE)
Train Accident (FILE)

అభద్రతలో రైలు ప్రయాణాలు

ఉత్తరప్రదేశ్‌లో శనివారం మరో విషాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్‌లో జరిగిన పసిపిల్లల మృత్యుఘోష మరవకముందే మరో 23 మందిని మృత్యువ్ఞ రైలుప్రమాద రూపంలో కబళించింది. ముజఫర్‌నగర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖతౌలీ వద్ద పూరి-హరిద్వార్‌ కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 23 మంది మరణించగా మరో వందమందికిపైగా క్షతగాత్రులయ్యారు. అందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఒడిశాలోని పూరి నుంచి రెండు వేల మూడువందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బయలుదేరిన ఈ ఎక్స్‌ప్రెస్‌ మరో మూడు గంటల్లో గమ్యాన్ని చేరవలసిన సమయంలో ప్రమాదానికి గురైంది. రెండు పుణ్యక్షేత్రాల మధ్య నడు స్తున్న ఈ రైలు ప్రమాదం గురించి తెలియగానే స్థాని కులతో పాటు సహాయక బృందాలు, కేంద్ర రాష్ట్ర అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. రైలు పెట్టెల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడంతో పాటు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిం చారు. సహాయక కార్యక్రమాలను తానే స్వయంగా పర్య వేక్షిస్తున్నట్లు కేంద్ర రైల్వే సహాయకమంత్రి సురేష్‌ప్రభు వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు మూడున్నర లక్షల రూపాయలు క్షతగాత్రులకు 50 వేల రూపాయలు ఎక్స్‌గ్రేషియో కేంద్రం ప్రకటించగా, ఒడిశా ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌ మృతి చెందిన వారికి ఐదు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50వేల రూపా యలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎక్స్‌గ్రేషియోతో పాటు తన మంత్రి వర్గంలోని ఇద్దరు సభ్యులను సంఘటనా ప్రదేశానికి పంపి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిం చాల్సిందిగా ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు గూర్చి దర్యాప్తు జరుపుతున్నట్లు, ఏదైనా లోపం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకటించారు. అన్నికోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

విద్రోహం ఏమైనా ఉంటే శాఖాపరమైన నిర్లక్షం తోపాటు మరేమైనా కారణాలున్నాయా? తదితర అంశాలను దర్యాప్తు జరుపుతున్నది. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా దృష్టి సారించారు. కారణాలేమైనా, కారకులెవరైనా 23 మంది అమాయ కులు బలైపోయారు. క్షతగాత్రులైన వారిలో కొందరు శాశ్వత వికలాంగులయ్యే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు అనుమానిస్తున్నాయి. రైతు ప్రమాదాలకు ఇది మొదలు కాదు, చివరాకాదు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎప్పటికప్పుడు ప్రకటనల మీద ప్రకటలను గుప్పిస్తున్నట్లు అవన్నీ కాగితాలకే పరిమిత మవ్ఞతున్నాయి. ప్రతీ ఏడాది ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.

మొన్న జనవరి 21న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కూనేరు వద్ద జగదల్‌పూర్‌-భువ నేశ్వర్‌ హీరాకుండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో ముప్ప§్‌ు తొమ్మిది మంది మృతి చెందారు. మరెందరో గాయపడ్డారు. గత ఏడాది నవంబర్‌ 20న కాన్పూర్‌ సమీపంలో ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్ప డంతో వందమందికిపైగా ప్రయాణికులు మృతిచెందారు. ఇలా ఏటా ఎక్కడో చోట ప్రమాదాలు జరగడం, అమా యకులు బలైపోవడం సర్వసాధారణమైపోయింది. 2012 నుండి 2017 వరకు జరిగిన 586 ప్రమాదాల్లో 308 కేవలం పట్టాలు తప్పడం వల్లనే జరిగినట్లు రైల్వే రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో 1634 మంది గాయపడగా, 944మంది మరణించారు.

భారత దేశంలో రైల్వేలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1853 ఏప్రిల్‌ 16న పోర్‌బందర్‌ నుంచి థానే వరకు మొట్టమొదటి రైలు పట్టాలపై నడవటం ప్రారంభించి ఆనాటి బ్రిటిష్‌ పాలకులు 53,396 కిలోమీటర్ల రైల్వేలైను నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాల తర్వాత పన్నెండు వేల కిలోమీటర్లు కూడా కొత్తలైను నిర్మించుకోలేక పోయాం. సౌకర్యాలు సంగతి అటుంచి కనీసం ప్రయా ణికులకు భద్రత కల్పించడంలో కూడా విఫలమవ్ఞ తున్నారనే ఆరోపణలకు జరుగుతున్న ప్రమాదాలు అద్దంపడుతున్నాయి.

రైల్వే భద్రతపై కకోద్కర్‌ కమిటీ చేసిన ప్రతిపాదనలు అమలు చేసి ఉంటే కొంతవరకైనా ఈ ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉండేదని రైల్వేనిపుణులే అభిప్రాయ పడుతున్నారు. రైల్వే మంత్రిత్వశాఖ అనిల్‌కకోద్కర్‌ అధ్యక్షతన ప్రమాదాల నియంత్రణకు నియమించిన కమిటీ ఎన్నో సూచనలు చేసింది. రైల్వే సేఫ్టీ అథారిటీని ఏర్పాటుచేసి లక్షకోట్లు పెట్టుబడి పెట్టి భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా చేసిన సిఫార్సులను ఇప్పటివరకు పట్టించుకోలేదు. భద్రత విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించడం లేదని కాదనలేని వాస్తవం. రానురాను దేశంలో రైలు ప్రయాణం అభద్రతకు మారుపేరుగా తయారవ్ఞతున్నదనే అపప్రద రైల్వేశాఖ మూట కట్టుకుంటుంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో అమెరికా, చైనాలాంటి దేశాలు గంటకు 300 కిలోమీటర్లు దాటే వేగంతో పయనించే బుల్లెట్‌ ట్రైన్‌లతో ముందుకు దూసుకువెళుతుంటే భారత్‌ శిథిలావస్థకు చేరిన పట్టాలు, పూర్వకాలంనాటి సిగ్న లింగ్‌ వ్యవస్థ, డొక్కుబోగీలు, బలహీనమైన వంతెనలు, కాపలాలేని లెవెల్‌క్రాసింగ్‌లు తదితర ఏన్నో లోపాలతో నత్తనడక నడుస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు ప్రయా ణికుల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌