గుప్తా బిల్డ‌ర్స్ అండ్ ప్ర‌మోట‌ర్స్ సంస్థ‌పై ఈడీ సోదాలు

న్యూఢిల్లీ: గుప్తా బిల్డ‌ర్స్ అండ్ ప్ర‌మోట‌ర్స్ సంస్థ‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌(ఈడీ) సోదాలు నిర్వ‌హించింది. చండీఘ‌డ్‌, అంబాలా, పంచ‌కుల‌, మొహాలీ, ఢిల్లీలో ఉన్న గుప్తా బిల్డ‌ర్స్ ఆఫీసుల్లో సుమారు 19 చోట్ల త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆ సంస్థ డైర‌క్ట‌ర్లను ఈడీ విచారిస్తోంది. ఈ సోదాల్లో భారీ స్థాయిలో డాక్యుమెంట్ల‌ను, సుమారు 85 ల‌క్ష‌ల న‌గ‌దు, ఆడి కూ7 కారును స్వాధీనం చేసుకున్నారు. శుక్ర‌వారం ఈ సోదాలు జ‌రిగినట్లు తెలిపారు. గుప్తా బిల్డ‌ర్స్ డైరెక్ట‌ర్లు స‌తీశ్ గుప్తా, ప్ర‌దీప్ గుప్తా, బాజ్వా డెవ‌ల‌ప‌ర్స్‌, కుమార్ బిల్డ‌ర్స్‌, విన్‌మెహ‌తా ఫిల్మ్స్, డైరెక్ట‌ర్లు జార్నెల్ సింగ్ బాజ్వా, న‌వ‌రాజ్ మిట్ట‌ల్‌, విశాల్ గార్గ్‌ల‌తో పాటు ఇత‌రుల ఇండ్ల‌ల్లో సోదాలు జ‌రిగాయి.


గుప్తా బిల్డ‌ర్స్‌పై చంఢీఘ‌డ్‌లో మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు అయ్యింది. సుమారు 325 కోట్ల మేర మోసం జ‌రిగిన‌ట్లు ఈడీ గుర్తించింది. ఇండ్లు కొనుగోలు చేసేవారిని, ఇన్వెస్ట‌ర్ల‌ను మోసం చేశార‌ని, వారికి ఇస్తాన‌న్న ఫ్లాట్లు, ప్లాట్లు, క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాల‌ను ఇవ్వ‌లేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇండ్లు కొనుగోలుదారుల నుంచి సేక‌రించిన సొమ్మును ఇత‌ర కంపెనీల‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన‌ట్లు ఈడీ గుర్తించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/