డ్రగ్స్ కేసు : 10 గంటల పాటు పూరీని విచారించిన ఈడీ అధికారులు

డ్రగ్స్ కేసు విచారణ లో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ ను మంగళవారం హైదరాబాద్ లో ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 10 గంటల పాటు పూరి ని విచారించి పలు సమాదానాలు రాబట్టారు. ముఖ్యంగా ‘‘ఆఫ్రికా దేశాలకు నగదు ఎందుకు పంపారు!? ఆఫ్రికన్ల బ్యాంకు ఖాతాల్లోకి నగదు పంపడానికి కారణమేమిటి? మీ బ్యాంకు ఖాతాల్లో ఈ అనుమానాస్పద లావాదేవీలేంటి!?’’ అని ప్రశ్నించగా..అవి సినిమాలకు సంబంధించి జరిగినట్లు పూరి చెప్పగా..ఆ సినిమాలు ఏంటి అని అధికారులు అడిగారని..వాటికీ త్వరలో సమాధానం చెపుతానని పూరి చెప్పినట్లు తెలుస్తుంది.

మంగళవారం ఉదయం 10.15 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్‌ చేరుకున్నారు. ఆయన వెంట కుమారుడు ఆకాశ్‌ పూరి, చార్టెడ్‌ అకౌంటెంట్‌ శ్రీధర్‌ ఉన్నారు. ఉదయం మొదలైన విచారణ రాత్రి 8 గంటలకు వరకు జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు అరగంటపాటు భోజన విరామం ఇచ్చింది. రాత్రి 8.15 గంటలకు పూరీని ఇంటికి పంపేసింది. ఇక గురువారం నటి ఛార్మిని విచారించనుంది. పూరి ని విచారించే సమయంలో బండ్ల గణేష్ ఈడీ ఆఫీస్ వద్దకు రావడం తో అందరు షాక్ అయ్యారు. ఈయన కు కూడా నోటీసులు అందాయా అనే కోణంలో ఆయన్ను మీడియా వారు ప్రశ్నించగా..‘‘నేను పూరీ జగన్నాథ్‌ కోసం వచ్చా. నాకెవరూ నోటీసులు ఇవ్వలేదు’’ అని గణేష్ చెప్పుకొచ్చారు.