జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్‌ గోయల్‌పై ఈడీ కేసు నమోదు

ed-books-former-jet-airways-boss-goyal-money-laundering-raids
ed-books-former-jet-airways-boss-goyal-money-laundering-raids

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌తో పాటు ఆయన భార్య అనితపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. ముంబయి పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద క్రిమినల్‌ కేసే నమోదైందని ఈడీ అధికారులు తెలిపారు. బుధవారం ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, విచారణ చేపట్టామని, దాడులు కొనసాగుతున్నాయని అధికారులు గురువారం మీడయాకు తెలిపారు. జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ గత ఏడాదిలో ఆగస్టులో గోయల్‌, అతని కుటుంబం, ఇతరులపై విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై దాడుల నిర్వహించింది. ఇదే కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో గోయల్‌ను విచారించింది. గోయల్‌ 19 ప్రైవేటు కంపెనీలు ఉన్నాయని, వీటిలో ఐదు విదేశాల్లో ఉన్నాయని ఈడీ గతంలో ఆరోపించింది. అమ్మకం, పంపిణీ, నిర్వహణ ఖర్చులు ముసుగులో ఈ సంస్థలు అనుమానాస్పద లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలను ఈడీ పరిశీలిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/