ఒడిశాలో ఎన్నిక‌ల కోడ్ ఎత్తివేత‌కు ఈసి ఆమోదం

fani cyclone
fani cyclone

భువనేశ్వర్‌: ఒడిశాలోని ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ ఎత్తివేతకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం 11 తీర ప్రాంత జిల్లాల్లో నియమావళిని ఎత్తివేశారు. అందులో పూరీ, కేంద్రపడ, భద్రక్‌, బాలాసోర్‌, మయూర్‌బంజ్‌, గజపతి, గంజాం, ఖుర్ధా, కటక్‌, జాజ్‌పూర్‌ జిల్లాలు ఉన్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక స్క్రీనింగ్‌ కమిటీ పరిస్థితులను సమీక్షించి చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఎన్నికలు ముగిసిన వెంటనే దిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడాను కలిసి ఫొని ప్రభావంపై చర్చించారు. తీవ్ర ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని కోరారు. అలాగే మే 19కి వాయిదా పడ్డ పాట్‌కుర అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికను కూడా వాయిదా వేయాలని ఆయన కోరారు.

ప్రస్తుతం పూరీకి 710కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను.. మే 3న మధ్యాహ్నం
పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగో
విడతతో ఒడిశాలో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/