ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలపై ఈసి సమీక్ష

nagi reddy, ec
nagi reddy, tengana ec


హైదరాబాద్‌: ఈసి నాగిరెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, డిజిపి మహేందర్‌రెడ్డి, నవీన్‌ మిట్టల్‌ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019 ఎంపిటిసి, జెడ్సీటిసి ఎన్నికల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు, భద్రతా సిబ్బంది, ఎన్నికల నిర్వహణ అంశాలపై చర్చ జరిపారు. రాష్ట్రంలో 32 జెడ్పీలు, 535 జెడ్సీటిసిలు, 5857 ఎంపిటిసిలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు 32,007 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఈసి ఆలోచిస్తుంది. ఎన్నికలు నిర్వహించడానికి 55 వేల మంది భద్రతా సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/