సిఎం కెసిఆర్‌కు ఈసీ నోటీసులు జారీ

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఇటివల కరీంనగర్‌ సభలో చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. ‘ హందూగాళ్లు, బొందు గాళ్లు’ అంటూ కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ తెలిపింది. అయితే సిఎం కెసిఆర్‌ హిందువులను కించపర్చారని వీహెచ్‌పీ నేత రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు కెసిఆర్‌ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 12లోపు వివరణ ఇవ్వాలని కెసిఆర్‌ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/