చందాకొచ్చర్‌, వేణుగోపాల్‌ ఇళ్లల్లో ఈడి సోదాలు

venugopal dhoot, chanda kocchar
venugopal dhoot, chanda kocchar


ముంబై: ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ సిఈఓ చందాకొచ్చర్‌, వీడియోకాన్‌ ఎండి వేణుగోపాల్‌ సంబంధించిన ఇళ్లను, కార్యాలయాలను ఈడి అధికారులు శుక్రవారం నాడు సోదాలు నిర్వహించారు. వీడియాకాన్‌ రుణాలకు సంబంధించిన కేసులో సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఐదు కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఈడి అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వేణుగోపాల్‌లపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. 2012లో వీడియాకాన్‌ గ్రూప్‌నకు రూ. 3250 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసేందుకు క్విడ్‌ప్రోకో ప్రాతిపదికన సహాయం చేసినట్లు చందాకొచ్చర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సిబిఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు. రుణాల మంజూరుకు ప్రతిగా దీపక్‌ కొచ్చర్‌కు చెందిన కంపెనీల్లో వీడియోకాన్‌ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.