ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసిన ఈడీ

టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయం సహా సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను జప్తు చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లుగా ఈడీ వెల్లడించింది.

రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు నమోదైన కేసులో ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో రూ.73.74కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు కింద బ్యాంకు నుంచి రుణం తీసుకొని రూ.361.29 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ కేసు నమోదు చేసింది.