అగ్రరాజ్యంలో పేట్రేగుతున్న తుపాకి సంస్కృతి!

అగ్రరాజ్యంలో పేట్రేగుతున్న తుపాకి సంస్కృతి!

అమెరికాలు కాల్పులసంస్కృతి పెరిగిపోతోంది. పిన్నవయసు యువతీయువకులు సైతం తుపాకి సంస్కృతికి అలవాటుపడటంతో అకారణంగానే చిన్న చిన్న ఘర్షణలకు బలైపోతున్నారు. ఇటీవలికాలంలో భారత్‌కు చెందిన వారే ఎక్కువగా బలవుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి ఓ నల్లజాతీయుని అహంకారానికి బలైపోయాడు.

డిపార్టుమెంటల్‌స్టోర్‌లో మేనేజర్‌గాపనిచేస్తున్న గోవర్ధన్‌ అక్కడే ఏడేళ్లుగాపనిచేస్తున్నాడు. శ్వేతజాతి అహంకారం ఓవైపు కాటేస్తుంటే నల్లజాతీయులుసైతం నేరప్రవృత్తికి అలవాటుపడి కాల్పులకు తెగబడుతున్నారు. అమెరికాలో తాజాగా ఇదే సంఘటన జరిగింది. అమెరికాలో గడచిన ఐదేళ్లలో ఇదే స్వైరవిహారంచేస్తోంది ప్రత్యేకించిభారతీయులపైనే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి.

తుపాకులను కలిగి ఉండటం అనేది ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. స్వీయరక్షణ, వేట వంటి వాటికి వినియోగించే తుపాకులు ఇపుడు పిన్నవయసు వారిలోనికి కూడా చొరబడుతున్నాయి. అమెరికాలో ఇపుడు తుపాకీరాజకీయం పెరిగిందనే చెప్పాలి. ప్రత్యేకించి మూడేళ్లనుంచి అమెరికన్లలో స్వీయపరిరక్షణ తత్వానికి పునాదులు పడినప్పటినుంచి ఇతరదేశీయులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయనే చెప్పాలి.

తుపాకి లైసెన్సులు జారీచేసేవిధానం అమెరికాలో సరళీకృతంగా మారడమే ఇందుకు కారణం అని కూడా చెప్పాలి. అనేకమంది పౌరులవద్దకు కూడా తుపాకులు సులువుగా వస్తున్నాయి. అమెరికాలో ఉన్న జనాభాను బట్టిచూస్తుంటే ప్రతి వందమందికి 120.5 మారణాయుధాలు ఉన్నాయని అంచనా. అదే యెమెన్‌దేశంలో అయితే ప్రతి వందమంది ప్రజలకు 52.8శాతం మారణాయుధాలున్నట్లు అంచనా.

మానసిక స్థితి సక్రమంగాలేకపోవడం, చిన్నపాటి ఘర్షణకే అత్యంత ఆవేశపరులుగా మారడం కొందరు నేరప్రవృత్తినే ఎంచుకుని కాల్పులకు తగబడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా మూకుమ్మడి కాల్పులకుసైతం తెగబడుతున్నారు. రైపిళ్లు, తుపాకులు, షాట్‌గన్‌లు వంటి వాటిని ఎక్కువ వినియోగిస్తున్నారు.

2017లో లాస్‌వెగాస్‌షైఊటింగ్‌జరిగి 58మందికిపైగా చనిపోయారు. ఓర్లాండోలోని నైట్‌క్లబ్‌ కాల్పుల్లో 49 మంది చనిపోయారు. అలాగే శాండిహూక్‌ ఎలిమెంటరీస్కూలులో కూడా కాల్పులుజరిగి 27మందికిపైగా చనిపోయారు. సూదర్లాండ్‌స్ప్రింగ్స్‌ చర్చిలోజరిగిన కాల్పుల్లో 2017లో 26 మందికిపైగా చనిపోయారు. ఇవన్నీ సెమీ ఆటోమేటిక్‌ తుపాకులతోనే కాల్పులు జరిపారు. థౌజండ్‌ఓక్స్‌ షూటింగ్‌లో కూడా 12 మంది చనిపోయారు.

శాంతాఫే హైస్కూలులో జరిగిన కాల్పుల్లో 10మంది చనిపోయి 14 మంది తీవ్రగాయాలు పాలయ్యారు. ఎక్కువశాతం 2017లో లాస్‌వెగాస్‌షూటింగ్‌లోనే 851మందికిపైగా తీవ్రగాయాలపాలయితే 58 మంది చనిపోయారు. అప్పట్లో ఇదే అతిపెద్ద సంఘటనగా నమోదయింది. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎలా మారుతున్నారు. అమెరికన్ల సంస్కృతి ఇలా ఎప్పుడూ లేదే?

వలసవాదుల రాజ్యంగా ఉన్న అమెరికాలోనే ఉపాధిరక్షణ,భద్రత కొరవడుతున్నదన్న భయాందోళనలతోనే అక్కడికొందరు హింసావాదంవైపు మళ్లుతున్నారని తెలుస్తోంది. ప్రత్యేకించి గడచిన మూడేళ్లలో ఈ సంస్కృతి మరింతగాపెరిగింది. ఇతర దేశాలకు చెందిన వారు అమెరికాలోస్థిరపడటంవల్లనే తమకు జీవనోపాధి కొరవడుతున్నదన్న భావన ఎక్కువ కలుగుతోంది.

ఇందుకు ప్రతిగా ఈ విద్వేషాన్ని తగ్గించేందుకు భారతీయ ఐటికంపెనీలు,మరికొన్ని బహుళజాతి కంపెనీలు అమెరికాదేశీయులనే ఎక్కువ నియామకాలుచేస్తున్నప్పటికీ ఈ విషసంస్కృతిని కట్టడిచేయలేకపోతున్నారు. 1984నుంచి 2018వరకూ చూస్తే సుమారు రెండువేలమందికిపైగా మృతిచెందినట్లు దర్యాప్తు సంస్థల గణాంకాలే చెపుతున్నాయి. అన్నెంపున్నెం ఎరుగని అమాయకులు బలైపోతున్నారు.

ఉపాధికోసం అగ్రరాజ్యానికి వెళ్లి ఎంతోకొంత వెనకేసుకుని స్వస్థలంలో స్థిరపడాలనుకుంటున్నవారికి ఈ కాల్పుల సంస్కృతి మృత్యుఘంటికలను మోగిస్తోంది. వాస్తవానికి నల్లజాతీయులు అధికంగా ఉండేప్రాంతాల్లో తుపాకీ సంస్కృతి ఎక్కువే. తరచూ డిపార్టుమెంటల్‌స్టోర్లలోనికి ప్రవేశించి అక్కడికక్కడే కాల్పులుజరిపి అందినమేరకు దోచుకునిపోవడం జరుగుతోంది. ఇలాంటి సంఘటనలే అగ్రరాజ్యంలో ఎక్కువగా ఉన్నాయి.

మరికొందరు వలసల విద్వేషంతో రగిలిపోతూ కాల్పులకు తెగబడుతున్నారు. గతంలో న్యూజిలాండ్‌ఆస్ట్రేలియాల్లో జరిగిన ఈ సంఘటనలు ఇపుడు అమెరికాలోనే ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. గడచిన మూడేళ్లుగా ఈ విష సంస్కృతి మరింత పేట్రేగిపోతున్నది. వలసవాదుల కారణంగానే అమెరికన్లకు ఉపాధి తగ్గిపోతున్నదన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ పరిరక్షణ విధానాలు మరింతపెరిగి హెచ్‌వన్‌బి వీసాలజారీనిసైతం కఠినతరంచేసాయి.

చివరకు ప్రతిభా నైపుణ్యాలు లేవన్న భావన పెరుగుతుండటంతో శ్వేతసౌధం అధిపతులు దిగిరాకతప్పలేదు. కేవలం వలస వివక్షలపై జరిగేవి కొన్ని కాల్పులయితే మానసికప్రవృత్తి మారి, విచ్చల విడిజీవితాలకు అలవాటుపడి మరికొందరు కాల్పులకు తెగబడుతున్నారనే చెప్పాలి. అన్నెంపున్నెం ఎరుగని స్కూలు విద్యార్ధులు కూడా తుపాకీలు తెచ్చుకుని కాల్పులు జరుపుతున్నారనంటే అమెరికాలో ఈ విషసంస్కృతిని కట్టడిచేసేందుకు అవసరమైతే అమెరికా చట్టాలను సవరించాలి.

కఠిన శిక్షలు పడుతుండాలి. ప్రత్యేకించి విదేశీయులకు రక్షణ కల్పించాలి. వారి భద్రతకు పూర్తి భరోసా కల్పించేవిధంగా అమెరికన్‌ పాలకులు చొరవచూపిస్తే తప్ప ఈ విషసంస్కృతికి అడ్డుకట్ట వేయలేమన్నది నిస్పందేహంగా చెప్పవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే ధోరణికంటే ఈ విచ్చలవిడిధోరణిని ఆదిలోనే కట్టడిచేయకుంటే భవిష్యత్‌ తరాలు సైతం ఈ విచిత్ర మానసిక ప్రవృత్తికి అలవాటుపడిపోతారని శ్వేతసౌధం పాలకులు గుర్తించాలి.

ఠిన శిక్షలు పడుతుండాలి. ప్రత్యేకించి విదేశీయులకు రక్షణ కల్పించాలి. వారి భద్రతకు పూర్తి భరోసా కల్పించేవిధంగా అమెరికన్‌ పాలకులు చొరవచూపిస్తే తప్ప ఈ విషసంస్కృతికి అడ్డుకట్ట వేయలేమన్నది నిస్పందేహంగా చెప్పవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే ధోరణికంటే ఈ విచ్చలవిడిధోరణిని ఆదిలోనే కట్టడిచేయకుంటే భవిష్యత్‌ తరాలు సైతం ఈ విచిత్ర మానసిక ప్రవృత్తికి అలవాటుపడిపోతారని శ్వేతసౌధం పాలకులు గుర్తించాలి.

  • దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌