సిద్ధూకు ఈసి నోటీసులు జారీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను అతనికి నేడు ఈసి నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదిపై సిద్ధూ చేసిన వ్యాఖ్యలను ఈసి తప్పుబట్టింది. మోదీపై చేసిన ఘాటైన కామెంట్స్ ఆధారంగా బిజెపి సిద్ధూపై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 29న భోపాల్లో మాట్లాడుతూ..ప్రధాని మోది దేశద్రోహి అని మాజీ క్రికెటర్ ఆరోపించారు. రాఫేల్ ఒప్పందంలోనూ మోది అవినీతికి పాల్పడ్డారనన్నారు. ఐతే ఆ ప్రసంగ వీడియోలను సమీక్షించిన ఈసి సిద్దూకు నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/