ఇటలీలో ప్రారంభమైన ఆర్థిక కార్యకలాపాలు

44 లక్షల మంది రోడ్లపైకి

lockdown-eases-in-italy-44-lakh-people

ఇటలీ: ఇటలీవాసులు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలపాటు ఇళ్లలోనే ఉన్నారు. అయితే వారు సోమవారం సరికొత్త ఉదయాన్ని చూశారు. 44 లక్షల మంది పనుల కోసం బయటకు వచ్చారు. లాక్‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం పాక్షికంగా సడలించడంతో వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. నిర్మాణ, ఉత్పత్తి రంగాల్లో కొత్త కళ కనిపించింది. రోడ్లపైకి వచ్చిన జనంలో ముఖాల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. మరోవైపు, ఐరోపా దేశాల్లో చాలా వరకు తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. వైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రానప్పటికీ ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వడంతో చాలా రంగాల్లో పనులు మొదలయ్యాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/