ఈవిఎంలపై ఫిర్యాదులకు కంట్రోల్‌ రూం

control room
control room


న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈవిఎంల భద్రతపై వ్యక్తమవుతున్న అనుమానాల నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసి) చర్యలకు ఉపక్రమించింది. ఈవిఎంలపై ఎటువంటి ఫిర్యాదులున్నా ఈసి దృష్టికి తీసుకువచ్చేలా 24 గంటల ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద భద్రత, తమ ఏజెంట్లను స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఉంచడానికి అభ్యర్దులకు కావాల్సిన అనుమతులు, కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో ఈవిఎంలకు సంబంధించి ఇబ్బందులు ఇలా పలు అంశాలపై ఏవైనా అనుమానాలుంటే కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన 011-23052123 నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు ఈసి మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనను విడుదల చేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/