నేడు గుజరాత్‌, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న ఈసీ

ec-to-announce-poll-schedule-for-gujarat-himachal-pradesh

న్యూఢిల్లీః గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్‌ అసెంబ్లీ టర్మ్‌ ముగుస్తుంది. ఇక జనవరి 8వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది. అయితే ఎన్నికల సంసిద్ధను పరిశీలించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ ఈసీ అధికారులు విజిట్‌ చేశారు.

కాగా, గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ నుంచి బిజెపికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేత కేజ్రీవాల్‌ ఇటీవల మాటిమాటికీ గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్ హిమాచల్‌ ప్రదేశ్‌లో బిజెపి సర్కార్‌ నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవల బిజెపి కేంద్ర నేతలు పర్యటిస్తూనే ఉన్నారు. ప్రధాని మోడీ కూడా ఇటీవల అనేక కార్యక్రమాలను చేపట్టారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/