డ్రగ్స్ కేసు : నవదీప్ ను 9 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు

డ్రగ్స్ కొనుగోళ్లు… మనీ లాండరింగ్ కేసుల నేపథ్యంలో సోమవారం నటుడు నవదీప్ ను ఏకంగా 9 గంటలపాటు విచారింది. నవదీప్ తో పాటు ఎఫ్ క్ల‌బ్ మేనేజ‌ర్‌ను ఇద్దరినీ కలిపి అధికారులు విచారించారు. గతంలో కెల్విన్ తరచూ ఎఫ్ క్లబ్​కు వెళ్తుండేవాడని ఆధారాలు సేకరించిన అధికారులు అతనితో ఏమైనా లావాదేవీలు జరిగాయా అని తెలుసుకునేందుకు బ్యాంకు ఖాతాలకు పరిశీలించారు.

ఎఫ్ క్లబ్ బ్యాంకు ఖాతాలు, యూపీఐ లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. పలు అనుమానాలస్పద లావాదేవీలపై ఆరా తీశారు. అవసరమైతే ఈ వ్యవహారంలో మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇక ఈ విచారణలో చాలా ప్ర‌శ్న‌ల‌కు న‌వ‌దీప్ స‌మాధానం దాట‌వేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు, ఆయ‌న చెప్పిన స‌మాధానాలకు ఎఫ్ క్ల‌బ్ మేనేజ‌ర్ చెప్పిన స‌మాధానాల‌కు పొంతన లేక‌పోవ‌డంతో ఈడీ అధికారులు ఇద్ద‌రినీ ఒకే రూమ్‌లో ఉంచి ప్ర‌శ్నించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈడీ విచారణ విషయానికి వస్తే..ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పూరి జగన్నాథ్‌, చార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రానా, నందు, రవితేజను విచారించారు. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.