అప్పులకోసం రైతుల తిప్పలు!

Farmers were  Waiting for Bank Loans
Farmers were Waiting for Bank Loans

అప్పులకోసం రైతుల తిప్పలు!

అదునెరిగి సేద్యం చేయాలి. పదునెరిగి విత్తనం వేయాలి.ఈ సూత్రాన్ని ఆచరించాలంటే అవస రమైన వనరులు ముందుగానే సమకూర్చుకొని సర్వ సిద్ధంగా ఉండాలి. ఈవిషయం తెలియని రైతులుండరు. అందుకే వారు వ్యవసాయ సీజన్‌ ప్రారంభంతోనే వనరు లను సమకూర్చుకోవడంలో ముమ్మరం అవ్ఞతారు.ఈ వాస్తవం అటు పాలకులకు, వ్యవసాయ అధికారులకు తెలియంది కాదు. అయినా అధికార యంత్రాంగం మాత్రం సకాలంలో రైతులకు అవసరమైన రుణాలు విత్తనాలు,ఎరువ్ఞలు అందివ్వడంలో విఫలం అవ్ఞతూనే ఉంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నది.

రుణాలు ఇస్తున్నాం,అప్పులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎరు వ్ఞలు పుష్కలంగా ఉన్నాయి. విత్తనాలకు కొరత అంటూ ఉండదు అని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూనే ఉంటారు. అందుకు ఎంతో ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసామని కూడా చెప్తుంటారు. ఇందుకోసం సమా వేశాలు, సమీక్షలకు అంతే ఉండదు.ఖరీఫ్‌ సీజన్‌ మే ఇరవైఐదో తేదీన రోహిణికార్తె ప్రవేశంతో ఆరంభమవ్ఞ తుంది. అంతకంటే ముందే అంటే మార్చి, ఏప్రిల్‌ నెల లోనే ఇందుకు సంబంధించిన కసరత్తు వ్యవసాయ శాఖ అధికారులు ఆరంభిస్తారు.సమావేశాలు,సమీక్షలు, తర్జన భర్జనలు కూడికలు తీసివేతలతో లెక్కలు తయారు చేసి రాబోయే వర్షపాతాన్ని అంచనా వేసి ఖరీఫ్‌ ప్రణాళిక సిద్ధంచేస్తారు.

రుణాలకు సంబంధించి బ్యాంకర్లతో సం యుక్త సమావేశాలు పెట్టి ఎన్నివేలకోట్లరుణాలు ఇవ్వబో యేది ఎంతోముందుగానే నిర్ణయిస్తారు. ఇదంతా ఏటా జరిగే తంతే. చాలా మంది రైతులకు ఇది అర్థం కాదు. ఇదేదో అంకెలగారడీగానే కన్పిస్తుంది.ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద పెట్టుబడికి అధిక వడ్డీలను అప్పు తెచ్చి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రైవేట్‌ వ్యాపారులను కట్టడి చేశారు. ఇది మంచిదే. కానీ ఇప్పుడు పరిస్థితి అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్లుగా తయారైంది. ఖరీఫ్‌ సాగు మొదలై దాదాపు నెల దాటిపోయింది.

అయినా రైతులకు రుణాలు అందడం లేదు.దీనికి రకర కాల కారణాలు చెబుతున్నారు. నగదు కొరత ఉందని కొన్ని ప్రాంతాల్లో చెప్తుంటే ప్రభుత్వం రైతులకు మాఫీ చేసిన రుణంలో నాలుగోవిడత పూర్తిగా విడుదల కాకపోవడం, వడ్డీగురించి పట్టించుకోకపోవడంతో ఖాతా లు పెండింగ్‌లో ఉండడం వల్ల తిరిగి ఇవ్వలేకపోతున్నా మని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు.డబ్బు పూర్తిగా చెల్లిం చేవరకు తిరిగి రుణాలు ఇవ్వలేమని చాలా ప్రాంతాల్లో బ్యాంకులు స్పష్టం చేస్తుండగా అది ప్రభుత్వం చెల్లిస్తుం దని రుణాలు ఇవ్వడంలో రైతులను వేధించవద్దని పాల కులు పదేపదే చెబుతున్నారు.

అయినా బ్యాంకర్లు పట్టిం చుకునే పరిస్థితుల్లో లేరు.రిజర్వు బ్యాంకు నుంచి ఆదేశాలు వస్తే తప్ప తాము ఏమీ చేయలేమని నిబంధన లకు విరుద్ధంగా ఎలాంటి రుణాలు ఇచ్చినా తమ ఉద్యో గాలకు ముప్పు వస్తుందని వారంటున్నారు. కారణాలు ఏమైనా, కారకులు ఏవరైనారైతులకు రుణాలు అందడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. దు క్కులు చేసుకున్నారు.కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు కూడా వేశారు.ఇప్పుడు ఎరువ్ఞలకు, కూలీల వేతనాలకు డబ్బు అవసరం. పంటలమ్మి బ్యాంకులో దాచుకున్న డబ్బు ఇవ్వడానికి కూడా కొన్నిప్రాంతాల్లో బ్యాంకర్లు సహక రించడం లేదు.వారికి ఉండే కారణాలు వారికి ఉన్నాయి. నగదు లేదు. పెద్దనోట్లు రద్దు తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన నగదులో తొంభైశాతానికి పైగా రెండువేల రూపా యల నోట్లే. మరో ఐదారు శాతం ఐదువందల నోట్లు,

వంద నోట్లు దాదాపు లేవనే చెప్పొచ్చు. కూలీలకు ఇవ్వా లంటే రైతులకు చిన్న నోట్లు అవసరం. అది ఇచ్చే పరి స్థితిలో లేరు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పాత రుణాల రెెన్యువలే అంతంత మాత్రం ఉంటే అసలు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నా రు.కొన్ని చోట్ల బ్యాంకర్లకు రైతులకు వాగ్వివాదాలు జరు గుతున్నాయి.బ్యాంకర్ల పరిస్థితి ఇలాఉండడంతో అదును దాటిపోతుందన్న ఆందోళనతో రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల శరణుజొస్తున్నారు. అయితే వారు మితిమీ రిన వడ్డీ అయితేనే ఇస్తామంటూ అదికూడా వడ్డీని మిన హాయించుకొని కొన్ని ప్రాంతాల్లో రైతులకు అందిస్తున్నా రు. అటు బ్యాంకులు ఇవ్వక, ఇటు ప్రైవేట్‌ వ్యాపారుల వడ్డీలు భరించలేక రైతుల పరిస్థితి గందరగోళంగా తయారైంది.

ఇక రైతుల సంక్షేమం కోసమే రైతులతోటే ఏర్పాటు చేసిన సహకార సంఘాల పరిస్థితి అంతంత మాత్రంగా తయారైంది. ఎంతో పవిత్ర ఆశయంతో రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేసేందుకు ప్రధానంగా వడ్డీ వ్యాపారుస్తుల కబందహస్తాల నుండి రక్షించేందుకు ఏర్పాటు చేసిన సహకార వ్యవస్థను అన్ని విధాలా అన్ని రూపాల్లో నిర్వీర్యం చేశారు. రాజకీయజోక్యం పెరిగిపోవడం, నామినేషన్‌ పద్ధ తితో పాలక మండలిని నియమించడం ప్రారంభమైనప్ప టి నుండి సహకార వ్యవస్థకు ఈ దురదృష్టపు పరిస్థి తులు దాపురించాయి.

పాలకులు దాన్ని ప్రక్షాళన చేసి రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామనిఎన్ని ప్రయ త్నాలు చేస్తున్నా అవి రాజకీయ ఊబి నుండి బయట పడలేకపోతున్నాయి.ఫలితంగా రైతులకుఅటు బ్యాంకు లు, ఇటు సహకార సంఘాలు మొండిచెయ్యి చూపుతు న్నాయని చెప్పొచ్చు.ఏదిఏమైనా పాలకులు ఈ విషయం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాగితాల్లో లెక్కలు రాసి ఊహల్లో కలలు కంటే రైతుల పరిస్థితి దారుణంగా త యారవ్ఞతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రుణసహాయం రైతులకు తక్షణం అందించాల్సిన తరుణమిది.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌