అప్పుల కోసం రైతాంగం తిప్పలు

Farmers Waiting for Bank Loans
Farmers Waiting for Bank Loans

అప్పుల కోసం రైతాంగం తిప్పలు

ద్వేషం బలంగా ఉన్నప్పుడు విజ్ఞత లోపి స్తుందంటారు. వాస్తవాలు ఎలా ఉన్నా సరే నిజమేమిటో తమకే స్పష్టంగా తెలిసినా సరే ఏ అవకాశం దొరికినా, ప్రత్యర్థులను ఎలా అప్ర తిష్టపాలు చేయాలన్న ఆరాటమే తప్ప రాజకీయపక్షాల్లో విజ్ఞత కన్పించడంలేదు. తాము ఏమి మాట్లాడుతున్నారో ఆ పలుకులను ప్రజలుఎంతవరకు విశ్వసిస్తున్నారో పట్టిం చుకోరు.వారి ధ్యేయం,లక్ష్యం ప్రత్యర్థులను ఇరకా టంలో పెట్టి లాభపడడమే. ఇలాంటి చర్యలు, మాటలు, ప్రకట నల వల్ల ఎంతటి అపహాస్యం పాలవ్ఞతున్నారో ఎంతో అనుభవం ఉన్న పెద్దలు కూడా గమనించకపోవడం దుర దృష్టకరం. నష్టాల ఊబిలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు శాయశక్తుల కృషి చేస్తామని అధికారంలో ఉన్నవారే కాదు ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా ముక్తకంఠంతో వినిపిస్తుంటారు.

కానీ ఆచరణకు వచ్చేసరికి అవి ఎంతవరకు అమలు అవ్ఞతున్నాయి? క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏమిటి? వ్యవసాయరంగం ఇంతటి సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు ఏమిటి?తది తర అంశాలపై సమగ్రమైన నిర్దిష్టమైన పరిశీలన, పరిశో ధన లేకుండానే మాటల యుద్ధం చేస్తున్నారు. మీవల్లనే రైతాంగానికి ఈదుస్థితి దాపురించిందని, అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు నిందిస్తుంటే ఇంతకాలం మీరు ఒరగబెట్టిన కార్యక్రమాలే ఈ పరిస్థితికి మూలకారణమని అంతకు ముందు అధికారంలో ఉన్న నేతలను ప్రస్తుతం అధికార పీఠం నుండి పాలకులు ప్రతిస్పందిస్తున్నారు. వాదనలు, ప్రతివాదనలే తప్ప క్షేత్రస్థాయిలో విషయాలు పరిశీలించి సమస్యలను పరిష్కరించేవైపు అడుగులు వేయడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయరంగం ఎదుర్కొంటున్నది రుణవసతి.

సకాలంలో రుణాలు అంద డం లేదు. పంట రుణాలు రెన్యువల్‌ చేయడంలో కూడా కొన్ని బ్యాంకు యాజమాన్యాలు తీవ్రజాప్యం చేస్తున్నా యి. అప్పు పుట్టక రైతులుపడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీకావ్ఞ. మరొకపక్క పాతబకాయిలు వసూలు చేసుకు నేందుకు బ్యాంకర్లు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. అసలు అప్పుకు ఎంతో ప్రాధాన్య త ఉంది. పూర్వీకుల నుంచి కూడా గ్రామీణ రంగంలో రైతులను ఆదుకునేందుకు ఏదో ఒక వ్యవస్థ ఏదో ఒక రూపంలో కొనసాగుతూ ఉండేది. ఆ గ్రామ అవసరాలను బట్టి రైతులకు రుణసహాయం అందించేవారు. దిగజారిపో తున్న మానవ విలువలతోపాటు ఆ వ్యవస్థ కూడా కేవలం లాభాపేక్ష ధ్యేయంగా మారి అధికవడ్డీలు, అపరాధవడ్డీలు అంటూ అమాయకులను దోపిడీ చేయడం ఆరంభించింది.

రైతుల అవసరాలను ఆసరాగా తీసుకొని ‘నాగులంటూ పంటకాలానికి బస్తాకు బస్తా రెట్టింపు వసూలు చేసే విధానం కూడా చోటు చేసుకుంది. ఈ నాగు అపరాధ వడ్డీ చెల్లించలేక ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. దీన్ని నుంచే వెట్టిచాకిరి ఆవిర్భవించింది. అప్పుల బాధతో సతమతమైపోతున్న గ్రామీణపరిస్థితులు అర్థం చేసుకున్న భారత్‌లోని ఆనాటి బ్రిటిష్‌ పాలకులు 1904లో సహకార వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 1911 మార్చి పదిహేడున గుంటూరుజిల్లా స్థాయిసహకార బ్యాంకు ఆవిర్భవించింది. అయ్యదేవర కాళేశ్వరరావ్ఞ, భోగరాజుపట్టాభి సీతారామ య్య వంటివారు కలిసి విజయవాడ కోఆపరేటివ్‌ బ్యాంకు నుస్థాపించారు.

అందులో నుంచి విడిపోయిన పటాభిసీతా రామయ్య భూములను తనఖాపెట్టుకొని దీర్ఘకాల రుణా లుఇచ్చే భూ తనఖా బ్యాంకులను భారతదేశంలో మొట్ట మొదటిసారిగా కృష్ణాజిల్లా గుడ్లవెల్లూరులో 1925 అక్టో బరు 31వ తేదీన శ్రీకారం చుట్టడంతో గ్రామీణరంగంలో రుణవసతులు కల్పించడంతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1964లో సహకార చట్టం వచ్చింది. రైతుల కష్టాన్ని వడ్డీ చక్రవడ్డీరూపంలో దోచుకుంటున్న కొందరు వ్యాపారుల కు, పెత్తందారులకు అవి ఇబ్బంది కలిగించినా రైతులకు మాత్రం వరప్రసాదంగా పరిణమించింది. ముఖ్యంగా వడ్డీ వ్యాపారుస్తులకు చెందిన వ్యక్తులు డబ్బులు వసూలు చేయడంలో ఎంత కర్కశంగా వ్యవహరించేవారో ఇప్పటికీ కథలుకథలుగా చెప్పుకుంటారు.

మొత్తం మీద గ్రామీణ రంగంలో సహకార పరపతి వ్యవస్థ ప్రవేశించడంతో ఆ బాధలుపోయాయని రైతులు ఆనందించారు. అంతేకాకుం డా రుణగ్రస్తులపై అలాంటి అవమానకర ఒత్తిళ్లు తీసుకు రాకుండా ప్రభుత్వం కూడా ఆనాడు చర్యలు తీసుకుంది. కానీ ఆ తర్వాత వాణిజ్యబ్యాంకులు కూడా రైతులకు రు ణాలు అందించడంలో పోటీ పడ్డాయి. పాలకుల ఒత్తిడి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచు కొని పెద్దపెద్ద బ్యాంకులు సైతం గ్రామాలబాటపడ్డాయి. వ్యవసాయరంగానికి ఎంతో చేయూతనిచ్చాయి.కానీ ఇప్పు డు పరిస్థితి మారిపోయింది. బ్యాంకులే సంక్షోభంలో ఇరు క్కున్నాయి.

బడా వ్యాపారులు బ్యాంకులను వేలకోట్లలో ముంచుతున్నారు.ఇంకొకపక్క మొన్నటి పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి లాంటి సంస్కరణలు కూడా బ్యాంకింగ్‌ రంగంపై ప్రభావం చూపుతున్నాయి.బ్యాంకులపై విశ్వాసం సన్నగి ల్లుతున్నది. డబ్బు తీసుకుంటున్నారే తప్ప తిరిగి బ్యాంకు ల్లో జమచేయడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగా నేటికీ ఎన్నోబ్యాంకులు నో క్యాష్‌బోర్డులుపెడుతున్నాయి. ఏదో ఒక సాకుతో పంటరుణాలను సైతం రెన్యువల్‌ చేయడం లేదు. ఇటు బ్యాంకింగ్‌ వ్యవస్థ రుణాలు ఇవ్వడంలో చేతు లు ఎత్తేయడం అంతకుపూర్వం గ్రామాల్లో వ్యవస్థ కనుమ రుగు కావడంతో రైతులకు దిక్కుతోచడం లేదు.

ఒకపక్క పాలకులేమో రుణాలకు సంబంధించిన నిర్దిష్ట ప్రణాళికలు తయారు చేస్తున్నారు.బ్యాంకు అధికారులకు రుణాల విష యంలో ఆదేశాలు ఇస్తున్నారు. కానీ చాలా బ్యాంకులు ఆదేశాలను పాటించే పరిస్థితులు లేవ్ఞ. పాలకులకు ఈ వాస్తవాలు తెలిసినా నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఫలితంగా వ్యవసాయరంగం కొత్త సమస్యల్లో కూరుకు పోతుందనే ఆందోళనలు వ్యక్తమవ్ఞతున్నాయి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌