ప్రజ్ఞా సింగ్‌ థాకూర్‌కు మరో నోటీసు

Pragya Singh Thakur
Pragya Singh Thakur

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ థాకూర్‌కు ఈరోజు ఈసీ మరో నోటీసు పంపించింది. 25 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు కూల్చినప్పుడు తాను కూడా పాల్గొన్నానని, అందుకు గర్వంగా ఉందని ఆమె గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ కొరడా ఝుళిపించింది. 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధింస్తూ మే 1న ఆదేశాలు జారీ చేసింది. మే 2 ఉదయం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఆమెపై మూడు రోజులు నిషేధం అమల్లో ఉన్నా ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారని ఈసీకి ఒక ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు వివరణ ఇవ్వాలంటూ ఆమెకు నోటీసు జారీ చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/