కవిత ఈడీ విచారణ పూర్తి..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత..రెండో రోజు ఈడీ విచారణ పూర్తి అయ్యింది. ఈ నెల 11 న మొదటిసారి ఈడీ ఎదుట హాజరుకాగా..దాదాపు 9 గంటలపాటు విచారించారు. నేడు మరోసారి హాజరు కాగా..దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు కవితను ప్రశ్నించారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పది గంటల సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు రావటం జరిగింది.

విచారణ సమయంలోనే కవిత తరపున ముగ్గురు లాయర్లు ఈడీ ఆఫీసులోకి వెళ్లటం.. ఆ తర్వాత ఇద్దరు వైద్య సిబ్బంది ఆఫీసులోకి వెళ్లి రావటం.. అందులో ఓ మహిళా వైద్యురాలు ఉండటంతో కవిత ను అరెస్ట్ చేస్తారా అని అంత భయపడ్డారు. కానీ రాత్రి తొమ్మిది గంటల 15 నిమిషాల సమయంలో ఈడీ విచారణ ముగించుకుని బయటకు కవిత రావడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. బయటకు రాగానే వెంటనే తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఈ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించిన అధికారులు, ఆ తర్వాత ఆమెను విడిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.