చంద్రబాబు లేఖపై ఈసీ సానుకూల స్పందన

CM Chandrababu
CM Chandrababu

న్యూఢిల్లీ: ఏపి సిఎం చంద్రబాబు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘంనికి ఫణి తుఫాను కారణంగా విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల కోడ్‌ నుండి మినహాయింపు ఇవ్వాలని ఈసీకి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఆ లేఖపై ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలో ఎన్నికల కోడ్‌ను మినహయించింది. ఆయన లేఖకు సానుకూలంగా స్పందించిన ఈసీ ఈ మేరకు నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను మినహాయించింది. దీనిపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/