నేషనల్ హెరాల్డ్ కేసు: టీపీసీసీ నేతలకు ఈడీ నోటీసులు

ఈ నెల 10న ఢిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశం

directorate of enforcement
directorate of enforcement

హైదరాబాద్ః నేషనల్ హెరాల్డ్ కేసులో టీపీసీసీకి చెందిన ఐదుగురు కీలక నేతలను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసులు జారీ అయిన వారిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 10న ఢిల్లీలోని తమ కార్యాలయంలో జరగనున్న విచారణకు హాజరు కావాలని వీరిని ఈడీ అధికారులు కోరారు. ఈడీ నోటీసుల విషయంపై స్పందించిన షబ్బీర్ అలీ… తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. ఒకవేళ నోటీసులు వస్తే విచారణకు హాజరు అవుతానని కూడా ఆయన చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/