ఓటు వేసే సమయం గంట పెంపు

election commission of india
election commission of india

హైదరాబాద్‌: ఓటర్ల  సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ఎన్నికల సంఘం పోలింగ్‌ సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసే పోలింగ్‌ ప్రక్రియను ఆరు గంటల వరకు పెంచుతూ తాజా ఆదేశాలు జారిచేసింది. అంటే సాయంత్రం ఆరు గంటల సమయానికి పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్న ప్రతి ఒక్క ఓటరుకు ఎంత రాత్రయినా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. మరింత పారదర్శకత కోసం ఈవీఎంలకు వీవీ ప్యాట్‌ను అనుసంధానించి ఓటరు తాను వేసిన ఓటు సవ్యంగా పడిందీ, లేనిదీ పరిశీలించుకునే అవకాశం కూడా ఇటీవల కల్పించారు. వీవీ ప్యాట్‌లో స్లిప్‌ కనిపించి వెళ్లేందుకు ఏడు సెకన్ల సమయం పడుతుంది. దీనివల్ల ఓటర్లు ఓటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మండు వేసవి కాలం, ఎండలు మండిపోతుండడంతో సాయంత్రం కాస్త వాతావరణం చల్లబడ్డాక పోలింగ్‌ కేంద్రానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఈసారి ఓ గంట అదనపు సమయాన్ని కేటాయించింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/