ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జిషీటు

‘ఓటుకు నోటు’ కేసు.. కీలక పరిణామం

MP Revanth Reddy
MP Revanth Reddy

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ విరామం అనంతరం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ, చంద్రబాబు పాత్రను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారనేది రేవంత్ రెడ్డి, తదితరులపై ప్రధాన అభియోగం. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వజూపారంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది. అప్పట్లోఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/