తెలంగాణ బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణ బిజెపి పార్టీ కి బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన సాలు దొర‌- సెలవు దొర ప్రచారంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఈ ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం బొమ్మతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలే ‘సాలు దొర-సెలవు దొర’ ప్రచారానికి అనుమతి కోరుతూ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు ఎలక్షన్​ కమిషన్​ను సంప్రదించారు. సాలు దొర- సెలవు దొరపై బీజేపీ విజ్ణప్తిని తోసిపుచ్చిన ఈసీ.. ప్రచారాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో బిజెపి కి గట్టి షాక్ తగిలినట్లయింది.

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ లో కాషాయం జెండా ఎగురవేయాలని బిజెపి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే బిజెపి ఆకర్ష్ తో కీలక నేతలను తమ పార్టీలోకి తీసుకోవడం స్టార్ట్ చేసింది. టిఆర్ఎస్ ను ఓడించేందుకు పక్క వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ను మార్చింది. తరుణ్ చుగ్ స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సునీల్ రైట్ హ్యాండ్ గా వ్యవహరించే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.